పఠనీయం

అమెరికా అనుభవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాణం-
అనువాద నవల మరికొన్ని అమెరికా కథలు-
రచన స్వేచ్ఛానువాదం:బాలి, వెల:రూ.175/-
ప్రతులకు:నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్, ఫోన్:8639338675

తెలుగు కథ /నవలా సాహిత్యానికి బాలి (యం.శంకరరావు)గారు చిత్రకారుడిగా చిరపరిచితులు. అప్పుడప్పుడు తన కథలతో పాఠకలోకాన్ని అలరిస్తుంటారు. బొమ్మల్లో ఎంత ‘క్లారిటీ’ చూపగలరో, అంతే క్లారిటీ తన రచనల్లోనూ చూపగలగటం బాలి ప్రత్యేకత.
ప్రస్తుత సంకలనంలో ఒక స్వేచ్ఛానువాద నవల, 19 తన అమెరికా అనుభవాలు, ఒక వారణాసి అనుభవం పొందుపరిచారు. ఉక్రెయిన్ (రష్యా) ప్రాతపు ‘ఇద్దిష్’ భాషలో రాయబడిన రాఛెల్ కలోఫ్ అను యూదు యువతి ఆత్మకథ ఇది. లోగడ ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికగా వచ్చింది.
రాఛెల్ కలోప్ 1880 ప్రాంతంలో అతి పేద కుటుంబంలో జన్మిస్తుంది. చిన్నతనానే తల్లి మరణిస్తుంది. తండ్రి, మారుటి తల్లి తనను, తన అక్క, అన్న, తమ్ముళ్ళను ఆరళ్ళు పెడుతుంటారు. బ్రతుకుదెరువుకై తండ్రి అమెరికా వెళుతుంటాడు. ఆ తరువాత ఆయన అతీపతీ తెలియదు. రాఛెల్, ఆమె సోదరి సోదరులు కటిక దరిద్రంవల్ల ఎవరికివారు వేరై తలా ఓ పంచన చేరుతారు. రాఛెల్‌కు యుక్తవయసు వస్తుంది. దూరపు బంధువు సాయంతో అబ్రహాం అనే అమెరికా యూదు వద్దకు చేరి అతనికి భార్య అవుతుంది. ఆ కాలంలో తన వేల ఎకరాల భూముల్ని సాగు చేయలేక ఇతర దేశస్థుల్ని ఆహ్వానించుతూండేది. అలా వెళ్లిన వాళ్ళే అబ్రహం తల్లిదండ్రులు.
అబ్రహం రాఛెల్ దంపతులు స్వయంశక్తితో అంచెలంచెలుగా ఎదిగి చివరకు 360 ఎకరాలకు స్వంతదారులు అవుతారు. గార్హస్థ్య ప్రయాణంలో రాఛెల్ తొమ్మిదిగురు బిడ్డలకు జన్మనిచ్చినా చివరకు ఇద్దరు మిగులుతారు. ఆ కాలంలో యూదులకు ఎంత ఎక్కువమంది సంతానం ఉంటే అంతటి గౌరవం ఉండేది. కాలక్రమేణా అబ్రహం నార్త్ డకోటా ప్రాంతంలో స్థిరపడి తనవారికి గొప్ప పౌర సౌకర్యాలు, స్కూళ్ళు కల్పించి గౌరవనీయుడవుతాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో స్థిరపడ్డ రాఛెల్ ప్రయాణం తన 76వ ఏట తన కొడుకు చేతుల్లో ముగుస్తుంది.
ఎక్కడా అనువాదం అనిపించకుండా తెనిగించిన ఈ నవల, పట్టుదల, దృఢ సంకల్పం, మొక్కవోని ధైర్యంవుంటే ఎంతటి కష్టాలనైనా అధిగమించవచ్చునని నిరూపిస్తుంది. ఆర్యుల పుట్టు పూర్వోత్తరాలతో మొదలై అమెరికా జీవన స్రవంతిలో ఈ యూదు దంపతులు వారి కుటుంబం మమేకమవటం, నార్త్ డకోటా ప్రాంతంలో ప్రముఖ పౌరులవటం, రాఛెల్ కొడుకు జాకబ్ తుది పలుకులతో ముగుస్తుంది.
పై అనువాద నవలతో బాటు తన అమెరికా అనుభవాలు వివరించిన తీరు శైలీశిల్పం ఆకట్టుకుంటుంది. ఆరుకోట్లమంది యూదుల్ని ఊచకోత కోసిన హిట్లర్ (1889-1945) ఆర్యుడనటం (పే.128), మనం పూలదండల్లో వాడే మరువం అక్కడి ఫ్లేవరింగ్ ఏజెంట్‌గా రచయితకు ఎదురుపడటం దిష్టిబొమ్మల, బ్రిడ్జివాటర్ వేంకటేశ్వర దేవాలయంలో తాను ఏదో సందర్భంలో గీచిన పెళ్లి సందర్భపు చిత్రాలను చూశాక కలిగిన ఆనందం, ఆశ్చర్యం, అక్కడ తాను సందర్శించిన గేలరీ, భూతలస్వర్గం అని అనుకునే అమెరికాలో భూతలస్వర్గం అనిపించే సంఘటనలు , అక్కడ పెంపుడు జంతువుల పెంపకం, కుక్కకోసం ఇద్దరు భర్తల్ని వదిలేసిన వైనం, మానవత్వం పరిమళించే మెక్సికన్ పెడో గాడి కథ, ఆత్మలతో మాట్లాడగలిగి మనోనేత్రం గల హంగేరియన్ దెబ్రా, ఇండియన్స్ నమ్ముతున్నట్లు, వారు చేసే దానాలు, పూజలు, పొగలు, 45 ఏళ్ళు దాటినా బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌ల కోసం వెదుకులాట విశదంగా ఇవ్వబడ్డాయి.
గీతల్లోకాదు రాతలతో కూడా బొమ్మలేయగలిగిన నేర్పు- ‘ఒక కుండలో రంగు రంగుల చుక్కలు వేసి కలిపితే మొత్తం ఏదో రంగయినట్లు అమెరికా అంతా కలుస్తోంది’ (పే.176), ‘రవంత బుగ్గల కళ్ళ ఎక్స్‌ప్రెషనూ, మరికొంచెం భుజాల ఎక్స్‌ప్రెషన్ (పే.171)-ఈయనా ఆ తానుని ముక్కే కదా! అనిపిస్తుంది.్భషా సారళ్యత, పదాల ఎంపికలో నర్మగర్భితమైన హాస్యం, మన ఎన్‌ఆర్‌ఐలకే తెలియని అంతుపట్టని అమెరికా ఆంతర్యం, బాగా వివరింపబడిన బాలి గారి ‘ప్రయాణం’లో మనమూ వెంట నడిచి మమేకమవుతాము.