పఠనీయం

హస్త్భారణమే ఇది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్ఘల చిన సీతారామశాస్ర్తీ
అయల సోమయాజుల గోపాలరావు
కేంద్ర సాహిత్య అకాడమీ రవీంద్రభవన్ - 35 ఫిరోజ్‌షారోడ్, న్యూఢిల్లీ - 110001
వెల : రూ50/- లు
==================================================

ఇప్పుడంటే స్థితి మళ్లీ ఇలా అఘోరిస్తోంది కానీ ఒకప్పుడు భాష పట్ల అందునా రచనాభాషలో సుష్టుపద ప్రయోగాల పట్ల ఎంతో ప్రాధాన్యత ఉండేది. వ్యాకరణ దోషం ఏమాత్రం కనబడినా ఆ రచన విమర్శనకు లోనైయ్యేది. అరసున్నలు, బండి ర (ఱ) లు సరిగ్గా ప్రయుక్తం కాలేదని విశ్వవిద్యాలయాల్లో సిద్ధాంత గ్రంథాలు రాసి సమర్పించినన కొందరికి డాక్టరేట్ పట్టాను ప్రదానం చేయకపోవడం అటుంచి అనర్హులుగా ప్రకటించిన సందర్భాలుండేవి.
అంతెందుకు మహామహులమన్న కొందరిని అసలు వారి భాషాజ్ఞానం లేదని నిరసించిన ఘట్టాలుండేవి. వైయాకరణుల ఆమోదం పొందనిదే సాహితీవేత్తలుగా గుర్తించేవారే కాదు. ‘తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది.’ అని తిరుపతి వేంకట కవులన్నారు.‘నిజానికి ప్రయోగశరణం వ్యాకరణం’ కావాలని సిద్ధాంతీకరించినవారున్నారు. ‘ఆర్యవ్యవహారంబుల దృష్టంబులు గ్రాహ్యంబులు’ అని పెద్దలు ప్రయోగించిన పదాలు కొన్ని అసాధురూపాలనిపించినా ఆమోదయోగ్యాలనే సూత్రమూవచ్చింది. అది దృష్టంబులు గ్రాహ్యంబులే కానీ ‘దుష్టం’బులు గ్రాహ్యంబులు అని కాదు అని ఎద్దేవా చేసిన వారున్నారు.
చిన్నయసూరి బాలవ్యాకరణం, బహుజన పల్లి సీతారామాచార్యుల ఫ్రౌడవ్యాకరణం తెలుగు చదువుకునే విద్యార్థులకు సుపరిచితాలుగా వుండేవి. తెలుగు వ్యాకరణం ఆసక్తిదాయకంగా బోధించగల వారే అసలయిన తెలుగు పండితులుగా, ఉపాధ్యాయులుగా భావింపబడ వారు కూడాను. కావ్య వచన పాఠాదులు బోధించడానికే వ్యాకరణం బోధించడానికీ చాలా తేడా ఉంది. విద్యార్థికి వ్యాకరణ పాఠాలు బాగా పట్టుబడితే వౌఖికంగానూ, లేఖనంలోనూ కూడా దోషాలుండవనీ, అనౌచిత్యం పరిహరించి భాషను ప్రయుక్తం చేయగలుగుతారనీ ఏ తాదృశమార్గంలో బోధన కావించేవారు.
అందుకే తెలుగులో వ్యాకరణ పండితులకు ఎంతో విలువ ఉండేది. సృజన కారుడైన కవులు, రచయితమూ కూ వారి ఆమోదానికై ఆత్రపడేవారు. వ్యాకరణం రంగం అభిమాన రంగంగా మార్చుకుని సాహిత్య విద్యా ప్రవీణ ఎం.ఏ పట్ట్భద్రతలు పొంది పరిశోధనలు ఆరంగంలోనే చేసిన వారు తెలుగు పండిత శ్రేణిలో కూడా అంత విరళంగా ఏమీ లేరు.
