పఠనీయం

జీవితానికి నిర్వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయ జలతారు కథలు
రచన:సలీం,
వెల:రూ.150/-,
ప్రతులకు: జ్యోతి వలబోజు, సెల్ నెం.8096310140, మరియు ఇతర పుస్తక విక్రేతలు
========================================================
‘జీవితం’ అనే జగన్నాటకంలో అందరమూ పాత్రధారులం. ఎవరి పాత్ర ఎంతవరకో ఆ విధాత నిర్ణయించి ‘తెరముందుకు’ పంపుతాడు. ఇవ్వబడిన పాత్ర పోషణ చేస్తూ‘తెరమరుగు’ కావాలి. సాహితీవేత్తలు అపరబ్రహ్మలు. ‘ఆ మనకు’ పోటీగా పాత్రలను, సన్నివేశాలను, సంఘటనలను సృష్టిస్తారు. కొన్ని కొన్ని అలాంటి కల్పనలు నిజ జీవితాలకు అతి దగ్గరగా ఉంటాయి. పాఠకునికి కళ్ళెదుట పటం కట్టి చూసినట్లు అనుభూతి కలుగుతుంది.
9 కథా సంపుటాలు 18 నవలలు, 3 కవితా సంపుటాలను మన ముందుకు తీసుకువచ్చిన సమకాలీన రచయిత సలీం కథా సంకలనం ఇది. ఇందులో 16 కథలున్నాయి. ఇవన్నీ లోగడ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడినవే!
ఒక రచయిత సృజించిన రచనలను సంపుటి రూపంలో చదవటంవల్ల ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ రచయిత ఎన్నుకున్న కథా వస్తువుని, పాఠకుల ముందు ఉంచిన తీరుతెన్నులని ఆ రచయిత మానవ సంబంధాలకు, జీవితాలకు ఇచ్చే నిర్వచనం పాఠకుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
‘కళ’ అనేది కుల మతాలకు అతీతంగా ఉంటూ సకల జనరంజకం గావించగలగాలి. వేయాల్సిన పెద్దపీట నటనకు, మతానికి కాదు. అది విస్మరించి సంకుచితత్వానికి పోతే కళ తప్పుతుందని మొదటి కథ తెలుపుతుంది. పెళ్లిళ్లకు మరేదైనా సందర్భాలకు బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటే, ఆ బహుమతి సందర్భానికి తగినట్లు మరియు స్వీకర్త అవసరాన్ని బట్టి నిర్ణయించాలి. స్వీకర్త స్థాయిని బట్టి ఇచ్చే బహుమతిని నిర్ణయించటం సరికాదు. అట్లాగే, పెళ్లిలోని ఆంతర్యం గ్రహించకుండా, ఎచ్చులకు పోయి అందమైన ఆడపిల్లలను మైనపు బొమ్మలుగా నిలబెట్టడం అనాగరికం అని చెప్పే ‘సాలభంజికలు’.
అబద్ధం చెప్పకూడదు. సరే.. ఆ అబద్ధం వల్ల ఒక మంచి పని జరిగితే- పోట్లాడుకునే అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదర్చగలిగితే మంచిదేనని ‘ఒక అబద్ధం’ కథ చెబుతుంది.
ఒక ఉద్యోగి విద్యుక్త ధర్మం ఏమిటి? యజమాని ఇచ్చే నెల నెలా జీతానికి ప్రతిఫలంగా తన విధులు నిర్వర్తించాలి. కాని లంచాలకు మరిగిన ఆ ఆఫీసులో ‘మోజెస్’ అనే ప్యూను తన పైవాళ్లందరికీ ఎలా కనువిప్పు కలిగించాడో తెలుసుకోవాలంటే పాఠకులు ‘అలజడి’ చదవాల్సిందే.
నేటి బాబాలను దర్గాలను ఆశ్రయించుకుని బ్రతికే రవికుమార్ మరియు సుభానీల్లాంటి చీడపురుగులు ప్రజల విశ్వాసాన్ని ఎలా సొమ్ము చేసుకుంటున్నారో, భక్తి ముసుగులో వారు సాగించే అసలు వ్యాపారం ఏమిటో ‘మామ జలతారు’ కథ చెబుతుంది.
స్థాలీపులాకన్యాయంగా, పైన చెప్పబడిన కథలే కాదు ప్రతి కథలోనూ ఒక నీతి, న్యాయం తెలిపే ప్రయత్నం చేసాడు రచయిత.
కథలన్నింటా జాలురిన కొన్ని ఆణిముత్యాలు-
‘‘బ్రతుకు అనుభవమైతే, చావు కూడా మరో అనుభవం’’ (పే.102)
‘‘రత్నఖచిత సింహాసనం మీద కూర్చున్న రాజైనా.. ఈ మట్టిలో కలవాల్సిందే! అతని గురించని బంగారం చేసిన మట్టి దొరకదు’’ (62)
‘‘బహుమానం (గిఫ్ట్) ఇచ్చేది, ఆ వ్యక్తిమీది ప్రేమాభిమానాల్ని దృష్టిలో పెట్టుకుని; వ్యాపార దృష్టితో కాదు’’ (పే17) లాంటి మంచి వాక్యాలు ఈ కథల సముద్రంలో కోకొల్లలు.
మొదటిసారి చదవండి కథ అర్థం అవుతుంది. రెండోసారి చదవండి రచయిత సలీం. ఈ కథలమీద కప్పిన ‘మాయ జలతారు’ అడ్డుతొలగి అసలు తాత్వికత అర్థం అవుతుంది’.

-కూర చిదంబరం 8639338675