పఠనీయం

అది ఆమె కంఠాభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోస్టాల్జియా- ఆమె కంఠాభరణం (- పొత్తూరి విజయలక్ష్మి)
వెల: 200/-, ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్, శ్రీ రుషికా పబ్లికేషన్స్,
ఫ్లాట్ నెం.201, వికాసిని అపార్ట్‌మెంట్స్, 2-2-1121/3/3ఎ, న్యూ నల్లకుంట, హైదరాబాద్.
===========================================================
జీవితం హాయిగా సాగిపోవాలంటే ఈ మూడూ కలవాలి. అవి ఏమిటంటే, మనిషి ప్రవృత్తి మంచిదై ఉండాలి. రెండోది తృప్తి కూడా వారు కోరుకున్నదీ వారి ప్రవృత్తికి తోడైనదైతే బంగారానికి మెరుగుపెట్టినట్లు ఉంటుంది. ఇక మూడోది నైపుణ్యం. అదీ చేకూరితే మెరిసే బంగారు నగలు, వజ్రాలు, వైఢూర్యాలు పొదిగినట్లుంటుంది. అలా సమకూరడం ఒక అదృష్టం అయితే, వాటిని పుణికిపుచ్చుకుంటూ, ఆ విలువలు నిలుపుకుంటూ, ఆ విషయాలను గుండెనిండా నింపుకొని, ఒంటినిండా అత్తరులా పులుముకొని ఆస్వాదించడం మరొక ఎత్తు. ప్రతి వ్యక్తికి పుట్టిన ఊరు ఉంటుంది. అమ్మా, నాన్న, బంధువులు, మిత్రులు అందరూ ఉంటారు. కానీ ఆప్యాయతలతో పందిరివేసి, అన్యోన్యంతో అంతా కలిసికట్టుగా బంధుత్వాలను నిలుపుకుంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ విలువల అడుగులలో నడవడానికి ప్రయత్నించడం తనివితీరని ఆనందం. వెలకట్టలేని ఆభరణం. అందుకే ప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారు నోస్టాల్జియాలో జీవిస్తూ ఆనాటి ఊహలకు ఊపిరిపోసి రచనలో నిమగ్నమైపోయారు. ఆమె పుట్టిన వాతావరణం, ఉమ్మడి కుటుంబాల్లోని ఆనందం, ఆప్యాయత, బంధం, అనుబంధం, అనురాగం వంటి పాట్లు అన్నీ ఆమె పసి హృదయంలో పచ్చని మొక్కలుగా నాటుకున్నాయి. దానికితోడు ఆమెలోని హాస్య గుణం, నెమ్మది, మంచితనం, స్నేహభావం అన్నీ కలిసి అందరితోనూ మంచిగా ప్రవర్తించటం, నొప్పించకుండా మాట్లాడటం, కలుపుగోలుగా ఉండడం లాంటి గుణాలు ఆమె అక్షరాలకు పరిమళానే్న అందించాయి. అందుకే తాతగార్ల గొప్పదనం, అమ్మమ్మ, బామ్మలలోని ఆప్యాయత, పిన్ని, అత్త, మామయ్యల పిల్లలు.. అలా అందరూ ఆనందంగా ఉండే స్వభావాన్ని పెంపొందించారు. ఒకే నదిలో వివిధ ఎత్తుల్లో ఎగిరే కెరటాల్లా మురిపిస్తూ, మరిపిస్తూ అలరింపజేశాయి. ఈ నోస్టాల్జియా కాలమ్‌ని ఆంధ్రజ్యోతివారు ప్రచురించడం, దేశ దేశాల్లో నలుమూలల్లో వున్న తెలుగువారు చదివి ఆనందించడం ఒక ఎతె్తైతే, వారందరూ కూడా మేము ఈ రచనని గ్రంథంగా తీసుకొస్తాం అని, అందరూ కూడా ప్రచురణకు ప్రాణం పోయడం మరొక ఎత్తు. ఇంకో విషయం నాకు అమెరికాలోని ఫీనిక్స్ నగరం అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళితే, రెండు వేల సంవత్సరంలో అక్కడి తెలుగు అసోసియేషన్‌వారు నన్ను సన్మానించారు. ఆ సంఘటన నా నోస్టాల్జియా. మా పొత్తూరి విజయలక్ష్మి నైజం, ఎవరినైనా పలకరించి చక్కగా నవ్వడం, నవ్వించడం. ఆమె సహృదయురాలు. ఆమె కలం మరిన్ని నవ్వులు పూయిస్తూ అక్షర పుష్పలు ప్రసరించాలని ఆశిస్తూ అందరూ ఈ గ్రంథం, కాని, చదివి ఆనాటి కుటుంబ వ్యవస్థ, విలువలు, ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకొని ఆనందించాలని కోరుతూ, పొత్తూరు విజయలక్ష్మిని అభినందిస్తున్నాము.

-శారదా అశోకవర్థన్