పఠనీయం

పార్టీలకు చురక, ప్రజలకు వైతాళిక గీతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజదండం (పద్యకృతి):
రచయిత- డా.జనువాడ రామస్వామి;
పుటలు:52, వెల:రూ.30/-,
ప్రతులకు: ఇం.నెం.3-178, చిల్కూర్ పోస్టు, వయా కనకమామిడి, మొహినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా- 501504

==== ========== ============ ==================

‘‘దుర్జనుడి చిట్టచివరి తెరువు ‘రాజకీయం’ (పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసోర్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రెల్)’’ అన్నాడు ఐర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత నాటక రచయిత, విమర్శకుడు అయిన జార్జ్ బెర్నార్డ్‌షా. క్రీ.శే.1900 నుంచి 1910-50ల వరకు దేశ దేశాలలో తన కాలంలో సాగుతుండిన రాజకీయ కుటిలతా ధోరణులను అధ్యయనం చేసి, వాటిని కాచి వడబోసి ఈ మాట అన్నాడు నిర్భీతిగా, నిక్కచ్చిగా. ఆ అవగాహనా కోణానికీ, ఆ పదునైన చురకకు ‘అవసరమైన ఋజువుగా మన దేశంలో నేడు నడుస్తున్న వక్రతా, కపటతా రాజకీయాలకను అంశంగా తీసుకొని 76 పద్యాల లఘుకృతిని రాశారు ఇటీవల డా.జనువాడ రామస్వామి.
‘‘టిక్కెట్టు దొరకదా తిక్కరేగును కదా!
పార్టీని మార్చును పరుగుపెట్టి
కులబేర సారముల్ కుత్సిత తంత్రముల్
రాజకీయములలో రాచబాట
ఏమైన చేయును నెన్నికల గెలువ
మాటలు సాగవా మూట విప్పు
వంది మాగధులంత నందులై పోతారు
ఆఫీసు గుడి ముందు అణిగిమణిగి
బాధ కలుగు శాసనసభ గాథ వినగ
ప్రజలు పట్టించుకోనట్టి పాలనంబు
నేతల న్యాయమును జూడ నీటి మూట
సారసీసాల ముసుగులో సాగుతుంది’’-
ఈ పద్యం మొత్తానికీ సారాంశప్రాయం. ఇందులోని అన్ని పద్యాలూ ఇలానే వాడిగా, వేడిగా, కొన్ని వ్యంగ్యంగా, కొన్ని వెటకారంగా, ఇంకొన్ని సూటిగా, మరికొన్ని చాటుమాటు వేటుగా, కొన్నిచోట్ల ఘాటు మాటల పోట్లుగా సాగిపోతాయి. ప్రక్రియ పరంగా ఛందో బద్ధ రచనే అయినా భాషాపరంగా ముప్పాతిక మువీసము అంటారు, ‘పాట్లు పడుతూ’, ‘రావాలి’ వంటి అసంఖ్యాక వ్యావహారిక భాషా పద రూపాలతోనే సాగుతుంది.
‘మార్చుతమని’, ‘తల నర్కి’ (తల నరికి) వంటి తెలంగాణ మాండలిక క్రియా పద ప్రయోగాలు సందడి చేస్తాయి అక్కడక్కడ.
‘‘గుడ్డి పాచిక పారెనా గుడిని మ్రింగు’’, ‘‘పాలించు వారికి, పాలమ్మువారికి పిండుట న్యాయము దండిగాను’’, ‘‘అసమ్మదీయులకైతే అసలైన నజరానా- తస్మదీయులకైతే తవుడు తట్ట’’ వంటి వాక్యాలు కొత్త సామెతలుగా, లోకోక్తులుగా, చమత్కారపు నుడులుగా అందగించాయి.
ఉత్వ నిత్యత్వ సంధి పాటింపు, ద్రుత సంధి, యడాగమసంధి కార్యాల నిర్దుష్టత వగైరాలు ఇందులో నిర్లక్ష్యం చేయబడ్డాయి. వ్యావహారిక భాషలో రాసిన పద్యాలు కనుక అవి అనవసరం అనుకొని ఉండవచ్చు రచయిత.
9వ పద్యంలో ‘సభ్యుల మర్యాద మన్నన శాసనసభ’ అన్న పంక్తిలో గణభంగం జరిగింది. 10వ పద్యం 4వ పంక్తిలో ‘శివమెత్తి జనములో తిరుగుతారు’ అన్నచోట యతి గతి తప్పింది.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290