పఠనీయం

జయకేతనం ఎగరేసిన జనశంకరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనశంకరుడు
-వనపట్ల సుబ్బయ్య
వెల: రూ.50.. పేజీలు: 68
ప్రతులకు: రచయిత
భార్గవి హేర్ స్టైల్స్ నల్లవెల్ల రోడ్, బస్టాండ్ దగ్గర నాగర్‌కర్నూలు - 509 209 cell No. 9492765358

= == ========================

మట్టిని ముద్దలు చేసి.. ఆశయానికి ఆయువు పోసి.. వికాసాన్ని బోధించిన.. ఆచార్య జయశంకర్‌పై ‘జనశంకరుడు’ పేరుతో ఓ దీర్ఘ కావ్యాన్ని వెలువరించి.. ఆయనపై గౌరవాన్ని చాటుకున్న వనపట్ల సుబ్బయ్యగారు అభినందనీయులు. తెలంగాణ వాదం నరనరాన పుణికి పుచ్చుకున్న కవి వనపట్ల సుబ్బయ్యగారు. తెలంగాణ ఉద్యమ కాలంలో.. తన రచనల ద్వారా చైతన్యపరిచారు. తాను చేసే.. నారుూ బ్రాహ్మణ వృత్తిని స్వాభిమానంతో ప్రకటించుకునే సుబ్బయ్యగారు.. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌పై.. తనదైన శైలిలో.. సృజనాత్మకతను జోడించి.. దీర్ఘ కవితను కవితాత్మకంగా తీర్చిదిద్దారు. లోగడ మూడు దీర్ఘ కవితలు రాసిన అనుభవం ఉన్న ఆయనకు.. తెలంగాణ నుడికారంపై పట్టు ఉండటం కూడా విశేషం! ఆయన రాసే కవిత్వంలో ప్రతి పంక్తిలోనూ కవిత్వం తొణికిసలాడేలా చూస్తారు.. ఈ కావ్యంలోనూ.. అదే పని చేశారు.
జయశంకర్ గారిని ‘జనశంకరుని’గా ఆవిష్కరించారు.. జయకేతనం ఎగరేసిన జనశంకరునిగా మన ముందు నిలిపారు.
ఈ దీర్ఘ కవితలో.. జయశంకర్ గారి మూర్తిమత్వం.. ఉత్తమ వ్యక్తిత్వం.. దీక్షాదక్షతలు.. నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధత.. నిర్భయత్వం లాంటి అంశాలను చక్కగా పొందుపరిచారు.
తెలంగాణకు.. తెలంగాణ ఉద్యమకారులకు జయశంకర్‌గారు ఎంతో ఓర్పుతో.. నేర్పుతో ఓ సిద్ధాంతకర్తగా.. ఓ పెద్ద దిక్కుగా ఎలా మార్గదర్శనం చేశారో.. రేఖామాత్రంగా దీర్ఘకవితలో.. సుబ్బయ్యగారు ఆవిష్కరించడం అభినందనీయం! ఇందలి పంక్తుల్లో.. అడుగడుగునా తెలంగాణ పట్ల.. సంస్కృతి పట్ల.. పద బంధాల పట్ల.. ఆచార వ్యవహారాల పట్ల.. భౌగోళిక అంశాల పట్ల సుబ్బయ్యగారికి ఉన్న అవగాహనను.. దాన్ని కవితా వస్తువుతో అన్వయించి ప్రకటించడంలోని ఆయన ప్రతిభను.. ప్రశంసించకుండా ఉండలేము!
సుబ్బయ్యగారు దీర్ఘ కవితలో ఎక్కడా క్రమం తప్పకుండా.. ఓ సీక్వెన్స్‌లో తన భావాలకు గాఢమైన అక్షరాకృతినిచ్చారు.
‘పార్టీలేవైనా/ అతనే కరపత్రం
నాయకులెవరైనా/ అతనే మేనిఫెస్టో’ అని జయశంకరుడిని కొనియాడారు.
పాయలు/ పాయలైన కాలువల్ని
మైదానాలకు మళ్లించి/ జనసంద్రం చేసిన నాయకునిగా కవి చిత్రించారు.
పాతాళంలోని నినాదాన్ని/ ఆశయ పతాకం చేసి
పుడమిని/ పూల బతుకమ్మను చేసిన ఘనత ఆయనదేనని తేల్చి చెప్పారు.
