పఠనీయం

యదార్థ సంఘటనల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యదార్థ సంఘటనల సమాహారమే (సింగమనేని గారి కథలు)
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, వెల:రూ.150/-,
H.No. 33-22-2 చంద్రం బిల్డింగ్స్, చుట్ట గుంట, విజయవాడ-520004, ఫోన్:0866-2430302
-------------------------------------------------------------------------------------------------------------------
నేల విడిచి సాము చెయ్యక తానున్న ప్రాంతంలోని ఆచార వ్యవహారాలనూ, అక్కడి పరిస్థితులనూ ఆ ప్రాంతపు మాండలికాన్ని తన కథలలో ఇమిడ్చి, అమాయకులను దగాచేసే దళారీ వ్యవస్థ గురించి, కుల మత వివక్షల గురించి, రకరకాల మోసాల గురించి వివరిస్తూ, సమాజంలో ఇవన్నీ నశించి, చక్కని మానవతా విలువలు చోటుచేసుకోవాలని తాపత్రయపడే కథలే.
సమాజాన్ని జల్లెడ పట్టి చేసిన రచనలు సుప్రసిద్ధ రచయిత సింగమనేని నారాయణ గారి కథలు! ఈ కథల సంపుటి 2001వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యలయంవారి పురస్కారాన్ని పొందిన ఉత్తమ కథల సంపుటి. 1999లో రాసిన ఈ గ్రంథంలోని పద్ధెనిమిది కథలూ 2018లోనూ ఇప్పటి పరిస్థితుల కనుగుణంగా రాసినట్టుగానే అనిపిస్తాయి. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పులేమీ లేవు. విలువలు పెరగలేదు. డబ్బు, హోదా, అహంకారం అన్నీ లేనివారిమీద స్వారీ చేస్తూనే వున్నాయి
‘అడుసు’ కథ చదివితే, కష్టపడి పనిచేసినా, పైసా చేతికందని పరిస్థితికి, సమాజాన్ని ఏమీ అనలేక, ఏమీ చెయ్యలేక, తామే ఆ శ్రమ నుండి తొలగిపోవాలని, తమకు కాస్తో కూస్తో ఆధారంగా వున్న చింతచెట్లని అమాయకంగా నరికెయ్యాలని తండ్రి కొడుకుని కూడా ప్రేరేపిస్తాడు.
దుష్టశక్తులను దునమలేని నిస్సహాయత తమ చెట్లమీద చూపిస్తాడు కథానాయకుడు.
ఇలాగే ప్రతీ కథలో అన్యాయం, అసత్యం, అల్పత్వం, వీటిని ఏరిపారెయ్యడానికి తన కథలను ఆయుధంగా వాడుకుంటూ, సమాజం మారాలని కోరుకుంటాడు.
‘యక్షప్రశ్నల’ కథ ముగింపు పాఠకులనే తెలుసుకోమని కోరుతాడు రచయిత. సూటిగా విషయాన్ని చెబుతూ ఆసక్తికరంగా కథ నడిపించడం సింగమనేని నారాయణగారి ప్రత్యేకత. వీరి కథలు నిత్య చైతన్య దీపికలు. నాడూ, నేడే కాదు, భావితరాలను ఆలోచింపజేస్తాయి.
కనుక సదానిలిచి వెలిగే ఈ యథార్థ సంఘటనల సమాహారాన్ని ప్రతివారు చదివి తీరాలి. అపుడే మనలను మనం పునరాలోచింప చేసుకొంటాం. ఆ ఆలోచనే ద్వారానే మనలను మంచిదారిలోకి మళ్లించుకోగలుగుతాం.
అదివరకు చదివినవారు మళ్లీ చదవాలని, కొత్తవారు చదివితీరాలని, చదివిన వారు చదవని వారికి వివరించి మరీ చదివింపచేయాలని మనవి చేస్తూ ఈ గ్రంథాన్ని పునర్ ముద్రీకరించినందుకు గడ్డం కోటేశ్వరరావుగారినీ, వారి సహచరులనూ అభినందిస్తున్నాను.

- శారదాఅశోకవర్ధ్దన్