పఠనీయం

పరిచయాలు- పరామర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాకృతి
(పరిచయాలు - పరామర్శలు)
నాలుగవ భాగం- విహారి
వెల:రూ.150/-
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్,
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44
*
మంచి కథలను, కథకులను గుర్తించి ప్రశంసించటం ఆ మంచిని తన విశ్లషణలుగా, సమీక్షలుగా, పరిచయాలుగా రాసి పాఠకలోకానికి ఉపాయనం చేయటం విహారిగారి స్వభావం. వందలాది రచయితలను, కథలను వాటి వైవిధ్యాన్ని చదివి, గుండె పండించుకుని ఆ స్పందనలను, అనుద్వేగాలను ఒక అపూర్వ ఆత్మీయ స్పర్శతో ఈ వ్యాసాలు రాశారు. అవన్ని ‘కథాకృతి’ పరిచయాలు- పరామర్శలుగా గ్రంథస్థం చేస్తూ వస్తున్నారు. విహారిగారి ప్రభావంతోనే సాహిత్య రంగం వైపునకు మరలి మరీ ముఖ్యంగా కథానిక జీవిగా తెలుగు కథా వికాసానికి నిరంతరం కృషిచేసిన కీ.శే వేదగిరి రాంబాబు మునపటి ‘కథాకృతి’ సంపుటాలు వెలువడడానికి ప్రేరకుడై నిలువగా ఈ సరికొత్త నాలుగవ భాగంను ఆ రాంబాబుకే నివాళి- అంకితంగా విహారిగారు వెలువరించారు. వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణగానే విడుదలచేశారు. ‘కథాకృతి’ నాలుగవ భాగంలో యాభై మంది కథకుల కథల పరిచయాలు - పరామర్శలు కావించారు. దీనిలోని కథానికలతో కలసి సంఖ్యాపరంగా ఇప్పటికి మూడు వందల కథల విశే్లషణలను ఆయన ప్రచురించిన వారవుతున్నారు. నిజంగా తెలుగు కథా ప్రపంచంలో ఇదొక స్మరణీయ ఘట్టం. కీ.శే. వేటూరి సుందర రామమూర్తి, ధేనువకొండ శ్రీరామమూర్తి, శ్రీయుతులు రావులపాటి సీతారాంరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, మల్లాది వెంకటకృష్ణమూర్తి, అదృష్టదీపక్, ఎల్.ఎర్.స్వామి, మగూరి చిట్టెన్ రాజు, ముదిగంటి సుజాతారెడ్డి వంటి ప్రసిద్ధులతో బాటు నేడు లబ్దప్రతిష్ఠులవుతున్న నూతన కథకులు శ్రీ ప్రభాకర్ జైని, సింహప్రసాద్, బి.ఎస్.రాములు, బి.మురళీధర్, కూర చిదంబరం, సి.ఎస్.రాంబాబు, తుర్లపాటి రాజేశ్వరి, సుజలగంటి, శరత్ జ్యోత్స్నరాణి, ఉషా గాయత్రి వంటివారి కథలను ఈ సంపుటిలో పరిచయం చేశారు.
విహారిగారి ఈ విశే్లషణా వ్యాసాలు ఆయా కథల వైవిధ్యాన్నీ, కథకుల రచనా ఫణితిని పరిచయం చేస్తూనే నవతరం కథల ట్రెండ్‌ను విశదపరుస్తూ సరియైన మంచి కథావికాసం కోసం ఒక దిశా నిర్దేశనం చేసేవిగా కూడా భాసిస్తున్నాయి. యువతరం కథకులు అందిపుచ్చుకోవాల్సిన గ్రంథం ‘కథాకృతి’.

-సుధామ