పఠనీయం

ఆచరణాత్మకంగా నిలచి ప్రేరణాత్మకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూల మనసులు (కథా సంపుటి)
-నండూరి సుందరీ నాగమణి, జె.వి.పబ్లికేషన్స్ ప్రచురణ- ఫ్లాట్ నెం. 7, బ్లాక్ నెం.18, హెచ్‌ఐజి 2, మానస ఎన్‌క్లేవ్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44, వెల: రూ.150/-, 9849989201.

ఇరవై ఒక్క కథల ‘పూల మనసులు’ కథా సంపుటి రచయిత్రి నండూరి సుందరీ నాగమణి. ఆంధ్రా బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, దశాబ్దకాలంగా రచయిత్రిగా ముమ్మర రచనా వ్యాసంగం సాగిస్తూ, ఇప్పటికే ‘అమూల్యం’, ‘నువ్వు కడలివైతే’ కథల సంపుటి ద్వారా పాఠకలోకానికి పరిచితులైనారు. ఆత్మీయులచే ‘సుమన’గా వ్యవహృతమయ్యే రచయిత్రి. నిజంగానే సుకుమార భావుకురాలు. ఆటవెలది పద్యాలను, కర్ణాటక సంగీతాన్ని, గడి-నుడిల పదాల పందిరిలను అభిరుచితో అభివ్యక్తీకరించే రచయిత్రి వాస్తవిక ఘటనలకే కథాకృతి కల్పిస్తానంటారు. ‘అఖండదీపం’ అనే కథ నీతి బోధలు చేయడం ద్వారా కాక ఆచరణాత్మకంగా నిలచి ప్రేరణాత్మకం కావాలని తెలిపే కథ. ఆదర్శాలు మాటల్లో కాక అనుష్ఠానంలో వున్నపుడే అవి ప్రభావోపేతమైనవని మంచిని అనుకరణకు ఆద్యంగా నిలపడం అవసరం అనీ చెప్పే మంచి కథ ఇది.
కంటేనే అమ్మ అంటే ఎలా అన్నట్లు పెంచిన ప్రేమ గొప్పదనాన్నీ అనుబంధాలు ఆత్మీయులు పెనవేసుకునేది అవసరాల మూలకంగా కావనీ పిల్లలమీద ప్రేమ వారికి అర్థమయ్యేలా పెద్దలు వర్తించాలనీ తెలియజేసే కథ ‘బెస్ట్‌ఫ్రెండ్’. ‘మలగని దీపాలు’ అనే కథ తలసీమియా వ్యాధి గురించిన సంఘటనల సమహారంతో సాగుతుంది. ప్రభు, రాశి తలసీమియా కారియర్లం అని గ్రహించి పిల్లలు వద్దనుకుని ఏ పాపనైనా పెంచుకోవాలని నిర్ణయం తీసుకుని వివాహమాడటం ఈ కథలోని విశేషం.
‘్ధర్మోరక్షతి రక్షితః’ కథ క్రిమినల్ బ్రెయిన్ మగవారికే కాక ఆడవారికీ వుండవచ్చని నిరూపించే కథ. డొమెస్టిక్ వయొలెన్స్ కేసు మగవారు కూడా పెట్టవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శౌరిని రక్షించిన అనుపమ చర్య గుర్తుచేసింది. ‘బంటీ -బనానా’ కథ స్మార్ట్ఫోన్‌వల్ల వచ్చే ఇబ్బందులను తెలియచెప్పేవిగా వుంది. ‘బనానా’ పోయి ‘జావే’ స్మార్ట్ఫోన్ వచ్చినా బ్రతుకులు ‘సజావే’ అని విశ్వసించలేమనిపిస్తుంది. కథా సంపుటి పేరిట ‘పూలమనసులు’ కథలో, పేదరికం గుణానిది కాదనీ, పొరపాటు ఎవరివల్లనయినా జరగవచ్చనీ, మోసం చేయడం పేద వైఖరి అనుకోవడం దోషం అనీ తెలియచెబుతారు. ‘ఈ దినం వుండి రేపటికి వాడిపోయి చెత్త కుప్పలో ఇసిరేసే పూలతాన తమర్ని మోసం చేస్తే నా కళ్ళు పోవా అమ్మ’ అన్న యాదమ్మ మాటలు ఉద్యోగిని కళ్ళు తెరిపించినవైనం ఈ కథలో ఆర్ద్రంగా చిత్రించారు రచయిత్రి. ‘దేశమాత చల్లని ఒడి’ బ్రెయిన్ డ్రెయిన్ గురించి నిజంగా ఆలోచింపజేసే కథ.
‘పూలమనసులు’ కథా సంపుటిలోని కథానికలు పఠితలకు చదివిన తరువాత కూడా అనుభూతి పరీమళం నిలుపగల రచయిత్రి ఆలోచనాత్మక రచనా ప్రతీకలు.

-సుధామ