పఠనీయం

పరిశుభ్రతతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=========================================================
సత్యాగ్రహులు 2500లకు చేరుకోగానే గాంధీజీ యాత్రికులకు నాయకత్వం వహిస్తూ వారికి వంటవాడుగా పనిచేశాడు. ఒకరోజు పప్పు నీళ్ళుగా ఉంటే, మరొక రోజు అన్నం ఉడికీ ఉడకనట్లుండేది. ఐనా వారంతా గాంధీని ఎంతగా ప్రేమించే వారంటే కనీసం గొణుక్కోకుండా వాటిని తినేసేవారు. దక్షిణాఫ్రికా జైలులో ఉన్నపుడు తోటి ఖైదీలకు గాంధీ వంటలో సహాయం చేశాడు. చదువులో వంట తప్పనిసరి భాగంగా గాంధీ భావించాడు. టాల్‌స్టాయ్ క్షేత్రంలో, ఆశ్రమంలో పిల్లలందరికీ వంట వచ్చని గర్వంగా చెప్పేవాడు. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన కొత్తలో గాంధీ తన వంట పిచ్చిని శాంతినికేతన్ విద్యార్థులకు కూడా అంటించాడు. సామూహిక వంటశాలను నిర్వహిస్తూ వంతులవారీగా తామే వంట చేసుకోవడం అనే ఆలోచన శాంతినికేతన్ విద్యార్థులకు బాగా నచ్చింది. టాగూర్‌కు ఈ పథకంలోని ఆచరణీయతపై సందేహాలున్నప్పటికీ తన ఆమోదం తెలిపాడు.
మద్రాసులోని ఒక విద్యార్థి వసతి గృహంలో వేర్వేరు కులాలవారికి వేర్వేరు వంటశాలలు, వారి రుచులను సంతృప్తిపరిచేందుకు రకరకాల మసాలాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక బెంగాలీ ఇంట్లో భోజనానికి వెళ్ళినపుడు విందులో లెక్కలేనన్ని వంటకాలు వడ్డించడం చూసి కూడా అలాగే బాధపడ్డాడు. అప్పటినుంచి ఆయన రోజుకి ఐదు రకాల ఆహారపదార్థాలకన్నా ఎక్కువ తినకూడదని నిర్ణయించుకున్నాడు. బీహార్‌లో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న అంటరానితనాన్ని కూడా ఆయన అతిక్రమించాడు. చంపారన్ కేసులో తనకు సహాయపడుతున్న న్యాయవాదులు అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశాడు. నోటిరుచి కోసం ఆహార పదార్థాలకు మసాలాలు, తాలింపులు వెయ్యడంకన్నా పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా వంట చేయడానికే అధిక ప్రాధాన్యతను ఇచ్చేవాడు.
మరొకసారి కస్తూర్బా వారం రోజులపాటు వేపరసం తాగుతూ, ఉపవాసం ఉండాల్సి వచ్చింది. జీర్ణవ్యవస్థనూ, పెద్దపేగులనూ శుభ్రంగా ఉంచుకోవడం మీద గాంధీ శ్రద్ధ చూపేవాడు. పేగులో పేరుకొన్న విషాలను నాశనం చేయడానికి ఆయన లంఖణాలు, ఉపవాసాలు, ఎనిమా సూచించేవాడు. తలనొప్పులు, అజీర్ణం, విరోచనాలు, మలబద్ధకం అనేవి తిండి ఎక్కువ అవడంవల్ల, క్రమబద్ధమైన వ్యాయామం లేకపోవడంవల్ల వస్తున్నాయని ఆయన విశ్వసించేవాడు.
సుదీర్ఘమైన, వేగమైన నడక ఆయన దృష్టిలో తిరుగులేని వ్యాయామం. జైలులో కూడా అతడికి కేటాయించిన ప్రదేశంలోనే ఆయన ఉదయం, సాయంత్రం నడక కొనసాగించేవాడు. ఆయన ప్రాణాయామాన్ని కూడా బోధించేవాడు. మానసిక అనారోగ్యం కూడా శారీరక దృఢత్వం మీద ప్రభావం చూపుతుందని ఆయన విశ్వసించేవాడు. ఆయన దృష్టిలో భగవంతుని మీద పూర్తి విశ్వాసముంచి బాధలన్నిటినీ మరచిపోవడం అన్ని జబ్బులకీ మందు.
దక్షిణాఫ్రికాలో గాంధీ మీద ఒక పఠాన్ దాడి చేసినప్పుడు గాయపడిన మూతి, నుదురు, పక్కటెముకలకు మట్టి పట్టీలు వేసుకున్నాడు. వాపు త్వరలోనే తగ్గిపోయింది.
ప్లేగు, మలేరియా, విషజ్వరం, డిస్పెప్సియా, కామెర్లు రక్తపోటు, తీవ్రమైన కాలిన గాయాలు, మశూచి, విరిగిన ఎముకలు- వీటన్నిటికీ ఆయన మట్టిపూత చికిత్సను వాడేవాడు. గాంధీ కొడుకు ఒక ప్రయాణంలో చేతి ఎముకను విరగ్గొట్టుకున్నాడు. గాంధీ దానికి మట్టికట్టు కట్టి తగ్గించాడు. ఆయన చాలా వ్యాధులను తన చికిత్సా పద్ధతిలో నయం చేసినప్పటికీ, తన పద్ధతులను వేదవాక్యంగా తీసుకోవద్దని హెచ్చరించేవాడు. అలాంటి సాంప్రదాయ వ్యతిరేక చికిత్సా ప్రయోగాలలో ప్రమాదం పొంచి ఉంటుందని ఆయనకు తెలుసు. తాను రాసిన ‘ఎ గైడ్ టు హెల్త్’ అన్న పుస్తకంలో శారీరక దృఢత్వాన్ని కాపాడుకొనేందుకు సాహసోపేతమైన పద్ధతులు ఉన్నాయని ఆయన అంగీకరించేవాడు. ప్రసూతి కేంద్రాలు, వైద్యశాలలు, చికిత్సా కేంద్రాలు తెరవడం మీద ఆయనకు ఆసక్తి లేదు. ప్రజలకు పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానాలు నేర్పాలనేది ఆయన ఉద్దేశ్యం. చికిత్సా పద్ధతులకన్నా నివారణా విధానాలు ఎక్కువగా అమలు చేయాలనేది ఆయన భావన.