పఠనీయం

సమస్యను రగిలిస్తే ఎవరికి లాభం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాలిటీ ఆఫ్ డిసెంబరు 6- మదీనా ఎడ్యుకేషన్ వెల్‌ఫేర్ సొసైటీ
వెల: రూ.40/-
హైదరాబాదు ప్రచురణ-
హిస్టరీ ఆఫ్ ది బాబరీ మసీద్ ఆలిగఢ్ హిస్టారికల్ సొసైటీ ప్రచురణ
===================================================================
సుప్రీంకోర్టు ‘‘అయోధ్య వివాదంపై అనుదిన విచారణ’’ను అక్టోబరు 2018లో జనవరి 2019కి వాయిదావేసింది. దీనిపై ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానాలు చేశారు. అయోధ్య సమస్య రావణకాష్టంలా రగిలిస్తే ఏ రాజకీయ పార్టీకి లాభం? అనే చర్చ కూడా మొదలయింది.
అయోధ్య వివాదం దాదాపు శతాబ్దాలుగా సాగుతున్నది. ఇందలి ప్రధానాంశం ఏమిటంటే సమర్‌ఖండ్ నుండి వచ్చిన మొగలారుూ రాజ్య స్థాపకుడు బాబర్ అయోధ్యలో ఉన్న రామాలయాన్ని కూల్చివేసి అక్కడి ధన సంపత్తిని దోచుకొని దానినొక మసీదుగా మార్చాడు. అలాగే తర్వాత వచ్చిన మొగలు పాలకులు మధురలో కృష్ణాలయాన్ని, వారణాసిలో విశే్వశ్వర దేవాలయాన్ని కూల్చివేశారు. ఇది ఔరంగజేబు కాలంలో జరిగింది. ఈ చరిత్రకాంశాలను ఇవ్వాళ ఎవరూ మార్చలేదు.
గజినీ మహమ్మదు సోమనాథ దేవాలయాన్ని 17సార్లు దోచుకొని ధ్వంసం చేస్తే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్- కె.యం.మున్షీ వంటి వారు ఒక కమిటీని ఏర్పరచి సోమనాథ దేవాలయ పునర్నిర్మాణం చేశారు. అప్పుడే ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించింది మరెవరో కాదు సాక్షాత్తు పండిత్ జవహర్‌లాల్ నెహ్రూగారే. 1990వ దశకంలో అయోధ్య వివాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడి బాబర్ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఆ సమయంలో కేంద్రంలో పి.వి.నరసింహారావుగారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పటినుండి అల్లర్లు ఆందోళనలూ కోర్టు కేసులూ నడుస్తూనే ఉన్నాయి. కొంతకాలం క్రింత హైదరాబాదులోని మదీనా సొసైటీ పక్షాన ‘బాబ్రీమసీదు’ సమస్యపై ఒక సెమినార్ నిర్వహింపబడింది. అందులో ఆనాటి జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన ప్రసంగం చేశారు. ఇది జరిగి దాదాపు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది. ఐనా ఆ సొసైటీవారు స్వామి ప్రసంగాన్ని ఆంగ్లంలో ఒక చిన్న గ్రంథం (బుక్‌లెట్)గా ముద్రించారు. విచిత్రమేమంటే ప్రస్తుతం సుబ్రహ్మణ్యస్వామిగారు భారతీయ జనతాపార్టీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రసంగాలు సరిగ్గా ఈ పుస్తకంలోని భావాలకు విరుద్ధంగా ఉన్నాయి (డైమెట్రికల్లీ ఆపోజిట్) ఐనా కాలం తెచ్చిన పరిణామక్రమం అర్ధం చేసుకోవటానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ‘తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది’’ అని కవిత వ్రాసిన ఎర్రసిరాబుడ్డి గజ్జెల మల్లారెడ్డి తన హృదయం ప్రతి హేకానందుని యతి గీతం ఉంచుకొని కన్నుమూయటం ఒక సృష్టివైచిత్రి. ఇదుగో ఈ పుస్తకంలో అలాంటి విచిత్రమే మనకు కన్పిస్తుంది. ఇందులో సుబ్రహ్మణ్యస్వామి ఆర్‌ఎస్‌ఎస్ విహెచ్‌పి బిజెపిలను విమర్శించారు. అభాండాలు వేశారు. తమిళనాడులో వారు దాక్కున్నారని వ్యాఖ్యానించారు. 1942లో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. 1942లో సంఘ సంస్థాపకుడు కేశవరావు బలీరాం హెడ్గేవార్ స్వయంగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న సంగతి ఎందరికి తెలుసు?? ఐనా దేశవ్యతిరేక శక్తులు రాత్రింబవళ్లు హిందూత్వం మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. భారతదేశం 1947లో మత ప్రాతిపదికపై విడిపోయింది. ఐనా ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ నాయకులు ఎన్నికలలో మూకుమ్మడిగా ఓట్లు సంపాదించుకుంటున్నారు. ఈ సందర్భంగా మరో గ్రంథాన్ని మనం గమనించాలి. ఇది కూడా ఆంగ్ల గ్రంథమే. ఇందులో బాబ్రీమసీదు చరిత్రతోబాటు వివిధ న్యాయస్థానాలల్లో జరిగిన కేసులు తీర్పులు వా పర్యవసానాలు పరిశోధక విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్లు చెప్పడం జరిగింది.
2010 సెప్టెంబరు 30, నాడు అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచి రామజన్మభూమి వివాదంపై తన తీర్పును వెలువరించింది. ఎస్-యం.ఖాన్, సుధీర్ అగర్వాల్, హెచ్.పి.శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంటు ప్రధానంగా భూ వివాదం అనే కోణంలో చర్చింపబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి తీర్పు దానిపై వివిధ విశే్లషణలు ఒక సంక్షిప్త గ్రంథంగా వెలువరించారు. దీనిని ఆంగ్లంలో ఆలిగఢ్ హిస్టోరీయన్స్ సొసైటీ ప్రచురించింది.
2010 డిసెంబరులో మొదటిసారి వచ్చిన ఈ గ్రంథం మూడు ముద్రణలను పొందింది.
ఇందలి చర్చనీయాంశాలు ఏమిటి? బాబర్ స్వయంగా ఒక మసీదు నిర్మించాడా? లేక అంతకు పూర్వం ఒక దేవాలయం ఉంటే దానిని ధ్వంసం చేసి దానిపై మసీదు కట్టాడా? అనేది కార్చన్‌సెర్చి ద్వారా భూగర్భ శిథిలాలలోని అవశేషాల తేదీలను నిర్ణయించడానికి ప్రయత్నం జరిగింది.
ఇదే అసలు సమస్య!!

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్