పఠనీయం

అలతి పదాలతో ఆలోచనాత్మక భావాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు:161, వెల:రూ.150/-
ప్రతులకు:స్వాప్నిక్ పబ్లికేషన్స్, సృజన్ పిల్లల దవాఖాన, పాత బస్టాండ్, సిరిసిల్ల-505301,
రాజన్న సిరిసిల్ల జిల్లా.. 9866160378
=======================================================
బాలసాహితీవేత్తగా సాహితీ లోకానికి పరిచయమున్న కవయిత్రి డా. కందేపి రాణీప్రసాద్ ‘హౌజ్‌వైఫ్’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించి.. తమ భావాలను పాఠకులతో పంచుకున్నారు. అవీ, ఇవీ, అన్నీ అన్న చందంలా.. ఇందులోని కవితా వస్తువులున్నాయి. సంక్లిష్టతకు తావివ్వకుండా... సరళంగా, సూటిగా...అలతి అలతి పదాలతో కవయిత్రి తమ భావాలకు అక్షరాకృతినిచ్చారు. ఈ గ్రంథంలోని తొంబది ఆరు కవితలు కవయిత్రి యొక్క సామాజిక చింతనకు అద్దం పట్టే విధంగా కొలువుదీరాయి.. అయితే కొన్ని కవితలకు వస్తు విశే్లషణతో పాటు కవిత్వాంశకు ప్రాధాన్యత అనుకున్నంత ఇవ్వకపోయినప్పటికీ.. కవయిత్రి యొక్క లోక పరిశీలనను అభినందించి తీరుతాము.. కొన్ని కవితలు చక్కని సందేశాలను మోసుకొచ్చాయి మరికొన్ని కవితలు ఆలోచనాత్మకంగా మలచబడ్డాయి. కవితల్లో వచనం డామినేట్ చేసినప్పటికీ.. కవయిత్రి యొక్క ఉత్తమ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.
‘‘ఆమె తపనంతా / తన వాళ్లకోసమే / తన కుటుంబం కోసమే’’ అంటూ హౌజ్‌వైఫ్ శీర్షికతో రాసిన మొదటి కవితలో గృహిణిని చిత్రించారు.
వైద్యం, చికిత్స సంబంధ పదబంధాలతో ‘్ఫస్ట్‌ఎయిడ్ బాక్స్’ కవితకు రూపునిచ్చారు.. అందరివాడుగా భాసిల్లే డాక్టరును ఈ కవిత ద్వారా గొప్పగా మనముందు నిలిపారు.
‘గ్రీన్‌హౌస్’ కవితలో కవయిత్రి ప్రయోగించిన పదబంధాలు, ప్రతీకలు బాగున్నాయి. ‘నీలి కొండలు /వైట్‌డ్రెస్ విప్పేసి /గ్రీన్ యూనిఫాంలోకి మారిపోయాయి స్కూల్ పిల్లల్లా’ అంటూ ఈ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. ‘బస్సు ఆత్మ’ కవితలో బస్సు యొక్క అంతర్వేదనను అక్షరాల్లో ఆవిష్కరించారు.
‘అమెరికా.. ఓ అమెరికా’ కవితలోని భావాలు ఆలోచానత్మకంగా ఉన్నాయి. అమెరికా నీకు నమస్కారం.. మనిషిని ఎలా వంచాలో తెలుసు నీకు.. ఎలా పుట్టి ముంచాలో తెలుసు నీకు అంటూ చక్కని ముగింపునిచ్చాడు.
‘దాగుడుమూతలు’ కవితలో అమ్మ ప్రేమను చిత్రించిన తీరు బాగుంది. మరో కవిత ద్వారా.. అమ్మంటే మమతల కోవెల.. వెనె్నల ఊయల అంటూ అమ్మను ఉన్నతంగా ఆవిష్కరించారు.
‘్ధ్యనం’ కవితలో మన ఆరోగ్యానికి పనికివచ్చే చిట్కాల చిట్టా విప్పారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ కవితలో కూడా ఆరోగ్య సూత్రాలను వల్లె వేశారు. ‘మా ఊరి చెరువు’ కవితను మా ఊరి అందాల చెరువు.. తీర్చును మంచినీళ్ళ కరువు అంటూ ప్రారంభించారు. ‘కేరింత -తుళ్లింత’ కవితను చమత్కారంగా రూపుదిద్దారు. మరో కవితలో అబ్దుల్ కలామ్‌కు సలామ్ సమర్పించారు.
‘ఈ ప్రశ్నకు బదులెవరిస్తారు’ కవితలో కవయిత్రి తెలుగు భాష నిరాదరణకు గురవడంపట్ల తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఆంగ్ల భాష పట్ల జనంలో పెరుగుతున్న వ్యామోహంపై తమ కలాన్ని సంధించారు. అయితే కవయిత్రిగారే స్వయంగా ఆంగ్ల భాషకు అతుక్కుపోయిన దాఖలాలు.. ఈ గ్రంథంలో కవితల శీర్షికల్లో ఆంగ్ల పదాలు పుష్కలంగా దర్శనమివ్వడం గమనార్హం.
భళారే! సినారే! అంటూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి.నారాయణరెడ్డికి అక్షరాంజలి ఘటించారు. పైవాటితోపాటు సంక్రాంతి సకినప్ప, పంచభూతాలు, హస్తకళాకారుడు వంటి కవితలు కూడా ఈ గ్రంథంలో చోటు కల్పించారు. ఇలా ఈగ్రంథంలోని కవితలు చాలావరకు సాదాసీదాగా రూపుదిద్దుకున్నప్పటికీ.. కావలసినంత సమాచారాన్ని మోసుకొచ్చాయి. ‘గ్రంథం’ పేరు నుండి కవితల శీర్షికల దాకా.. కవిత్వంలోని మొదటి పంక్తి నుండి చివరి పంక్తి దాకా ఆంగ్ల పదాలపై కవయిత్రిగారికి వున్న మక్కువను చూస్తాము.. కొన్ని కవితలు మినీ వ్యాసాలుగా కనిపించినప్పటికీ.. కవయిత్రి వస్తు విశే్లషణ ఇచ్చిన ప్రాధాన్యతను ప్రశంసిస్తాము.

-దాస్యం సేనాధిపతి 9440525544