పఠనీయం

హృదయాహ్లాదాన్నిచ్చే ‘‘కాశీపట్నం చూడరబాబూ’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీపట్నం చూడరబాబూ ( ధార్మిక సామాజిక నవల )
రచన: మణి వడ్లమాని
వెల : రూ.100/-
H.No. 2-2-185 /53/3, వీధినెం. 13 సోమసుందర్ నగర్, బాగ్ అంబర్‌పేట, హైద్రాబాదు -13

== ======================================
చెట్టు, పుట్టల్లా కాకుండా, మనిషి చలనశీలి. క్రొత్త ప్రదేశాలు చూడాలనో, క్రొత్త విషయాలు కనుక్కోవాలనో, నిరంతరం ఆరాటపడుతుంటాడు. అతని ఆరాటమే అమెరికా దేశాన్ని కనుక్కుంది. ఐరోపావారితో మన దేశానికి సంబంధాన్ని నెరిపింది. ఆ దేశ ప్రతి చర్యకు, ఆధ్యాత్మికాన్ని జోడించే మన పూర్వులు కూడా ఉత్తరాన ఉన్న కాశీ నగరాన్ని, దక్షిణాన ఉన్న రామేశ్వరానికి జోడించి, అక్కడి గంగను ఇక్కడ కలపాలనీ, ఇక్కడి సేతువును అక్కడ కలపాలని, ఈ చర్యను పుణ్యంతో ముడిపెట్టారు. ఇందువల్ల రెండు ప్రాంతాలవారికి సంస్కృతుల పరస్పరావగాహన ఏర్పడుతుందన్న విశ్వాసం.
ఈ నవలా రచయిత్రి! మణి వడ్లమానిగారు విద్యాధికురాలు. కార్పోరేటు రంగంలో పనిచేయటంవల్ల మానవ సంబంధాలపట్ల గొప్ప అవగాహన కలిగి ఉన్నవారు. మాతామహుల వేపునుండి ధార్మికాన్ని, పితామహుల వేపు నుండి ఆధునికతను అలవర్చుకున్నారు. 50కి పైగా కథల్నిరాశారు. పలు పురస్కారాలను గెలుచుకున్నారు.
నాగభూషణం; రాజారావు శ్యామల దంపతులు; రమేష్ జయ; విజయ్ పద్మ దంపతులు మోహన్, బామ్మ- వీరంతా ఒక టూర్ ఆపరేటర్ పుణ్యమా అని కలిసి ట్రయిన్‌లో కాశీ సందర్శనకు వెళతారు. నాగభూషణంగారు శేష జీవితం కాశీలో గడపాలని ఒక స్నేహితుడి కోరికమేరకు, స్నేహితుడి తండ్రి చితాభస్మాన్ని కాశీలో గంగ నిమజ్జనం చేయాలనీ అనుకొంటారు రాజారావు దంపతులు, యుగయుగాల దివ్యత్వం నిండి ఉన్న గంగానదిని కాశీలో సందర్శించుకోవాలని, విజయ్, పద్మ దంపతులు, అమ్మ అస్థికలు గంగలో కలిపితే ఆవిడ ఆత్మశాంతిస్తుందని అనుకున్న 30 ఏళ్ల ఉద్యోగిని శంఖరూప, బ్రతుకుతెరువుకోసం కాశీ వెళుతున్న 17. 18 ఏళ్ళ చంద్రశేఖర దీక్షితులు; బామ్మగా పిలవబడ్డా; మోహన్ కుటుంబానికీ ఏమీ కాని, బామ్మ, మోహన్ కుటుంబం- కలిసి కాశీకి ప్రయాణమవుతారు. ఒక్కో కుటుంబానిదీ, ఒక్కో వ్యక్తిదీ, ఒక్కో చరిత్ర. ఒక్కో రకమైన ఐహిక సంబంధిత బాధ. యుగయుగాలనించి ఆముష్మిక స్వాంతనను ప్రసాదిస్తున్న కాశీవిశ్వనాథున్నీ, ఆయన రెండో భార్యగా, అంతే చరిత్ర కలిగిన గంగానదిని దర్శించుకోవాలని బయలుదేరుతారు వీరంతా. రైలు ప్రయాణం మరియు కలసి చేసిన కాశీ సందర్శనం వీళ్లనందరినీ ఆత్మీయులుగా కలుపుతుంది. ఇందరు వ్యక్తుల్లోనూ గూడు కట్టుకుని ఉన్న ప్రాపంచిక ఆవేదనలు గంగలో ప్రక్షాళనం కావించబడి కొత్త ఆశలతో, జీవితాలను కొనసాగించుకోవడానికి అవసరమైన ఆత్మసంతృప్తి తో తిరుగు ప్రయాణంతో నవల ముగుస్తుంది.
కొన్ని వేల ఏళ్లనుండి ‘శాశ్వత మోక్షస్థలం’ గా భావించబడుతూ జీవితం కొనసాగించదల్చుకున్నవారికీ , అంతిమ ఘడియలు సమీపించిన వారికీ ఇహపరసుఖాలను ప్రసాదించగలిగే కాశీ గొప్పతనం బహుశా అదే నేమో... పుస్తకానికి రచయిత్రి ఎన్నుకొన్న టైటిల్ చూడగానే ఏనుగుల వీరాస్వామి గారి ‘కాశీయాత్రా చరిత్ర’ లాంటిదే.. మరో చిన్న నవల ఇది అనుకొనే ప్రమాదం ఉంది. 104 పేజీల ఈ నవలలో 80 పేజీల తర్వాతనే మనలను కాశీతీసుకొని వెళతారు రచయిత్రి. ఎక్కడా అసహత సృష్టించకుండా, నేలవిడిచి సాము చెయ్యకుండా పొత్తూరి విజయలక్ష్మిగారు ఈ పుస్తకానికి ముందుమాటలో చెప్పినట్లుగా తెలుగుతనం కనిపిస్తుంది. హృదయాహ్లాదభూతిని కలిగించే ఈ నవలా పఠనం వల్ల పాఠకులకు కలుగుతుందనటం నూటికి నూరు పాళ్లు నిజం.

-కూర చిదంబరం 8639338675