పఠనీయం

సైన్సుపై అవగాహన కలిగించే నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గులాబీమేఘాలు- సైన్సు కాల్పనిక నవల - రచన: చట్టి శ్రీనివాసరావు, వెల:రూ.200/-, కాపీలకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, మరియు విశాలాంధ్ర బుక్ హౌజ్ వారి బ్రాంచీలు.
*
తెలుగు భాషలో సైన్సు ఆధారిత కథలు, నవలలు చాలా తక్కువగా వచ్చాయి. సైన్సు ఆధారిత సాహిత్యంవల్ల సామాన్య పాఠకుడి మేధోశక్తి విస్తృతం అవుతుంది. సాహిత్య రూపంగా ప్రకటితము అవటంవల్ల పాఠకుడిలో జిజ్ఞాస పెంపు అవుతుంది. విజ్ఞానశాస్త్రంలోని వౌలికాంశాలు వస్తువుగా చేసి వ్రాయటంవల్ల, విద్యార్థులకు కూడా కొంతమేర ఈ సైన్సు ఆధారిత (సైన్స్ ఫిక్షన్) నవలలు తోడ్పడుతాయి. పాఠకాదరణ అతి తక్కువగా ఉండటంవల్ల ఈ రకపు సాహిత్యం ప్రచురించే వీలు పడదని ప్రకాశకులు అభిప్రాయపడగా, లభ్యత లేమి దృష్ట్యా చదవలేకపోతున్నామని కొందరు పాఠకులు అంటారు. లాభాపేక్షయే ముఖ్య ఉద్దేశ్యము కాకుండా, తమ ప్రచురణలో కొంత శాతం సైన్సు ఆధారిత నవలల ప్రచురణకు ప్రకాశకులు పూనుకొనటం ఎంతో అవశ్యనీయమము.
ఇట్టి ఆవశ్యకతను గుర్తించి కాబోలు, విశాలాంధ్రవారు ఈ నవల ప్రచురణకు నడుం కట్టినట్లవుపించుతున్నది.
అలెక్సాందర్ అబ్రామోవ్ మరియు సిర్గేయ్ అబ్రామోవ్ అను ఇద్దరు రష్యను రచయితల నవలను ఇంగ్లీషు భాషలో ‘హార్స్‌మెన్ ఫ్రమ్ నో వేర్’గా అనువదించబడింది. రచయిత వట్టి శ్రీనివాసరావు మాస్కోలో యంయస్‌సి ఇంజనీరింగ్ చేశారు. రష్యన్ భాషపై అభిరుచి, తెలుగు భాషమీద అభిమానంతో ఈ నవలను తెలుగీకరించారు. మూలకథలో రష్యను పరిశోధకులు అంటార్కిటా ప్రాంతంలో పరిశోధనలు జరుపుతారు. అనువాదకుడు స్వేచ్ఛానువాదాన్ని అనుసరించి భారతదేశ పరిశోధకులుగా కధను నడిపాడు. అందువల్ల ఇది అనువదించబడినదిగా అనిపించదు. తెలుగు పాఠకులకు మరింత ‘దగ్గరితనం’ చేకూర్చింది.
అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ఖండాన్ని పరిశోధించటానికి ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందానికి వచ్చాయి. శాస్త్ర పరిశోధనకై ఏ దేశమైనా, వారి వారి స్థావరాలను ఏర్పర్చుకోవచ్చును. అలా ఏర్పరుచుకున్న స్థావరాలలో భారతీయ స్థావరం పేరు ‘మైత్రి’, ‘మంజు’ అన్న ట్రాక్టర్ లాంటి వాహనంలో వెంకట్ (డ్రైవర్), పరమహంస (జుట్టు నాయకుడు), కథకుడు కీర్తి (్ఫటోగ్రాఫర్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీర్) విష్ణు శర్మ (వాతావరణ శాస్తజ్ఞ్రుడు వైద్యుడు) శోధనకై బయలుదేరుతారు. అకస్మాత్తుగా కీర్తి ఒక విచిత్రమైన, అస్పష్ట, అచైతన్య, భారరహిత స్థితికి లోనయి ‘రంగు లేని, చిరువెచ్చని, జిగట ద్రావణంలో వున్నట్లు ఒక పొందిక లేని, రూపం లేని కలగంటున్నట్లు అనుభూతిస్తాడు. గులాబీ రంగు మేఘాలు పరిసరాలనిండా క్రమ్ముకున్నట్లు, ఆ మేఘాలు అంటార్కిటికాలోని మంచును ఎత్తుకుపోతున్నట్లు గమనిస్తాడు. వస్తువుల్ని, పరిసరాల్ని, చివరకు మనుషుల్ని కూడా ఆ గులాబీ రంగు మేఘాలు సృష్టించగలుగుతున్నట్లు శాస్తజ్ఞ్రులు గమనిస్తారు. వేడి కత్తితో వెన్నను కోస్తున్నట్లు కిలోమీటర్ల పొడవుగల మంచు గడ్డలను గాలిలో లేపుకుని వెళుతున్నట్లుగా గమనిస్తారు. ముందుకు సాగే కథనంలో దీపిక (కీర్తి సెక్రటరి), ఆమె తల్లి సరోజిని వెస్లీ బేకర్ అనే ఊరురా తిరిగే వ్యాపారి, మేరీ (బార్ యజమానురాలు) పారిస్ నగరంలో పత్రికా గోష్ఠి- ఇలా ఎక్కడెక్కడో పయనిస్తారు. గులాబీ మేఘాలు సృష్టించిన ఎంతోమంది ప్రతిరూపాలను అసలు మనిషి ఎవరో , ప్రతిరూపం ఎవరో తెలియనంతగా సృష్టించబడిన ప్రతిరూపాలను చూస్తారు. చివరకు ఒక గ్రహం, రెండవ భూమి, ఈ భూమిమీదున్న జలాలతో, గాలితో, పరిసరాలతో ఏర్పర్చే ప్రయత్నం. ఆ గ్రహాంతరవాసులు చేస్తున్నట్లుగా - సర్వకాలాలకూ ‘సంపర్కం’ ఉంటుందిగా ముగింపు పలుకుతాడు రచయిత.
ఒక నవల కాని, కధ కని చదువుతోంటే- అంతర్లీనంగా ఉండే కొనసాగింపు (కంటిన్యూటీ) పాఠకుడిని తన వెంట తీసుకెళ్తూ చివరకు ముగింపు ఘట్టంలో పూర్తిచేయబడిన చిత్రం లేదా ఫొటో చూసిన అనుభూతిని రచయిత పాఠకులకు అందజేయగలగాలి.
సామాన్య పాఠకుడి అవగాహనలో లేని శాస్త్ర సంబంధిత విషయాలు అంతగా కనిపించని కంటిన్యూటీ పాఠకుడిని తికమకపెడతాయి. సైన్సు కాల్పనిక నవలగా పేర్కొన్న ఈ రచనలో ఎదురయ్యే శిల్పాన్ని మరికొంత సానబట్టాల్సిన అవసరం ఉంది. మంచులో వుండే వివిధ రకాలు (ముందుమాట), నీటిలో వుండే డ్యూటీరియం (పే.93), బోర్‌స్కోప్ అనే ఫొటోగ్రఫిలోని అత్యాధునిక టెక్నాలజీ సజీవ నిర్జీవ వ్యవస్థలను వేరువేరుగా గుర్తించగలిగే క్లిరియన్ ఫొటోగ్రఫి, సారాయి తయారీ, బోస్టన్ టీ పార్టీ అన్న వాక్యం ఎలా వాడుకలోకి వచ్చింది లాంటివి పాఠకులకు ఈ నవల చదివితే తెలుస్తుంది.
‘నువ్వు చూస్తున్నది ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వుంటే తప్పు నీది కాని ప్రకృతిది కాదు’ (పే.20), ‘అయస్కాంత క్షేత్రాలకి లోనైన నీరు తన వౌలికమైన భౌతిక రసాయ లక్షణాలను మార్చుకుంటుంది’ (పే.93), ‘ఒక వస్తువుని మోడలుగా తయారుచేయటానికి కళ్ళు తప్పనిసరికాదు’ లాంటి ఎన్నో క్రొత్త విషయాలపై పాఠకుడికి అవగాహన కలుగుతుంది ఈ నవల చదివాక. నవల చివర ఇలాంటి వాక్యాలకు వివరణ ఇస్తే ఇంకా బావుండేది.

-కూర చిదంబరం 8639338675