పఠనీయం

చారిత్రక ప్రాధాన్యం గలది ఈ మాధవ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవ శతకము
రచన - శ్రీమతి వేమూరి శారదాంబ,
వెల:రూ.100/-,
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
*
‘తెలుగునాడు’ పేరుతో వచ్చిన పద్య కృతికి చారిత్రక ప్రాధాన్యం వుంది. దీనిని రచించినవారు దాసు శ్రీరాములుగారు. ఇందులో 19వ శతాబ్దమునాటి సాంఘిక రాజకీయ సామాజిక పరిస్థితుల చిత్రణ చేయబడింది. ఇలా మరికొన్ని భాగాలు వారు రచించాలని ప్రయత్నించారు కాని విప్ర కులస్థుల ఆచార వ్యవహారాలతోనే ప్రథమ భాగం ముగిసింది. ఆ తర్వాతివి రాలేదు.
దాసు శ్రీరాములుగారు సంధి యుగానికి చెందినవారు. అప్పటికే పాశ్చాత్య సభ్యత దేశాన్ని ఆక్రమించుకుంది. ప్రాచీన వైదిక ఆచారాలు మసకబారాయి. ముదికరణాలు రాము గుడి ముందట కూర్చొని కొత్తగా వచ్చిన ఎఫ్‌ఏ, బిఏలలోని మంచి చెడ్డలు చర్చించుకుంటూ ఉండేవారు.
శ్రీరాములుగారు 1846 నుండి 1908 వరకు జీవించారు. వీరికి ఆరుగురు మగ పిల్లల తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు శారదాంబ అని పేరు పెట్టారు. ఈమెను బాల్యంలో శేషమ్మ అని కూడా శ్రీరాములుగారు పిలుచుకుంటూ ఉండేవారు. శేషమాంబ శ్రీరాములుగారి నాయనమ్మ. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామంలో శారదాంబ దాసు శ్రీరాములు, జానకమ్మ దంపతులకు 1881 మే 3వ తేదీన జన్మించింది. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఆనువంశికంగా (జెనిటిక్) శారదాంబకు కవితా సౌరభవం వచ్చింది. ఈమె ఏకసంథాగ్రాహి. మధురంగా పాటలు గానం చేస్తూ ఉండేది.
1888లో ఆమెకు వేమూరి రామచంద్రరావుతో వివాహం జరిగింది. ఆనాటి జనాన పత్రిక, స్ర్తి జనాభ్యుదయ పత్రిక వంటివానిలో ఆమె వ్యాసాలు విమర్శలు కవితలు ప్రచురిస్తూ ఉండేవారు. 19వ శతాబ్దంలో స్ర్తి వివక్ష ఎక్కువగా ఉండేది. లిలత కళలు కేవలం ఒకే కులానికే పరిమితం. స్ర్తి విద్య లేనే లేదు. ఈ దశలో శారదాంబ తన సమకాలీన సమాజంలోని స్ర్తిల స్థితిగతులను చిత్రిస్తూ ఒక శతకం వ్రాసింది. దానిపేరే మాధవ శతకము. ఇది బహుకాలముగా అలభ్యము. ఇటీవల దాసు అచ్యుతరావుగారి పూనికతో దాసు శ్రీరాములుగారి స్మృత్యర్థం తీసుకువస్తున్న గ్రంథం ముద్రింపబడింది. లేకుంటే ఇది కాలగర్భంలో కలిసిపోయి ఉండేది.
ఈమె తన 16 సంవత్సరాల వయస్సులోనే నాగ్నజితీ పరిణయము అనే ప్రౌఢ ప్రబంధాన్ని సంతరించటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మంచివారిని దేవుడు తొందరగా తన దగ్గరికి తీసుకొనిపోతాడన్నట్లు శారదాంబ తన 19వ ఏటనే ప్రసవ వేదనలో కన్నుమూయటం ఒక దైవఘటన. పేరుకు తగ్గట్లే శారదాంబ చదువుల సరస్వతి.
‘‘తన తొమ్మిదవ యేట / ననుపమాన ప్రజ్ఞా / నింపుగా వీణ వాయింప నేర్చె/ తన పదియవ యేట / సునిశితంబకు బుద్ధి / దాగొల్పె నేకసంతగ్రహణము/ తన చతుర్దశ శరత్తున / ముద్దు ముద్దుగా/ నల్లి చిల్లిగ పద్యమల్ల నేర్చె / తనదు పదునార్వ / వత్సరమున నాగజిజ్ఞా /వివాహ ప్రబంధము సెప్పె / తనదు పందొమ్మిదవ వర్షమునను/ మర్త్య భావమును మాని శాశ్వత బ్రహ్మలోక సిద్ధిగనె/ శారదాంబ నా చిన్ని కూతు / నను దినంబును మఱువక నాత్మనుండు’’- ఇది దాసు శ్రీరాములుగారు తన దేవీ భాగవతములో తన కుమార్తె గురించి వాసుకున్న ఎలిజీ.
ఈ పద్యంవలన నూరేండ్ల నాటి శారదాంబ గారి జీవన వృత్తము ఈ తరం వారికి పరిచయమవుతున్నది.
శ్రీమతి శారదాంబ పోయాక రెండేండ్లకు అనగా 1901లో కళావతి అనే స్ర్తి జన సంబంధమైన మాస పత్రికలో ఈ పద్యములు ప్రచురింపబడినవి. అనగా ఇది జరిగి 120 సంవత్సరాలు దాటినవని సారాంశము.
ఆనాడు జనానా, శ్రీబాలిక, స్ర్తి హితబోధిని (సతీ హితబోధిని) వంటి పత్రికలు నడుస్తూ ఉండేవి. ఇందులో వృద్ధ వివాహం, బాల్య వివాహం, కన్యాశుల్కం, వరశుల్కం, స్ర్తి విద్య, సతీసహగమనం వంటి ఎన్నో సమస్యలు ఆనాటి సమాజంలో ఉన్నాయి. ఈ శతకంలోనివి వ్యస్త పద్యాలే అయినప్పటికీ అంతస్సూత్రం ఇదే.
పద్యముల సంఖ్య 101. మాధవా అన్నది మకుటం. అన్నీ వృత్తాలే. మొదటి ఆరు పద్యాలు చివరి ఐదు పద్యాలు దశావతార స్తుతి మినహాయిస్తే తక్కినవన్నీ స్ర్తి జన సంబంధులే.
ముందు శ్రీరామానుగ్రహం కోసం ప్రార్థించిన పద్యాలున్నాయి.
‘‘శ్రీ రమణీ మనోహర సుశీల సుశీల నిజాశ్రీత కష్ట భంజనా’’ అని ప్రారంభమై ‘సారస నేత్ర దాదగు విచారములెల్లను తీర్చి మాధవా’ అని ప్రార్థించుట కన్పడుతుంది.
ఈ విచారములు వైయక్తికం కావచ్చు. సామూహికమూ కావచ్చు. ఎందుకంటే ఆమెది కూడా బాల్యవివాహమే.
(మిగతా సోమవారం)

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్