పఠనీయం

సమకాలీన సమాజ దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విచ్చుకోవాలి
వచనకవిత్వం
రచన : వై.హెచ్. కె. మోహన్‌రావు
వెల రూ.100/-లు
ప్రతులకు
రచయిత
11-61/3 జె.సి.రోడ్ పిడుగురాళ్ల
గుంటూరు జిల్లా
*
రోజూ, వేల వేల సంఘటనలు కనుల ఎదుట కదలాడుతూ ఉంటాయి సంఘటనలకు సాక్షీభూతులమవుతుంటాము. కానీ కవి ఒక్కడు మాత్రమే వీటిని చర్మచక్షువులతోనే కాకుండా జ్ఞాన చక్షువులతో వీక్షిస్తాడు. పొద్దు పువ్వుల్లా వాటికి తన మస్తిష్కపు పొరల్లో నిక్షిప్తపరుచుకుని కవితలుగా ప్రవహింపచేస్తాడు.
వచన కవిత్వం చరిత్ర శోధన ఈ రెంటినీ తన రెండు కళ్లుగా చేసికొని, భావావేశ పరిమళాన్ని నలుగురికి అందించి ప్రశంసలందుకుంటున్న కవి శ్రీ వై. హెచ్. కె. మోహన్‌రావుగారి తాజా వచన కవిత్వ సంకలనం విచ్చుకోవాలి? ముప్పయి వచన కవితా సుమాల సౌరభాన్ని సంకలనం ద్వారా పాఠకులకు అలరించే సఫల ప్రయత్నమిది.
కవి సమాజానికి ఉత్ప్రేరకం వంటివారు. సమాజంలో భాగంగా ఉంటూ, సమాజాన్ని తన సందేశ కాహళులతో జాగృతం చేస్తాడు. నన్నయనాటి నంచి నేటి మోహనరావు వరకు కవులందరూ చేస్తున్నదిదే. పంకంలోనే ఉంటూ ఆ పంకిలం తనకంటకుండా ఆకుమీది నీటి ముత్యంలా ప్రకాశిస్తూ తన ఆలోచనల్ని మన ఎదుటికి తెస్తున్నారు. వీరి ఆలోచనలు ఉషోదయాలు, కారు చీకట్ల లోకి ప్రసరిస్తోన్న కాంతి పుంజాలు
పడమటి గాలుల్ని, వాటి వల్ల సేద్యంలో సాధిస్తున్న మేడిపండు లాంటి అభివృద్ధిని నిరసిస్తూ, పరుగెత్తకుండా నిలబడి నీళ్లు త్రాగమంటున్నాడు. 34పశ్చిమ పవనం2 కవితలో మనిషి కూడా చెట్టులా మొలకెత్తి తేనే 3మానవీయతకు మనతోత్సవం2 అంటారు. 3మొలకెత్తాలి2లో. సహస్ర బాహువులు (కొమ్మలు) తో జీవవాళి ఛత్రం పట్టే చెట్టుని చూసి పులకితులై 3ఆదిశేషుని అద్వితీయ ఛత్రం2 అంటూ చెట్టుకు కితాబిస్తారు. 3హరితఛత్రం2 కవితలో.
అందరు కవుల్లా వీరికి కూడా అమ్మంటే ఎనలేని గౌరవం ఉంది. అమ్మను భూమాతగా ఆరాధిస్తూ ఆమెను చిరునవ్వుకు చిరునామాగా అభివర్ణిస్తారు. 3అమ్మకు పర్యాం2 లో. అమ్మ, అవని రెండూ పర్యాపదాలని చెబుతూ , మరణం తలుపుతట్టేంతటి ప్రమాదం ఉన్నా మరో జననానికి తయారు ఉంటుందని,4నరకయాతనను సైతం లక్ష్యం పెట్టని సహన శిఖరంగా అమ్మను పేర్కొంటూ అమ్మ రుణం తీర్చుకోవాలని, అమ్మకు అమ్మగా జన్మ నియ్యమని ఆర్తిగా అమ్మనే వేడుకుంటాడు. 3ఒడి ఊయలై.. లో. మరణం లో కూడా అమ్మకు 3పేగు కదిలిన శబ్దమే వినిపిస్తుందట! ఇంత కంటే గొప్ప నివాళి అమ్మకు బహుశా ఏ కవీ ప్రకటించి ఉండడేమో. మరో పద్యవచనంలో అమ్మను 3ముగింపులేని కావ్యంగా అభివర్ణిస్తారు రచయిత. ఆడపిల్లలపై రచయితకు ఎంత గౌరవం ఉందో లేపటి అమ్మలో ప్రకటితం అవుతుంది. పరికిణీ ధరించిన నేటి ఆడపిల్ల రేపు మదర్ థెరిస్సా నో, పల్నాటి నాయకురాలు నాగమ్మనో సాహసి, మలాలానో, విప్లవాల ఉప్పెన అంగ్ శాన్ సూకీ నో అవుతుందని నేడు ప్రతి ఒక్కరూ 3జీవిత బీమాచిహ్నం లా రేపటి అమ్మను ఆదుకోవాలంటారు.
మహత్మాగాంధీని, జాషువాని, సినారే ని అభిమానిస్తూ ఆరాధిస్తూ అందరికీ వందనాలు అర్పిస్తారు మోహనరావుగారు. సెంటిమెంటుకూ నేటి నిజానికి లంకె పెడుతూ 3కృష్ణ(నది) పాపాలు కడుగుతుందో లేదో ! ప్రాణాలు మాత్రం నిలుపుతుంది అంటారు. మానవేతిహాసంలో. ఏకవీ ఇంతవరకూ ఇలా భౌతికాంశాన్నీ, విశ్వాసాన్నీ ముడిపెడుతూ రాసి ఉండలేదనిపిస్తుంది.
రచయిత సొంత ఊరు 1జూలకల్లు2 గురించి చదువుతోన్న ప్రతి పాఠకుడిని తమ బాల్యం లోకి లాక్కెడుతుంది మోహన్‌గారి రచన.
మోహనరావుగారు రాసిన ఈ 3విచ్చుకోవాలి2 వచన కవిత్వం సంకలనం చదువుతూంటే తప్పకుండా పాఠకుల పెదవులు ఆనందంతో విచ్చుకుంటాయి.

- కూర చిదంబరం 8639338675