పఠనీయం

గొడ్డుమాంసం తినాల్సిన అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
============================================
గాంధీ అహింసమీద విశ్వాసం వున్నవాడు. మృత్యుముఖంలో వున్న భార్యకు నయం చేయడానికి కూడా మాంసాహార టీ ఇవ్వని, అనారోగ్యంతో వున్న కుమారుని వైద్యానికి కూడా గుడ్లు తినడానికి అంగీకరించని వ్యక్తి. అటువంటిది చెప్పుల తయారీకి జంతువులను చంపడానికి ఎలా ఒప్పుకుంటాడు? కానీ ఆయనకు తోలు కావాలి.
సహజ మరణం పొందిన పశువుల చర్మం మాత్రమే ఉపయోగించాలని ఆయన నిర్ణయించాడు. అలాంటి తోలుతో చేసిన చెప్పులు, బూట్లను ‘అహింసా పాదరక్షలు’ అనేవారు. మృతకళేబరాల చర్మాన్ని పదునుపెట్టడం (చెప్పులు కుట్టేందుకు వీలుగా తయారుచెయ్యడం)కంటే, వధించిన జంతువుల చర్మాలకు పదునుపెట్టడం సులభం. అందుకే తోళ్ళ పరిశ్రమలవాళ్ళు ‘అహింసా తోలు’ సరఫరా చేసేవారు కాదు. అందువల్ల గాంధీ తోలుకు పదునుపెట్టే పని నేర్చుకోక తప్పలేదు.
ప్రతి యేటా 9 కోట్ల రూపాయల విలువైన ముడి తోళ్ళను భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్నారని గాంధీకి తెలిసింది. విదేశాలలో ఆ తోలుకు శాస్ర్తియ పద్ధతుల్లో శుద్ధిచేశాక కోట్లాది రూపాయల తోళ్ళ వస్తువును భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల కేవలం డబ్బు నష్టమే కాకుండా తోళ్ళను శుద్ధి చెయ్యడంలోనూ, మంచి తోలు వస్తువులు తయారుచెయ్యడంలోనూ మనకున్న నైపుణ్యలకూ, తెలివితేటలకూ విలువ లేకుండా పోతోంది. నూలు వడికేవారు, నేతపనివారిలాగ, అనేకమంది తోళ్ళను శుభ్రం చెయ్యడం, తోలు వస్తువులు తయారుచేసేవారు వారి జీవనోపాధి కోల్పోయారు. తోళ్ళను శుభ్రం చెయ్యడం అనేది నీచమైనపని ఎప్పటినుంచి అయ్యిందా అని గాంధీ ఆశ్చర్యపోయాడు. ప్రాచీన కాలంలో అది నీచనమైన పని అయ్యుండే అవకాశం లేదు.
కానీ ఇప్పుడు దాదాపు పది లక్షలమంది తోలును శుభ్రం చేసే పనిచేస్తూ, అంటరానివారుగా పరిగణింపబడుతూ ఉన్నారు. ఉన్నత వర్గాలవారు వీరిని హీనంగా చూస్తారు. చదువు, కళ, పరిశుభ్రత, గౌరవాలకు దూరంగా వీళ్ళు బతుకులు ఈడుస్తున్నారు. తోలు పనివారు, చెప్పులు కుట్టేవారు, పారిశుద్ధ్య పనివారు ఉపయోగకరమైన పనులు చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ కులాల పట్టింపుగల జాతిలో కొంతమంది దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇతర దేశాల్లో ఏ మనిషీ తోలుపని, చెప్పులు కుట్టే పని ఎంచుకోవడంవల్ల పేదవాడు, నిరక్షరాస్యుడు, అంటరానివాడు కాడు.
ఈ గ్రామీణ పరిశ్రమను పునరుజ్జీవింపచేసేందుకు గాంధీ అనేక బహిరంగ విజ్ఞప్తులు చేశాడు. వేగంగా అంతరించిపోతున్న గ్రామీణ తోళ్ళ పరిశ్రమకు జీవం పోయడానికి ఆయన రసాయన శాస్తవ్రేత్తల సలహాలు కూడా తీసుకున్నాడు. తోళ్ళ పరిశ్రమను సంస్కరించడం ద్వారా చనిపోయిన పశువుల మాంసం తినే అలవాటును రూపుమాపవచ్చని గాంధీ భావించాడు. చనిపోయిన పశువును చర్మకారుల ఇంటికి తెచ్చినపుడు అక్కడ పండగ వాతావరణం ఉండేది. ఆ మాంసంతో ఒక రోజు విందు చేసుకోవచ్చని అంతా సంతోషించేవారు. కళేబరాన్ని కత్తులతో చీలుస్తున్నపుడు పిల్లలు చుట్టూ మూగి గెంతులు వేసేవారు. ఎముకలను, మాంసం ముక్కలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ అల్లరిచేసేవారు. ఆ దృశ్యం గాంధీకి ఎవగింపు కలిగించేది.
‘‘చచ్చిన గొడ్డుమాంసం తినడం మీరెందుకు మానరు? మీరు ఆ అలవాటు మానకపోతే నేను మిమ్మల్ని తాకుతాను గాని సాంప్రదాయవాదులంతా మీ సాన్నిహిత్యాన్ని బహిష్కరిస్తారు’’ అని ఆయన హరిజన చర్మకారులతో వాదించేవాడు. ‘‘మేము చచ్చిన గొడ్లను తొలగించాలన్నా, వాటి చర్మాలను ఒలవాలన్నా వాటి మాంసం తినే అలవాటును మానుకోవడం సాధ్యంకాదు’’ అని వారు జవాబిచ్చేవారు. ‘‘ఎందుకు సాధ్యంకాదు? తోళ్ళ పరిశ్రము పెట్టినంత మాత్రాన చచ్చిన గొడ్డుమాంసం తినాల్సిన అవసరం ఏమీ లేదు. పారిశుద్ధ్య పనినీ, తోళ్ళ పనినీ కూడా ఆరోగ్యకరంగా, పరిశుభ్రంగా నిర్వహించవచ్చని నేను అనుభవపూరవకంగా చెప్పగలను’’ అని గాంధీ వాదించేవాడు. సబర్మతీ, వార్ధా ఆశ్రమాలలో గాంధీ తోళ్ళ విభాగాలను ప్రారంభించాడు. ఇవి మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైనా, తర్వాత తోళ్ళను నిల్వ ఉంచేందుకు పక్కా భవనాలు కావాల్సిన స్థాయికి పెరిగాయి.