పఠనీయం

కథల కార్యశాల ‘కథావిష్కారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథావిష్కారం
విమర్శా వ్యాసాలు, పేజీలు:200, రచన: కె.పి.అశోక్‌కుమార్, వెల:రూ.120/-
ప్రతులకు: రచయిత, 9700000948 మరియు ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
====================================================
ఏ రచనా ప్రక్రియలోనూ వేలు పెట్టకున్నా పఠనమే అభిరుచిగా దశాబ్దాలపాటు సాహితీ లోక విహారం చేసేవారెందరో ఉంటారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో రచయితలు కాని పాఠకులు రచనలపట్లచేస్తున్న వ్యాఖ్యానాలు నిజంగా అబ్బురపరుస్తాయి. ఉత్తమ విమర్శ సాహిత్యాన్ని వడగట్టి నాణ్యమైన రచనలకుదారి చూపుతుంది. వారి ‘గురు’తర బాధ్యత ముందు కలాలు తలలు వంచవలసిందే.
రచనను చదివినవారెవరైనా ప్రాథమికంగా వారు పాఠకులే. వారు స్పందించిన తీరును బట్టి స్థాయి మారిపోతుంది. కాలక్రమంగా వచ్చే రచనల్ని ఒడిసిపట్టి, వాటిపై బలమైన విశే్లషణ జరగకపోతే సాహిత్య చరిత్ర కూడా కుంటుపడుతుంది. అయితే రచయితకన్నా విశే్లషకుడి పాత్ర కఠినతరమైనది. విస్తారమైన పఠనంతోపాటు సమకాలీన ఆవశ్యకతలపై అవగాహన, త్రికాలాలపై తులనాత్మక పరిజ్ఞానం విశే్లషకుడి ఆవశ్యక పనిమట్టు. చదివిన పుస్తకాల సారాన్ని మెదడు అరల్లో భద్రపరచుకొని, నిత్యనూతంగా కాపాడుకోవడం అత్యంత క్లిష్టమైన క్రియ. ఇలాంటివారిలో కె.పి.అశోక్‌కుమార్ ముందు వరుసలో సైతం ముందుంటారు. పుస్తక సమీక్షలు ఎన్నున్నా సంఖ్యాపంరగా కాక ఆయన విశే్లషణలో వున్న లోతు, గాఢత, సూటిదనం, తులనాత్మకత, ఆయన్ని ఇంతకాలంగా నిలబెడుతూ వచ్చాయి. కె.పి.అశోక్‌కుమార్ విమర్శా వ్యాసాల సమాహారమే ‘కథావిష్కారం’. ఇందులో మొత్తం 22 వ్యాసాలున్నాయి. సుమారు దశబ్దాకాలం (2009, 19)లో రచయిత రాసిన ఎన్నో వ్యాసాల్లో సామాజిక ప్రయోజన దృష్టితో ఎంపికైన వ్యాసాలివి, విశిష్ట రచనలకు ఇచ్చిన గౌరవమిది.
నవంబర్ 2008లో కేంద్ర సాహిత్య అకాడమీ బెంగుళూరులో ఏర్పాటుచేసిన సెమినార్‌లో రచయిత ప్రసంగ వ్యాసం ఈ సంపుటిలోని తొలి వ్యాసం. ‘తెలంగాణ కథల్లో ప్రతిఫలించే సామాజిక - సాంస్కృతిక పరివర్తనలు’ దీని పేరు. కాలమానం, కథాగమనం సమాంతరంగా సాగే తెలంగాణ కథపైసాగిన చారిత్రక పయనంలో తోడు సాగవలసిందే. ఎన్నో తొలి తరం తెలంగాణా కథల్ని ఎందరో కథకుల పరిచయాలలు సాహిత్యాభిలాషులందరికీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆత్మహత్యకు తలపడ్డ ఒక పేద రైతు గురించి భాస్కరభట్ల కృష్ణారావు కథ ‘ఇజ్జత్’ కౌలు రైతు అసహాతను వ్యక్తం చేస్తుంది. 1940కి పూర్వమే తెలంగాణ కథ ఉందని కె.పి సోదాహరణంగా పేర్కొన్నారు. కొనకళ్ల వెంకటరత్నం రాసిన ‘కొనకళ్ల కథలు’లోని కథలను, వాటి కథనక్రమాన్ని, విశేషతలను వివరిస్తూ అశోక్‌కుమార్- ఇలాంటి కథలు రాయడం ద్వారా కొనకళ్ల కథకుడిగా సదభిప్రయాన్ని పోగొట్టుకున్నారు అంటారు. బొంబాయిలోని తెలుగు కార్మికుల జీవితాల్ని కథలుగా మలచినవారిలో అంబల్ల జనార్దన్‌కు అగ్రతాంబూలం లభిస్తుంది. అంబల్ల రాసిన వైవిధ్య కథలను ఒక్కోదాన్ని విశే్లషిస్తూ అశోక్‌కుమార్ కథాసారాన్ని మనముందుంచారు.
