పఠనీయం

జంతువులపై ఉదాత్త్భావాల్ని కలుగజేసే నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కుక్క ఆత్మకథ
నవల -
కన్నడ మూలం:రజనీ నరహళ్ళి,
తెలుగు అనువాదం: డా. రాజేశ్వరీ దివాకర్ల,
సంక్షిప్తీకరణ:గుడిపూడి విజయరావు,
వెల:రూ.50/-,
ప్రతులకు:
నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ మరియు
ప్రజాశక్తి బుక్‌హౌజ్‌వారి బ్రాంచీలు.
*
చెప్పగలిగే నేర్పు ఉండాలి కాని, కథా వస్తువుకు అనర్హమైనది ఏదీ లేదు. పరవస్తు చిన్నయసూరి (1801-1861) కాలం నుండే జంతువులు ప్రధాన భూమికలుగా రాసిన కథాంశాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతకుముందు ‘జంతు సంబంధిత’ కథలున్నాయి. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలనుద్దేశించి వ్రాయబడి, నీతి బోధన సారాంశంగా ఉండేవి. కన్నడ రచయిత్రి రజిని నరహళ్ళి కన్నడలో వ్రాసిన ఈ నవలను దివాకర్ల రాజేశ్వరిగారు తెలుగులో అనువాదం గావించారు. కథ, చరిత్ర కవితలను అనువాదం చేసిన అనుభవం డా రాజేశ్వరిగారికి ఉంది.
‘లియో’ అను పేరుగల ఓ పెంపుడు కుక్క ఆత్మకథ ఇది. లియో పూర్వీకులు జర్మన్ షెఫర్డ్ సంతతికి చెందినవారు. బ్రిటీషు దేశాన్ని పాలించే సమయాన తమతోపాటు పిల్లులు, కుక్కల వంటి పెంపుడు జంతువుల్ని వెంట తీసుకువచ్చారట. ఆ కుక్కలు దేశీ వంగడాలతో సంగమించటంవల్ల ఎన్నో ‘క్రాస్‌బ్రీడ్’ రకాలు పుట్టుకొచ్చాయని మూల రచయిత్రి వివరించారు. లియో ముత్తవ్వ గ్రేసీ ఎదకు వచ్చినపుడు ‘టైసన్’ అనే మగ కుక్క సంగమంవల్ల ‘జూలీ’ జన్మిస్తుంది. జూలీకి రూబీ, రూబీకి లియో జన్మిస్తుంది. లియో, తాతమ్మ కుటుంబంతో కలిసిపోయి, ఆ కుటుంబ భావోద్వేగాలను తాను కూడా పంచుకుంటూ, పెరిగి పెద్దయి, ముసలితనంలో దయామరణం (యుధనేషియా)తో నవల ముగుస్తుంది.
216 పేజీల నవలలో కుక్కలు గురించి పాఠకులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. కుక్కల ఆయుర్దాయం సుమారు పది నుండి పనె్నండు సంవత్సరాలు. వాటికి కళ్ళు తెరవకముందే వాటి ఘ్రాణశక్తి చురుగ్గా ఉంటుంది.
కుక్కలకంటే పిల్లులు శుభ్రంగా ఉంటాయి. కానీ కుక్కకున్నంత విశ్వాసం పిల్లులకు ఉండదు.
కుక్కలు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే ఈనుతాయి. కడుపునిండిన కుక్కలు లైంగికంగా చురుగ్గా ఉండవు. అవి పిల్లల్ని పెట్టటానికి ఏకాంతంగా ప్రశాంతంగా ఉండే జాగాని కోరుకుంటాయి. తడవకు నాలుగైదు పిల్లల్ని పెడతాయి. చివరగా పుట్టినవి సామాన్యంగా దుర్భలంగా ఉంటాయి.
మనుషులు తమ పిల్లలకంటే, కుక్కపిల్లల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ముసలితనంలో కుక్కలకు కూడా ‘ఆశ్రయధామాలు’ వెలుస్తున్నాయి.
మనుషుల్లో ఇపుడు చోటుచేసుకుంటోన్న ‘సహజీవనం’ కుక్కల్లో ఎప్పటినుండో వుంటూ వస్తోంది. గోమాతలా కొన్ని గుళ్ళల్లో కుక్కల్నీ పూజిస్తారు.
ఇక తెలుగులోకి అనువదించిన డా రాజేశ్వరీ దివాకర్లగారు ప్రతి పేజీలోనూ తన ప్రతిభ చూపించే ప్రయత్నం చేశారు. సంతోషంతో బీరకాయలా పొంగిపోవటం (పే.540, నేను (గ్రేసీ) పిల్లలకు మాత్రమే జన్మనివ్వలేదు- నేను కూడా మరో జన్మ పొందినట్లయింది (పే.115), దేవుడు తల్లులకు ఒక ఇంద్రియాన్ని అధికంగా ఇస్తాడు (పే.126), కెంపెగౌడ నిర్మించిన ‘‘బెండకాళూరు’ ఇపుడు బెంగుళూరు (208).
దయామరణం చెందిన లియో గురించిన ఆలోచనలు ఆ పెంచుకున్న ఆ కుటుంబం పొందిన విచారం వౌనశోకం అతి ప్రతిభావంతంగా మూల రచయిత్రి చేశారు. అంతే ప్రతిభావంతంగా మనసుకు హత్తుకుపోయేలా డా రాజేశ్వరీ దివాకర్లగారు తెలిగించారు.

-కూర చిదంబరం