పఠనీయం

కళావిష్కరణతో కొత్త చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
===============================================
నేత పనివాడు
ఒకసారి గాంధీని అరెస్టు చేసినపుడు మేజిస్ట్రేట్ ‘మీ వృత్తేమిటి?’ అని అడిగాడు. ‘నేనొక రైతుని, నేతగాడిని. నూలు వడుకుతూ, బట్టలు నేస్తూ ఉంటాను’ అని గాంధీ సమాధానమిచ్చాడు. అప్పుడు ఆయన వయసు 64 సంవత్సరాలు. అంతకు పాతికేళ్ల ముందు ఆయన హింద్ స్వరాజ్ అనే గ్రంథం రాసాడు. అందులో ఆయన స్వదేశీ వస్తువులు వాడాల్సిన అవసరాన్ని, లోపల నుంచి బయట నుంచీ జరుగుతున్న దోపిడీనుంచి భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. అప్పటివరకూ ఆయన చేతి మగ్గాన్ని చూడలేదు, చరఖాకి, చేతి మగ్గానికి వున్న తేడా కూడా ఆయనకు తెలియదు. కానీ ఇంగ్లాండునుంచి దిగుమతైన వస్త్రాల కారణంగా భారతీయ నేత పనివారి జీవితాలు ఎంతగా నాశనమయ్యాయో ఆయనకు తెలుసు. భారతీయులు విదేశీ నాజూకు వస్త్రాలమీద మోజుపడటం ద్వారా ఒక విదేశీ ప్రభుత్వం మన దేశంలో పట్టు సంపాదించి బలపడేందుకు ఎలా అవకాశమిచ్చారో కూడా ఆయనకు తెలుసు. ఈస్టిండియా కంపెనీవారు తమ వస్త్రాలకు పోటీ లేకుండా చేయడం కోసం సన్నని నూలు వస్త్రాలు నేసే నేతవాళ్ల బొటనవేళ్లను నరికేసేవారట.
భారతదేశాన్ని బ్రిటీషువారు ఆక్రమించిన తర్వాత 40 ఏళ్లలో అన్ని ఎగుమతులూ ఆగిపోయాయి. ఆ తర్వాత వందేళ్లలో భారతదేశం ఏటా 60 కోట్ల రూపాయల విలువగల బ్రిటీష్ వస్త్రాలను దిగుమతి చేసుకోసాగింది, మొత్తం దిగుమతులలో ఇది 25 శాతం. ప్రపంచం ఈర్ష్యపడే స్థానంలో వున్న భారతీయ చేనేత పరిశ్రమ ఆ విధంగా శిథిలమయ్యింది. చేనేత పనివారు తమ ఉపాధిని కోల్పోయారు, తిరిగి వ్యవసాయానికి వెళ్లారు, ఆకలితో మరణించారు. ‘‘చేనేత కార్మికుల ఎముకలతో భారతదేశం తెల్లపూత వేసుకుంటోంది. ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఇలాంటి విషాదం అత్యంత అరుదుగా కనిపిస్తుంది’’ అని ఒక వైస్రాయ్ ప్రకటించారు.
విశ్వవిఖ్యాతమైన షబ్నమ్‌లు నేసే బెంగాలు ముస్లిం నేతగాళ్లు పనిలేనివాళ్లైపోయిన సంగతి, సగర్వమైన పంజాబ్ నేతగాళ్లు తమ మగ్గాలను వదలి సైన్యంలో చేరి తమ మాతృదేశానే్న సంకెళ్లలో ఉంచేందుకు సహాయపడుతున్న సంగతి గాంధీ తెలుసుకున్నాడు. ఒకప్పుడు గౌరవప్రదమైనదిగా, కళాత్మకమైనదిగా భావించినవారి వృత్తిని వారే పనికిమాలినదిగా భావించడం మొదలుపెట్టారు. గుజరాత్ నేతగాళ్లు ఉపాధిని వెతుక్కుంటూ తమ గ్రామాలను వదిలి, ముంబయి లాంటి నగరాలలో పారిశుద్ధ్య పనివారుగా జీవించడం ప్రారంభించారు. వారి ఆరోగ్యాలను పాడుచేసుకొని మద్యపానం, జూదం లాంటి వ్యసనాల పాలయ్యారు. చాలా కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. నైపుణ్యంగల పనివారు కూలీలుగా మారారు. నూలు మిల్లులు ధనవంతులను మరింత ధనవంతులను చేశాయి.
దేశాన్ని ఈ ఆధారపడే దుస్థితి నుంచి బయటపడేయాలని విదేశీ వస్త్రాల దిగుమతిని పూర్తిగా ఆపేయాలని గాంధీ పట్టుబట్టాడు. స్వదేశీని ఆచరించడం, అంటే భారతదేశంలో తయారైన వస్తువులను వినియోగించడమే గాంధీ దృష్టిలో స్వరాజ్యానికి పునాది. తమ దేశస్థులను తమ కాళ్లమీద తాము నిలబడుతూ స్వయం సమృద్ధిని సాధించినవారిగా చేయాలనేది ఆయన జీవిత లక్ష్యం. దాన్ని సాధించడానికి ఆయన కొన్ని షరతులు విధించాడు. స్వదేశీ వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు మరిన్ని మిల్లులు స్థాపించకూడదు. మిల్లుకు పెట్టుబడిదారు యజమానిగా వుంటాడు. దానిలోని సంక్లిష్టమైన యంత్రాలు, విడిభాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. చేతివృత్తులమీద ఆధారపడిన అనేకమంది జీవనోపాధిని యంత్రాల వినియోగం నాశనం చేస్తుంది. కర్మాగారంలో కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుంది. కార్మికులు వారి వారి స్వస్థలాలను వదలి వలసవెళ్లి మరమనుషుల్లా పనిచేయాలి. ‘‘మన అభిరుచులు పతనమై, కలుషితం కాకపోతే మనకు కాలికో (మిల్లు తయారయ్యే) వస్త్రంకన్నా ఖద్దరునే ఇష్టపడతాం. ఒక కళ జీవనాన్ని నాశనం చేసేదైతే, మరో కళ జీవాన్నిచ్చేది. యంత్రాలపై భారీ స్థాయిలో చేసే ఉత్పత్తి సృజనాత్మకతను, కళాకారుల నైపుణ్యంగల చేతివేళ్లను మొద్దుబారుస్తుంది’’ అనేవాడు గాంధీ. అందమైన అస్సామీ కన్యలు తమ మగ్గాలపై కవితలు నేయడం చూసిన ఆయన ముచ్చటపడ్డారు.
చేనేతను పునరుద్ధరించాలని గాంధీ కలలు కనేవాడు.