‘ఒక ఇతివృత్తం: ఓ కథ - ఓ సినిమా’ అనే వ్యాసం విలక్షణమైనది. పలమనేరు బాలాజీ రాసిన కథ ఏనుగుల రాజ్యం. రెండింటిలోనూ పర్యావరణ విధ్వంసంవల్ల ఊర్లలోకి ఏనుగులు గుంపులుగా రావడంవల్ల పంట నష్టం, పొలాల ధ్వంసం, మనుషుల ప్రాణాలకు సైతం భద్రతాలేమి లాంటి సమస్యలు, పరిష్కారదిశగా గ్రామస్థులు, ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు ఈ రచనల మూలాంశాలు.
తెలుగు విమర్శలో బహుశా ఎవరూ స్పృశించని దిశగా ‘తెలుగులో సీక్వెల్ కథలు’పై ఓ వ్యాసం ఇందులో ఉంది. ఒకే రచయిత తన రచనలకు కొనసాగింపుగా కథలుగాని, నవలలుగాని రాయడం వీటి ప్రత్యేకత.
అంపశయ్య నవీన్ రాసిన అంపశయ్యకు ముళ్లపొదలు, అంతస్స్రవంతి సీక్వెల్ రచనలు. పాపినేని రవిశంకర్ రాసిన కథల్లో మనిషి పరారుూకరణ నేపథ్యంగా కె.పి. ఓ క్లిష్టమైన వ్యాసాన్ని సమర్థవంతంగా రాశారు. ‘ఈ కథకు శిల్పం లేదు’ అనే జొన్నవిత్తుల కథా సంపుటిపై కెపి సమీక్ష సమగ్రంగా ఉంది. కథాంశాల్లో విలక్షణతోపాటు కథనంలో వున్న శిల్ప సౌష్టతను చర్చించడం జరిగింది. తెలుగులో తొలి భయానక కథలు అనేది చిన్న వ్యాసమే అయినా ఈ అంశం ఎప్పుడూ చర్చకు అంటరానిదిగానే మిగిలింది. యండమూరికన్నా ముందు విశ్వనాథ్ ‘బాణామతి’ అనే హారర్ నవల రాశారని, దెయ్యాలమీద న్యాయాపతి రుక్మిణమ్మ వరుసగా కథలు రాశారని- ఇలా ఈ వ్యాసంలో ఎందరికో తెలియని విషయాలున్నాయి.
బి.ఎస్.రాములు కథల్లో కాలం తెచ్చిన మార్పులు వ్యాసం ఓ సద్విమర్శకు ఉదాహరణగా మిగులుతుంది. బి.ఎస్. కథల్ని కెపి దీర్ఘకాలంగా గమనిస్తున్నట్లు ఈ వ్యాసంలోని చర్చ ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ సంపుటిలో పోరంకి దక్షిణామూర్తి, పాలకోడేటి సత్యనారాయణరావు, వేముల ప్రభాకర్, మధురాంతకం నరేంద్ర, ధేనువకొండ శ్రీరామమూర్తి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య మరికొందరు పేరొందిన కథల పుస్తకాలు పరిచయ సమీక్షలున్నాయి.

-బి.నర్సన్, 9440128169