కవి ప్రతి పంక్తిలో.. జయశంకర్ సార్‌ను, ఆయన సేవలను ప్రస్తుతించారు. ప్రస్తావించారు. ప్రణమిల్లారు...
‘ఓ జయశంకరా!/ అఖండ దీప స్తంభమైన ఆచార్యుడా!/ కృతజ్ఞతలకు తూగని అమ్మదనం/ వెలకట్టలేని త్యాగధనం’ అంటూ కవి కీర్తించారు.
ఈ కావ్యమందు సుబ్బయ్యగారు వ్యక్తీకరించిన భావాల్లో.. పద బంధాల ప్రయోగ విన్యాసాల్లో.. ఆయన సృజనాత్మక ప్రతిభ.. కానవస్తోంది.
ఎక్కెక్కి/ ఏడ్చిన భూములకు
దూప తీర్చే చెలిమైనాడనీ..
గోస దీస్తున్న.. కంకుల మీద.. పురుగులు చంపే ఎండ్రిక అయినాడని.. అరాచక కిరాతకాలను.. కూకటేళ్లతో దున్ని.. దంతెతో అచ్చులుగొట్టి.. రైతులా.. విత్తనాలుచల్లి.. మొక్కలై సాగిన మార్చ్‌లకు.. మిలియన్ మార్చ్ అయినాడని ప్రకటించడంలో.. కవికి ఉద్యమ నేపథ్యం.. దానితోపాటు దాన్ని ఎలా సమన్వయపరుస్తూ.. కవితాత్మకం చేయాలో తెలుసు కనుకనే.. పై పంక్తుల్లో వ్యవసాయంతో ముడిపెట్టి.. మన హృదయాలను తట్టేలా మట్టివాసనల పరిమళాలను గుబాళింపజేశారు...
కవి ఒక్కోచోట.. ఒక వృత్తిని.. ఒక్కో తెలంగాణ సంస్కృతి సంబంధ అంశాన్ని జతకట్టి.. కవితా వస్తువుతో సమన్వయం చేయడంలో సఫలీకృతులైనారు.
‘ఒక ఉపాధ్యాయుని నడక
అరవై ఏళ్ల విముక్తి బాట అనీ..
ఒక ఆచార్యుని మాట
మహోద్యమానికి సద్దిమూట’ అని జయశంకర్ గారి పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.
‘తట్టు తగిలినప్పుడల్లా/ ఆకుపసరై/ ఆధిపత్యాల మీద
దిమీపై/ కొట్టం కూలినప్పుడల్లా/ నిట్టాడై
అవమానాల మీద/ సమ్మక్క సారక్కల ఖడ్గమై
సమతా పోరు నడిపిన/ తెలంగాణ ధీరుడు’ అంటూ..
జయశంకర్‌గారిని ప్రస్తుతించడం ప్రశంసనీయం. అయితే తెలంగాణ మాండలీకాలతో ఆవిష్కరించడం మరీ విశేషం! కవి యొక్క నేర్పరితనం కూడా!
‘గుండీలెన్ని ఊడినా
అంగీ మార్వలే’ అంటూ నర్మగర్భంగా జయశంకర్‌గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని.. చిత్తశుద్ధిని కవితామయం చేయడం గొప్ప విషయం.
చెట్టెప్పుడు/ తన కోసం కాయదు
సెలిమెప్పుడు/ తన కోసం ఊరదు
విత్తనం ఎప్పుడు/ తన కోసం మొలకెత్తదు..’ అంటూ కొనసాగించిన పంక్తుల్లో.. జయశంకర్ గారి త్యాగమయ జీవనాన్ని చక్కగా ప్రకటించారు.
ఇలా.. ఈ కావ్యంలో అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి.. పాఠకులు జయశంకర్‌గారి వ్యక్తిత్వంతోపాటు.. సుబ్బయ్యగారి కవిత్వాన్ని ఆస్వాదించగల అత్యుత్తమ కావ్యమిది! ఈ కావ్యంలో.. కవి యొక్క కవితా పటిమ ఉంది.. ఈ నేల పట్ల ఆయనకున్న గౌరవం ఉంది. అన్నింటికి మించి.. కవి యొక్క ఉత్తమ సంస్కారం దాగి ఉంది. ప్రతి ఒక్కరూ చదివి స్ఫూర్తి పొందవలసిన గ్రంథం.

-దాస్యం సేనాధిపతి