పఠనీయం

రామాయణ గాథకు మూలం త్యాగమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతావతారాలు
-ముక్కామల నాగభూషణం
పేజీలు: 125
వెల: రూ.100
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలలోనూ.

= = = = = = = = = = = = = = = = = = = = = = = ==

పండితుడు, రాజకీయవేత్త అయిన ముక్కామల నాగభూషణం శాస్ర్తియ దృష్టితో ‘రామాయణం’ ‘మహాభారతం’ ఈ రెండు కావ్యాలనూ పరిశీలించి మన ముందు ఈ గ్రంథంలో ఉంచారు. మానవ వికాస పరిణామ క్రమంలో ప్రధాన అంశాలను చర్చించిన తర్వాత స్ర్తి పురుష సంబంధాలలో వచ్చిన మార్పులను వివరించితే కానీ రామాయణ భారతాలు ఏనాటివో. వాటిని రాసిన వారెవరో శాస్ర్తియంగా తేలదని రచయిత అభిప్రాయం అని గ్రంథం వెనుక అట్ట మీద గ్రంథ ప్రచురణకర్తలు రాశారు.
రామాయణ గాథకు మూలం త్యాగమని, భారత గాథకు మూలం రాజ్యకాంక్ష అని రెండు దృక్పథాలు ఈ రచయిత చెప్పారు. అయితే నన్నయ్య తెలుగు భారతాన్ని ఆంధ్రీకరించినపుడు చెప్పిన పద్యాలు చదివిన వారు దీనితో ఏకీభవించకపోవచ్చు.
అదే పుస్తకంలో డా.ఎన్.వి.రావుగారు ఒక దినపత్రికలో రాసిన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాజుల విధులను, ప్రజల బాధ్యతలను ధర్మసూత్రాల ఉక్కుచట్రంలో బిగించి, నాటి సమాజం మధ్య ఉత్పత్తి జరిగిన అదనపు విలువల పంపిణీ పద్ధతులను రాజ్యాంగం ద్వారా అమలు జరిపేలా చూశారని రావుగారు అభిప్రాయపడ్డారు.
అదే గ్రంథంలో ఎ.ఎస్.అవధానిగారు ‘్భరతి’ పత్రిక జూన్ 1978లో రాసిన అభిప్రాయం ఉన్నది రామకథ పశుసంపదకు సంబంధించినదే అయి ఉంటుందనీ, ఆర్యులు అనాగరిక యుగం మధ్య దశలో ఉన్నప్పుడు ఈ కథ పుట్టి ఉంటుందని మార్క్సిస్టు దృక్పథంగల నాగభూషణం అభిప్రాయమని అవధానిగారు రాశారు.
ఏది ఏమైనా ఈ గ్రంథంలో రచయిత తనకు అనుకూలమైన వారి వాదాలను ఉదా.వాష్‌బర్గ్ హాస్కిన్స్, ఎస్.ఎ.డాంగే, డా.రోమిలా థాపర్ ఉదహరించారు.
ఇది ప్రథమ ముద్రణ మే 2018 అని విశాలాంధ్ర వారు లోపలి టైటిల్ పేజీలో రాశారు. కాని 1978, 1979లోనే ఈ గ్రంథం మీద వివిధ అభిప్రాయాలు ఇదే గ్రంథంలో ప్రచురించారు. ఎవరైనా చరిత్రకారులు ఒక నూరు సంవత్సరాల తరువాత పరిశోధిస్తే భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాలం మహాప్రవాహం లాంటిది. ఇవి తేలేవి కావు. ఇటువంటి పరిశీలనలు ఒక యూనివర్సిటీలో పిహెచ్.డి సంపాదించటానికి ఉపయోగిస్తాయి.
ఒక మార్క్సిస్టు దృక్పథం నుంచి పరిశీలించిన రచన ఇది. ఇంతకంటే విజ్ఞులు ఏమీ ఆశించరు.
ఏది ఏమైనా వివిధ అభిప్రాయాలు వ్యక్తపరచిన అందరూ ఒక విషయంలో ఈ గ్రంథంలో ఏకీభవించారు అది - ‘రామాయణ భారత గాథలు రెండూ శతావతారాలు ఎత్తినప్పటికీ వాటిని చారిత్రక దృష్టితో పరిశీలించాలి’ అని ప్రజల మనస్సులపై మత్తుమందు చల్లి మూఢ నమ్మకాలను పెంచే గ్రంథాలని వాటిని త్రోసిపుచ్చకూడదు.
ధైర్యంగా తన పరిశీలనలను పాఠకుల ముందుంచిన రచయిత అభినందనీయుడు.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649