పఠనీయం

అన్నింటికీ శ్రద్ధ అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=================================================
అతను రహస్యంగా రోజుకు ఒకటి రెండు సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోవడమే దీనికి కారణం.
ఒక రోజు రాత్రి చీకటిలో అతడు సిగరెట్ అంటించేందుకు అగ్గిపుల్ల వెలిగించాడు. వెంటనే అతని మొహంమీద ఒక టార్చిలైటు కాంతి పడింది. తలెత్తి చూస్తే ఆయన ముందు గాంధీ నిలబడి ఉన్నాడు. అతడు వెంటనే గాంధీకి క్షమాపణలు చెప్పుకున్నాడు. అప్పటినుంచీ పొగతాగడం పూర్తిగా మానేశాడు. అతని ఆస్తమా కూడా కొద్ది రోజుల్లోనే మాయమయ్యింది. బాద్‌షాఖాన్‌కు ఒకసారి ఒకచర్మవ్యాధి వచ్చింది. దానికి చికిత్సగా గాంధీ చెప్పిన వైద్యసలహా ఆ పొడవాటి పఠాన్ నాయకుడిని రోగంకన్నా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. ఒకసారి వల్లభభాయ్ కాలుకు ముల్లు గుచ్చుకుంది. దాని చికిత్సలో అయోడిన్‌కు బదులుగా కాల్చిన జీడిపిక్కను గాంధీ వినియోగించాడు. ‘‘ఈ వైద్యంకన్నా ముల్లుబాధే తక్కువగా ఉంది’’ అన్నాడు వల్లభభాయ్.
నర్సు
కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ సలహా కోసం ఒకసారి సేవాగ్రామ్‌కి వెళ్లారు. అక్కడ ఆయన జబ్బుతో బాధపడుతున్న ఇద్దరు ఆశ్రమవాసులకు తడిగుడ్డ పట్టీలు వేయడంలో, కటి స్నానాలు చేయించడంలో తీరిక లేకుండా ఉన్నాడు. ‘‘ఈ పనులన్నీ మీరు చేయాల్సిందేనా?’’ ఆ నాయకులలో ఒకరు గాంధీని అడిగారు. ‘‘మరి ఎవరు చేస్తారు? మీరొకసారి ఊళ్ళోకి వెళితే అక్కడున్న 600 మందిలో 300 మంది జబ్బుపడి కనిపిస్తారు.’’ అని గాంధీ సమాధానం చెప్పాడు. రోగులకు వైద్య సేవలందించడం మీద బాల్యం నుంచే గాంధీకి చాలా ఆసక్తి ఉండేది. బడి గంట కొట్టగానే జబ్బుతో వున్న తండ్రికి వైద్య సేవలందించేందుకు పరిగెత్తేవాడు.
ఆయనకు మందులిచ్చేవాడు, గాయానికి కట్టుకట్టేవాడు, వైద్యుల సూచనల ప్రకారం మందులు సిద్ధం చేసేవాడు. పెద్దవుతున్న కొద్దీ ఆయనలో రోగులకు సేవ చేయాలనే కాంక్ష వృద్ధి చెందింది. దక్షిణాఫ్రికాలో ఆయన రోజుకు రెండు గంటలపాటు ఒక ధర్మాసుపత్రిలో నర్సుగా సేవలందించేవాడు. మందుల చీటిని అర్థంచేసుకొని వాటి ప్రకారం మందులు వేయడం ఆయన అక్కడే నేర్చుకున్నాడు. న్యాయవాదిగా తన వద్దకు వచ్చిన కేసులన్నిటినీ ఒప్పుకుంటే నర్సు పనిచేయడానికి సమయం దొరకదని, తనకేసులు కొన్నింటిని స్నేహితుడైన ముస్లిం న్యాయవాదికి అప్పగించేవాడు.
1896లో గాంధీ కొద్దిరోజులపాటు భారతదేశానికి వచ్చినపుడు జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయులు పడుతున్న కష్టాలను ఇక్కడి నాయకులకు వివరించడంలో క్షణం తీరిక లేకుండా గడిపాడు. స్థిరపడిన ఆ వివరాలతో కూర్చిన హరిత కరపత్రం (గ్రీన్ ఫాంప్లెట్) పంచి పెట్టడానికే ఆయన సమయమంతా సరిపోయేది. అయినా తన బావగారికి తీవ్రమైన జబ్బు చేసిందని, నర్సును పెట్టుకొనే ఆర్థిక స్థోమత చెల్లెలకు లేదని ఆయనకు తెలిసిన మరుక్షణం రోగిని తన ఇంటికి తెచ్చుకొని, తన గదిలో పెట్టుకొని, అతనికి రాత్రింబవళ్ళు సేవలు చేశాడు.
తన ఎనిమిదేళ్ల కొడుకుకి చేయి విరిగినప్పుడు దాదాపు నెల రోజులపాటు అతని గాయానికి కట్టు మారుస్తూండేవాడు. డాక్టరు కట్టిన బ్యాండేజిని విప్పి, గాయాన్ని కడిగి, శుభ్రమైన మట్టి పట్టీవేసి మళ్లీ కట్టు కట్టేవాడు. ఇలా ఆ గాయం తగ్గిపోయేంత వరకూ చేశాడు. పదేళ్ల కొడుక్కి టైఫాయిడ్ వచ్చినపుడు 40 రోజులపాటు గాంధీ అతనికి సేవలు చేశాడు. పిల్లాడు దీనంగా మారాం చేస్తున్నా వినకుండా అతడిని తడి గుడ్డలతో చుట్టి వాటిమీద పొడి దుప్పట్లను కప్పేవాడు. గాంధీ తన రోగులపట్ల చాలా శ్రద్ధగా, ప్రేమగా ఉండేవాడు. కానీ చికిత్సలో సడసలింపునకు ఏ మాత్రం ఒప్పుకొనేవాడు కాదు. ఒకసారి మరో టైపాయిడ్ రోగికి వైద్య సేవలు చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి పక్షం రోజులపాటు మృత్తికా వైద్యం, కటిస్నానం చేయించాడు. ప్రతి గంటన్నరకీ అతని పొత్తికడుపుమీద ఒక అంగుళం మందం వున్న కొత్త మట్టి పట్టీ వేసేవాడు. జ్వరం తగ్గినతర్వాత పండిన అరటిపళ్ళను అతనికి పథ్యంగా నిర్ణయించాడు. గాంధీ స్వయంగా అరటి పళ్లను పావు గంటపాటు మెత్తగా గుజ్జు చేసి పిల్లాడిని బుజ్జగించి తినిపించేవాడు. పిల్లవాడిపై ప్రేమతో ఎక్కువ పెట్టేస్తుందేమోనని ఆయన ఆ పనిని వాళ్లమ్మకు కూడా అప్పగించలేదు.