పఠనీయం

సంప్రదాయానికే పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణ (నవల)
షణ్ముఖశ్రీ సెల్:88978 53399.
వెల:రూ.100/- శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్,
న్యూ నల్లకుంట, హైదరాబాద్ -44
*
శివయ్య ఓ కాటికాపరి. అతని కూతురు సువర్ణ. అందాలరాశి అయిన పుష్పలావిక. జమీందారీ కుటుంబీకుడైన కరుణాకరం గారికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు చంద్రశేఖర్ ఓ వ్యసనపరుడు. పెళ్ళయితే దారికి వస్తాడని శాంతిప్రియోతో వివాహం చేసినా మార్పులేదు. తమకు పిల్లలు లేకపోయినా శాంతిప్రియ భర్తతోడిదే ప్రపంచం అనుకుని మరిది సోమసుందర్, మామగారే ఆప్తులుగా తమ నౌకర్లను, వంటవాళ్ళను, డ్రైవర్లను అందరినీ క్రమశిక్షణలో వుంచుతూ ఎప్పటికైనా భర్తలో మార్పురాగలదని అభిలషిస్తూంటుంది.
ఏం.ఏ ఫిలాసఫీ చదివి తదనుగుణంగానే సదా ఆధ్యాత్మిక చింతనతనూ, అశాశ్వతమైన సృష్టిలో ఐహికానందాలకోసం వెంపర్లాడటం అవివేకం అనీ వివాహానికి విముఖుడై జీవిస్తుంటాడు. తండ్రి, వదిన ఎంత చెప్పినా ఎందరు తమ పిల్లలనిస్తామని వచ్చినా వివాహ ప్రసక్తే లేదంటూ వుంటాడు. అలాంటి సోమసుందర్ శివాలయం దగ్గర పూలమ్ముకుంటున్న సువర్ణ అందానికి విచలితుడవుతాడు. సువర్ణ కూడా సోమసుందర్ పట్ల ఆకర్షితురాలవుతుంది. చంద్రశేఖర్ తమ్ముడిని తన దగ్గరే ఉద్యోగానికి పెట్టుకుందామనుకుంటాడు గానీ తన అవినీతి బాగోతాలు, దుశ్చర్యలు తమ్ముడికెక్కడ తెలిసిపోతాయోనని అసలు తన విషయాలేవీ తమ్ముడికి తెలియకుండా జాగ్రత్తపడతాడు. ఓసారి కరుణాకరంగారు కూడా సువర్ణను చూసి సోమసుందర్‌కు తగిన పిల్లగా భావిస్తాడు. సోమసుందర్, సువర్ణలమధ్య పరిచయం పెరుగుతుంది. శివయ్య బండిలోనే కరుణాకరంగారు అతని కూతురు సువర్ణను తమ అబ్బాయికి చేసుకుంటాననీ, తనకు కులమతాలేవీ పట్టవని చెబుతాడు. అనుకోకుండానే శివయ్య బండిలోనే కన్నుమూస్తాడు. వరుసకి మరదలు అయ్యే మాధవి సోమసుందర్‌ను వివాహమాడాలనుకుంటుంది. కానీ అతనికి వివాహ ఆలోచన లేదనీ తెలిసి బాధపడుతుంది. మనసు వైరాగ్యాన్ని పొందుతుంది. సుందరే ఆమె ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవాలనేంతగా తపస్వినిగా ఆమె పేరొందుతుంది. సువర్ణ కొన్నాళ్లు కరుణాకరంగారి ఇంట వున్నా తిరిగి తన గుడిసెకొచ్చి తండ్రి చేసే వృత్తిని తాను చేయడానికి సిద్ధపడుతుంది. సోమసుందర్ ఓ కుష్ఠురోగి శవాన్ని దహనం చేయడానికి తెచ్చి సువర్ణను చూసి విభ్రమ చెందుతాడు. తాను అనాథ ప్రేతగా దహన సంస్కారాలు జరిపిన కుష్ఠివాడు ఇచ్చిన భరిణెలోని ఉత్తరాన్ని చదువుతాడు. అంతవరకూ సువర్ణ తండ్రి శివయ్య, తమ తండ్రి కరుణాకరం సొంత అన్నదమ్ములన్న విషయం తెలిసి సువర్ణ తనకు చెల్లెలు వరస అవుతుందని క్రుంగిపోతున్న సోమసుందర్ ఆ లేఖ ద్వారా సువర్ణ శివయ్య పెంపుడు బిడ్డ అని తెలుస్తుంది. కథ మలుపులు తిరిగి సువర్ణ-సోమసుందర్‌లకు వివాహ బంధం ఏర్పడడంతో నవల ముగుస్తుంది.
జ్యోతిషం, ఆధ్యాత్మికం వంటి వ్యాపకాలతో పాత్రికేయులుగా, ఇండియా టుడే, ఆంధ్రప్రభల్లో పనిచేసిన శ్రీ ములుగు కుమారస్వామి ‘షణ్ముఖశ్రీ’ అనే కలం పేరుతో రాసిన ఈ నవల ఆయన మనః ప్రవృత్తికనుగుణంగానే అధిక భాగం ఆధ్యాత్మిక ఆలోచనలతో, చర్చలతో, పాత్రల మనో విశే్లషణంతో సాగుతుంది. అన్నాచెల్లెళ్ళ వరస అయినంత మాత్రాన వివాహానికి అయోగ్యులమన్న సంప్రదాయ భావనను ఛేదించగల నూతనతరం ఈ నవల సంతరించుకోలేకనే సువర్ణను శివయ్య పెంపుడు బిడ్డగా కథను మలుపు తిప్పారనుకోవాలి. సమాజం ఎంత పరివర్తనం చెందినా వివాహ విషయంలో గతానుగతిక సంప్రదాయమే నిలబెట్టడం కోసం విస్మయ రచనను తన్మయ దృష్టితో చదవమని రచయిత మానవజన్మ గురించి అనేక ఆలోచనలను రేకెత్తించేలా ఈ నవల వెలువరించారు.

-సుధామ