పఠనీయం

కేవలం కేలండర్ కథే కాదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేలండర్ కథ
-డా.మహీధర నళినీమోహన్
వెల: రూ.130.. పేజీలు: 160
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్

** ** **************************************

ఇది కేవలం కేలండర్ కథే కాదు. ఇందులో అనేక విషయాల్ని విస్తారంగానే పొందు పరిచారు. ముఖ్యంగా పాఠకులు ముందుగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ పుస్తకంలోని ఏ భాగాన్నైనా కానీ, పాక్షికంగా కానీ, కాపీ రైటు హక్కు కలిగిన వారి నుండి లేక ప్రచురణ కర్తల నుండీ ముందుగా రాతపూర్వకమైన అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా కాపీరైటు చట్టప్రకారం నేరం. కావున అనుమతి పొంది ఇందులోని అంశాలను వాడుకోవడం మరువవద్దు. రచయిత తన తొలి పలుకులోనే కేలండరు అవసరాన్ని గూర్చి తెలియజేశారు. పంచాంగం అనే మాటకు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే అంగములు కలది అనే ప్రత్యేక అర్థం వున్నప్పటికీ, దీనిని కేలండర్ అనే మాటకు పర్యాయ పదంగా సామాన్యార్థంలోనే వాడానని రాస్తూ, కేలండర్ అనే పదానికి లాటిన్ భాషలో అసలు అర్థం ‘ఎకౌంటు పుస్తకం’ అని మాత్రమే అని చెప్పారు. కేలండర్ అనేది ఎకౌంటు పుస్తకం అయితే అవచ్చేమోగానీ, పంచాంగం మాత్రం కాదు.
కేలండర్ ఎందుకో, పాతకాలపు పనిముట్లు ఏమిటో, కేలండర్‌లోని వివిధ దశలు, అందులోని ముఖ్య ఘట్టాలు అందరినీ ఆకట్టుకునేట్లుగా, ఆకర్షణీయంగా, వారు సేకరించిన విషయాల నన్నిటినీ, విశదీకరించారు. అలాగే ఓరుగల్లు గడియారం, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు, నిప్పు గడియారాలు, ఎండ గడియారాలు గురించి చదువుతుంటే ఏవో కొన్ని అద్భుతాలు మన కళ్లెదుట కదలాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇవి చాలా సరదాగా ఉన్నాయి.
అలాగే పంచాంగ నిర్మాణం గురించీ, రాశిచక్రం గురించీ, ఏయే రాసులకు, ఏయే పేర్లు ఎలా పెట్టారో వివరించారు. భారతదేశంలో కేవలం సౌర పంచాంగం కొన్ని రాష్ట్రాలలో వున్నప్పటికీ, అత్యధిక భాగంలో చాంద్ర - సౌర పంచాంగమే నడుస్తోంది. ఇది యధార్థం. అధిక మాస నిర్ణయాన్ని గురించీ, లుప్తమాస నిర్ణయాన్ని గురించీ, వివరంగా తెలియజేశారు. ఇంకా అనేకానేకములైన కేలండర్లను గూర్చి కూడా విపులంగా రాసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కేలండర్ కథను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం. డా.మహీధర నళినీ మోహన్‌గారు సుప్రసిద్ధ రచయిత. వారి గ్రంథాలు చాలా అద్భుతమైన విషయాలను పాఠకులకు అందిస్తూనే ఉన్నాయి. వారు చివరలో రాశి చక్రం (రవి మార్గంలో వున్న నక్షత్రాలను 12 గుంపులుగా విడదీసి, వాటిలో ఏవేవో ఆకృతులు ఊహించుకొని, వాటికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని పేర్లు పెట్టుకున్నారు) అని రాశారు. పేర్లేవైనా, ఆకృతులేవైనా, ఆనాటి నుంచీ ఈనాటి వరకు, ఫలితాల విషయంలో ఇవి ఎక్కువ ప్రభావానే్న చూపిస్తున్నాయనే మాట ముమ్మాటికీ వాస్తవం. ఇది చాలామంది అనుభవంలో తెలుసుకున్న విషయమే! దీనె్నవరూ కాదనలేరు కదా!

-షణ్ముఖశ్రీ 8897853339