పఠనీయం

అరుదైన పద్య మాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యాలయము-4
ప్రతులకు ఫోన్ నెం. 8897073999.
*
ఈ ప్రపంచంలోని మానవ సమాజాలలో ఎన్నో భాషలు ఉన్న ఒక్క తెలుగులోనే పద్య ప్రక్రియ ఉండటం తెలుగువారు గర్వించదగ్గ విషయం. నేటి ఆధునిక సమాజంలో పద్యం వెనుకబడిపోతూ హృదయమైపోతున్న తరుణంలో పద్యం చదవండి, పద్యం వ్రాయండి, పద్యం గురించి వ్రాయండి అంటూ ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారు ‘పద్యాలయము-4’ అనే గ్రంథాన్ని పద్య వ్యాస సంపుటిగా రూపొందించడం ఎంతో ముదావహం. మొదటి విభాగము సంప్రదాయేశ్వరిలో వివిధ రచయితలు వ్రాసిన రామాయణ గ్రంథములోని బాలకాండ నుంచి అరణ్యకాండ వరకు ఎన్నుకొనబడిన అమూల్యమైన పద్యాలను ప్రచురించడం జరిగింది.
భాస్కర రామాయణములోని బాలకాండను ‘జన విభుడు ఋశ్యశృంగుని’ అనే కందముతో మొదలుపెట్టారు మొల్ల రామాయణములోని అయోధ్యకాండము. అయ్యల రాజు రామభద్రుని రామాభ్యుదయములోని అరణ్యకాండ, గోపీనాధ రామాయణములోని కిష్కింధకాండము, శ్రీమద్రామాయణ కల్పవృక్షములోని సుందరాకాండము,శ్రీపద చిత్ర రామాయణములోని యుద్ధకాండము వరుసగా పొందుపరచారు.
రెండవవిభాగం సర్వావర్ణోపశోభితలో నేటి సమకాలికులైన కవుల పద్యాలు ఉన్నాయి. దీనిలో శ్రీరాముని ప్రత్యేకత గురించి, విశ్వామిత్రుని గొప్పదనము, రామకథ నిజమా, రామబాణము యొక్క పరాక్రమాన్ని, రాముడు సకలగుణాభిరాముడు, ఆఖరుగా సీతారామ కల్యాణం గురించి వివిధ రచయితలు అద్భుతంగా పద్యగానం చేశారు.
విద్మున్మాలా వృత్తము తమాషాగా వ్రాశారు శ్రీ రామ్‌దార్‌గారు. నేలన్ బుట్టెన్ నీతిన్ బట్టెన్, వాలిన్ గూల్చెన్, వార్దిన్ దాటెన్, ఆలిన్ దెచ్చెన్ వైరిన్ గొట్టెన్ పాలించెన్ పెంపారన్ రామాః అని రామచరిత్ర అంతా చిన్న పద్యంలోకి తెచ్చి చూపించారు. దేశభక్తిని ప్రబోధించే పద్యాలు వివిధ రచయితలవి పొందుపరిచారు. తల్లి మనసులోని వీరవనిత ఆత్మఘోషను - ఆ ‘నీవు తిరిగిరావు నిన్జంపి బ్రతికున్న, వాని జంపి తిరిగి వచ్చు కొడుకు/ వీరపత్ని భార్య వీరమాతను నేను/ వీరపుత్రుడొకడు వెలయుగాక’ అంటూ దేశంకోసం మరొక్క వీరపుత్రుడు వస్తాడు అని గర్వంగా చెప్పారు. మరొక్కచోట మాతృభూమి రక్షణే తమ ప్రధమ కర్తవ్యం అని వక్కాణించారు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాలకు పోయేటప్పుడు కవులను కూడా తమతో తీసుకొని రణరంగమునకు వెళ్ళేవారట. యుద్ధంలో ఉత్సాహంగా రావడానికై. గ్రంథంలో అక్కడక్కడ కంకంటి పాపరాజుగారి ఉత్తర రామ చరిత్రలోని పద్యాలను పొందుపరిచారు. ఇక ఆఖరుగా విమర్శా రూపిణిలో ఏడుగురు రచయితల పద్య గద్య వ్యాసాలను ముద్రించారు. తెలుగులో పద్య రామాయణాలు గురించి విపులంగా వివరించారు విహారిగారు. కామార్థ గుణ సంయుక్తం, ధర్మార్థ గుణ విస్తరం- అందుకే రామాయణానికి అంతటి అమృతత్వం సిద్ధించింది భాస్కర భారతి వ్యాసములో డా. వి.సీతాలక్ష్మిగారు పోతనగారు వ్రాసిన ‘కుప్పించి యెగసిన కుండలమ్ములకాంతి’ అనే పద్యం నాగ పాశబద్ధులైన రామలక్ష్మణులను బంధవిముక్తులను చేయుటకు గరుత్మంతుడు వచ్చిన సందర్భంలో భాస్కర రామాయణంలోని పద్యాన్ని, అదేవిధంగా అనంతామాత్యుని బీజరాజీయంలోని పద్యాన్ని పోలియున్నట్లు తెలియజేయడం వీరి పరిశీలనా ప్రతిభకు నిదర్శనం.
విశ్వనాథ సుందరకాండములోని బహువిధ సౌందర్యము అద్భుతముగా తీర్చిదిద్దారు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు. సంధ్యాకాలమునుండి సంధ్యాకాలము వరకు జరిగిన వృత్తాంతమే సుందరాకాండము అని ఒక ఉపాసనా రూపమును చిత్రించారి శ్రీ విశ్వనాథవారు.
ఈ గ్రంథములోని పద్యాలలో అగ్రభాగము రామాయణము గురించి వ్రాసిన వాటినే పొందుపరిచారు. భాతృప్రేమ, పితృభక్తి రాజ్యపాలన, కరుణ దశ, స్నేహం, ఆదర్శ దంపతుల లక్షణాలు అన్నీ ఇక్కడి సమాజంతో విడదీయలేని అనుబంధం ఉన్నది.ఉత్తరాది కథలు, దక్షిణాది పిట్టకథలు వాల్మీకి ఇంద్రజాలం అని గేలిచేసి, పిల్లిమొగ్గలు వేస్తున్న అతితెలివి మేధావులు సైతం తమ జీవనాలలో రామాయణ ధర్మాల్ని పాటిస్తున్నారు అనేది కాదనలేని నిజం. మొత్తంమీద ఈ పద్యాలయము గ్రంథము పాఠకులను అలరిస్తూ, పద్యాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది అనడంలో సందేహం ఎంతమాత్రం లేదు.

- జన్నాభట్ల నరసింహప్రసాద్ 8297263741