వ్యాకరణ విమర్శకే అంకితమై, ఆంధ్రవ్యాకరణానికి సంబంధించి గణుతికెక్కిన వారిలో ఆంధ్రవైయాకరణ సార్వభౌమునిగా, ఆంధ్ర పతంజలిగా ప్రసిద్ధి గాంచిన వారు వజల చిన సీతారామస్వామి శాస్ర్తీగారు ఒకరు. కవిగా భాషా, సాహిత్య, ధర్మశాస్తజ్ఞ్రునిగా పేరొందిన వారి గురించి భారతీయ సాహిత్య నిర్మాతలు పరంపరలో కేంద్ర సాహిత్య అకాడమీ గ్రంథం వెలువరించడం సంకల్పించడమే ఒక విశేషం కాగా ఆ బాధ్యతను విజయనగరం సంస్కృత కళాశాలలో చదివి ఆనాడే నాలుగు దశాబ్దాల అధ్యాపక వృత్తి నిర్వహించిన డా. అయల సోమయాజులు గోపాలరావు గారికి అందించడం అభినందనీయం. వజ్ఘల వారి గురించి గోపాల రావు గారి ఈ గ్రంథం ఒక విలువైన ‘మోనోగ్రాఫ్’ ‘తెలుగు వ్యాకరణ పు గుడ్డిదీపాన్ని సెర్చ్‌లైట్ కింద మార్చా తానై ఒక లైట్ హౌస్‌గా వెలిగిన ఒకే ఒక మహానీయుడు వజ్ఘల శాస్ర్తీగారు’అన్నారు ఆరుద్ర. శాస్ర్తీగారు రాసిన వ్యాకరణ గ్రంథాలు కొన్ని స్వతంత్రాలు, ఇంకొన్ని వ్యాఖ్యానాత్మకాలు, మరికొన్ని విమర్శనాత్మకాలు. విద్యావిషయక వాదోపవాదాలలో, శాస్త్ర చర్చల్లో నే గాక సామాన్య లౌకిక విషయాల్లో కూడా ఎలాంటి పట్టుదల ఉండేదో వారి జీవితాన్ని. వారి వ్యాకరణ వైదుష్యాన్ని, వ్యాకరణేతర రచనలను, ఆంధ్ర వైయాకరణులలో వారి స్థానాన్ని గోపాలరావుగారు ఎనిమిది ప్రకరణాలలో ఈ గ్రంథంలో ఎంతో విశదంగా తెలియబరిచారు.
1878 లో పార్వతీపురం సీతారామపురం మాతామహుల ఇంట జన్మించిన వజ్ఘల వారు తండ్రి గారి వద్ద, కనిష్ఠ పితామహ పుత్రుల వద్దనే సంస్కృత కావ్య నాటకాదులు ,్ఛందో లంకార వ్యాకరణ ధర్మశాస్త్రాదులను అభ్యసించారు. అవసరానికి తగిన ఆంగ్ల భాషాప్రావీణ్యం కూడా సంపాదించారు. 23వ ఏట బొబ్బిలి , బరంపురంలో ఉద్యోగానే్వషణలో ఫలించక 1910 లో విజయనగరంలో రిప్టన్ హింద థియోలాజికల్ స్కూల్‌లో నెలకు రూ.15000/-ల జీతంతో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు.
ఆ పై గురజాడ వారే ఆయనకు విజయనగర సంస్కృత కళాశాలలో ఉద్యోగమిప్పించారట. ఆపై మూడేళ్లు మద్రాసు విశ్వవిద్యాలయ వారిచే ఎంపికై అక్కడ ప్రాచ్య విద్యాపరిశోధనా సంస్థలో పనిచేసి సర్వేపల్లి రాదాకృష్ణన్ గారి పిలుపులకై ఆంధ్రాయూనివర్సిటీలో ఆంధ్ర పండితులుగా వ్యాకరణ శాస్త్ర పరిశోధనమే శ్వాసగా జీవించి 1964లో అస్తమించిన ఆ వైయాకరణ సార్వభౌముని గూర్చి గోపాలరావుగారు వారి వైశిష్ట్యాన్ని ప్రత్యంశ సోదాహరణంగా వివరించిన తీరు ఎంతయినా ప్రశంసనీయం. ఎందరో తమ వంటి శిష్యులను తయారుచేసిన వజల వారు నిజంగా ధన్యజీవి. గ్రహింపదగిన ఉత్తమ గ్రంథం ఇది.

-సుధామ