పఠనీయం

విశ్వనాథ నవలపై వినూత్న పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథ నవలా దిగ్దర్శనం
రచయత: డాక్టర్ గుమ్ములూరి ఇందిర, వెల:రూ.250/-,
ప్రతులకు:జి.ఆర్.కె.ప్రసాద్ (రాంబాబు), 401, హెచ్‌ఐజి 250, సెక్టార్ 4, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-530017.
==================================================================
కవి సమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు బహుగ్రంథకర్తలు. పద్య గద్య రచనలలో సవ్యసాచి. ముఖ్యంగా వేయిపడగల నాటినుండి నవలా రచయితగా వారు సుప్రతిష్టితమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 56 నవలలు రచించారు. వానిలో పురాణ వైర గ్రంథమాల ధారావాహికలు.
వివిధ విశ్వవిద్యాలయాల్లో విశ్వనాథ వారి వివిధ రచనలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. ఇపుడు శ్రీమతి డాక్టర్ గుమ్ములూరి ఇందిరగారు విశ్వనాధపై పరిశోధన మొదలుపెట్టారు. అందులో ఒక గ్రంథం పేరు విశ్వనాధ నవలల దిగ్దర్శనం. అంటే రచయిత గ్రంథాలను సంగ్రహంగా పరిచయం చేయటం... ఇది విహంగావలోకనం వంటిది. అంటే ఒక్కొక్క నవలలోని లోతుపాతులను శిల్ప వైదుష్యాలను సమగ్రంగా ఆవిష్కరించటం కాకుండా నవలలన్నిటినీ ఒక చోటికి చేర్చి కూర్చి పేర్చి పాఠకులకు అందించటం. ఇది ఒకరకమైన కేటలాగుగవంటి పని. ఆంగ్లంలో దీనిని డిస్క్రిప్టివ్ కేటలాగ్. విశ్వనాధ వారి రచనలలోని సారాన్ని పాలలోని మీగడవలె తీసి అందించడానికి ప్రయత్నించారు. విశ్వనాథ రచనలు ఒక ఉద్యమ స్ఫూర్తిగలవి. పాశ్చాత్యులు భారతీయ చరిత్రను ఎలా వక్రీకరించారో తెలిసికొని కోట వెంకటాచలం వంటివారి చరిత్రలు ఆధారం చేసుకొని వీరు నవలా నిర్మాణం చేశారు. సండ్రాకొట్టస్ అంటే గుప్త చంద్ర గుప్తుడే కాని వౌర్య చంద్రగుప్తుడు కాదు అని ‘చంద్రగుప్తుని స్వప్నము’ అనే నవలలో నిరూపించారు.
అలాగే విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు ప్రధానంగా ఆంగ్ల భాషా బలహీనతలను శబ్దశాస్త్ర (ఫ్రొనెటిక్స్)లోని అశాస్ర్తియతను ఎత్తిచూపేది. శ్రీమతి ఇందిర ఈ నవలనన్నింటినీ ఓపికతో పరిచయం చేశారు అంటే ఈ గ్రంథం చదివినవారికి విశ్వనాథవారి మూల గ్రంథాలు చదువవలెననే ఆసక్తి సహజంగానే కలుగుతుంది.
ఈ విషయంలో పరిశోధకురాలు కృతకృత్యురాలైనారు. ఈ గ్రంథాన్ని సంస్కృతాంధ్రములో విద్వాంసులైన డా.రామవరపు శరత్‌బాబు గారికి అంకితం చేయడం ముదావహం.
‘‘ఒక్క సంగీతమేదో పాడుచున్నట్టు భాషించునపుడు విన్పించు భాష’’ వలె ఈ గ్రంథం కూడా లయాత్మకంగా ఉంది. సూక్ష్మంలో మోక్షం, పిండాండంలో బ్రహ్మాండం, సమగ్రంలో సమగ్రత- ఇదే ఇందిరగారి ప్రయత్నం.

- ప్రొఫెసఠ్ ముదిగొండ శివప్రసాద్