పఠనీయం

శాస్తవ్రిధానమే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
====================================================
ఆశ్రమంలోని యువకులు నిపుణులైన చర్మకారుల పర్యవేక్షణలో తోళ్ళ పని నిర్వహించేందుకు తగిన భవనాలను నిర్మించేందుకు గాంధీ 50 వేల రూపాయలు పోగుచేశాడు. అక్కడ తయారుచేసిన తోలు ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లో అమ్మేవారు. మొత్తం పనంతా సహజంగా మరణించిన పశువుల నుంచి సేకరించిన తోళ్లతోనే జరిగేది.
కోల్‌కతాలోని జాతీయ తోళ్ళ తయారీ కేంద్రాన్ని గాంధీ సందర్శించి ఎర్రతోలును ఎలా తయారుచేస్తారో ఆసక్తిగా గమనించారు. ఉప్పులో ఊరబెట్టిన ఆవు చర్మాలకు సున్నంపూసి వెంట్రుకలను తొలగించడం, రంగు వేయడం నేర్చుకున్నాడు. గ్రామీణ తోళ్ళ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఠాగూర్ శాంతినికేతన్‌లో చేస్తున్న పరిశోధనలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. తోళ్ళను శుభ్రం చేయడంలో ప్రాచీనమైన గ్రామీణ పద్ధతిని పూర్తిగా మార్చేయడం గాంధీకి ఇష్టం లేదు.
తోళ్ళపరిశ్రనుగానీ, మరే ఇతర గ్రామీణ పరిశ్రమనుగానీ పట్టణాలకు తరలించడమూ ఆయనకు ఇష్టంలేదు. అలా తరలించడంవల్ల గ్రామీణులకు నష్టం జరుగుతుందని ఆయన నమ్మకం. తమ మెదళ్ళను, చేతులను నైపుణ్యంగా ఉపయోగించే కొద్దిపాటి అవకాశం వారికి లేకుండా పోతుంది. వచ్చిన పశువులను గ్రామంలో ఒకచోటినుంచి మరొక చోటికి తరలించేందుకు ఒక గౌరవనీయమైన పద్ధతి కనిపెట్టాలని గాంధీ భావించాడు.
గ్రామీణ చర్మకారులు పశువును నేలమీద ఈడ్చుకుంటూ పోతారు. దానివల్ల కళేబరానికి గాయాలు అవుతాయి. తోలు విలువ తగ్గిపోతుంది. ఎముకలను ఎలా సద్వినియోగం చేయాలో కూడా గ్రామీణ చర్మకారులకు తెలియదు. వారు వాటిని కుక్కలకు ఆహారంగా వేసి నష్టపోయేవారు. ఎముకలతో చేసిన హ్యాండిల్స్, గుండీలు విదేశాలనుంచీ మన దేశానికి దిగుమతి అవుతాయి. ఎముకల పొడి పొలాలకు మంచి ఎరువుగా ఉపయోగపడుంతుంది కూడా.
గాంధీ చర్మకారుల గుడిసెలకు వెళ్ళి వాళ్ళతో కలిసిపోయేవాడు. వాళ్ళు కూడా ఆయనమీద చాలా విశ్వాసముంచేవారు. వారి జీవితాలను బాగుచేయడానికి వచ్చిన స్నేహితునిలా భావించి ఆయన మార్గదర్శనం కోసం చూసేవారు. ఆయన వాళ్ళ వాడలకు వెళ్లినపుడు మంచినీటి సౌకర్యం లేకపోవడం గురించి ఫిర్యాదు చేసేవాళ్లు. ఊరి బావి నుంచి వారిని నీరు తోడుకోనివ్వకపోవడం గురించి, దేవాలయాల్లోకి రానివ్వకపోవడం గురించి, వారిని దూరంగా ఊరి చివర ఉంచడం గురించి వాళ్లు ఆయనకు చెప్పేవారు. గాంధీకి చాలా బాధ, సిగ్గు కలిగేవి. వాళ్ళకు విరాళాలు ఇవ్వడం మీద ఆయనకు నమ్మకం లేదు. వాళ్ళ కాళ్ళమీద వారు నిలబడాలని ఆయన కోరిక. శారీరక శ్రమను తక్కువగా చూడటం ప్రారంభించిన రోజునుంచే భారతదేశానికి చెడ్డరోజులు ప్రారంభమయ్యానీ, తమ సోదరుల మానవ హక్కులను కాలరాచినవారు తమ అన్యాయాలకూ, క్రూరత్వానికీ జవాబు చెప్పుకోవలసిన రోజు వస్తుందనీ ఆయన ఠాగూర్‌తో కలిసి జోస్యం చెప్పాడు.
చర్మకారులకు సరైన వేతనం, నిజమైన విద్య, వైద్య సహాయం అందేలా చూసేందుకు అంకితభావంగల సేవకుల దళం కావాలని గాంధీ భావించాడు. ఈ సహాయకులు రాత్రి బడులు నడుపుతారు. హరిజన బాలలని విహార యాత్రలకు తీసుకువెళతారు. చర్మకారుల నివాసాలలో గాంధీ స్వయంగా రాత్రిబడులు నెలకొల్పి, హరిజన సేవ చేయడం మీద దృష్టి కేంద్రీకరించాడు. అందుకు చర్మకారులు సానుకూలంగా స్పందించడం ప్రారంభించారు. కొంతమంది కేవలం సహజ మరణం పొందిన పశువుల చర్మాలనే వినియోగిస్తామని ప్రమాణం చేశారు. మరికొందరు తాగుడు మానివేస్తామని, చచ్చిన గొడ్డుమాంసం తినడం మానేస్తామని ప్రమాణం చేశారు. గాంధీ ఒకసారి చర్మకారుల సమావేశానికి అరిగి, చిరిగిపోయిన చెప్పులతో వెళ్ళాడు. అప్పుడు ఆయనపర్యటనలో ఉన్నాడు. ఆయన వద్ద ఇంకొక చెప్పుల జత లేదు. చర్మకారులు ఆ విషయం గమనించారు. వారిలో ఇద్దరు ఆయనకు అహింసాత్మక చెప్పుల జతను తయారుచేసి బహూకరించారు.
గాంధీ ఒక సందర్భంలో తనను దక్షిణాఫ్రికా జైలులో ఉంచిన ‘జనరల్ స్మట్స్’ కోసం స్వయంగా తయారుచేసిన చెప్పుల జత ఒకటి బహుమతిగా ఇచ్చాడు.