పఠనీయం

వ్యక్తివికాసం శక్తిప్రదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పతంజలి యోగసూత్రాలు (ద్విభాషా వచన గ్రంథం)
రచయిత:చింతగుంట సుబ్బారావు
పుటలు :152 వెల : రూ.80/-లు
ప్రతులకు చింతగుంట సుబ్బారావు, 4-102, ILTD COLONY EXTN కొత్తపేట , పేరాల (పో) చీరాల - 523157
------------------------------------------------------------------------------------------------------------------------------
మనిషి మనుగడకు కావలసినవి నాలుగు విధాలైన బలాలు. అవి 1. శారీరక బలం,2. మానసిక బలం, 3. ఆర్థికబలం, పరిసర జనబలం (కుటుంబ స్నేహితులు, సంఘం) వీటిలో చివరివి రెండు ఆయా వైయక్తిక పరిస్థితులను బట్టి సంప్రాప్తమవుతాయి. కానీ మొదట రెండూ అంటే శారీరక, మానసిక బలాలు మనిషి తనయొక్క ప్రత్యేక శ్రద్ధ, అభ్యాసం, వాటి కొనసాగింపులను బట్టి సాధించుకోవచ్చు.
ఈ రెండురకాల బలాలను ఒకే ప్రయత్నంలో ఒకేసారిగా సాధించుకోవడానికి అవసరమైన సాధన సూత్రాలను యోగసూత్రాలు అంటారు. అలాంటి యోగ సూత్రాలను ఛాయామాత్రంగా వేథం చెప్తే పతంజలి మహర్షి విపులంగా చెప్పాడు. సుమారు రెండువేల సంవత్సరాల నాడు ఆ పతంజలి యోగ సూత్రాలను యథాతథంగా తెలుగు, దేవనాగర లిపులలో క్రోడీకరిస్తూ వాటికి వ్యాఖ్యాన పూర్వక సమగ్ర భావాన్ని ఆంగ్ల ఆంధ్రభాషలలో ఒక దానికింద ఒకటిగా సరళ భాషా సుందర వచనంలో అందించే పుస్తకం. ‘‘పతంజలి యోగసూత్రాలు’’.
ఇందులో యోగము - దాని లక్ష్యముల, 2. యోగము -సాదన, 3. యోగమూ -యోగసిద్ధులు, 4. యోగము- మోక్షము అని నాలుగు విభాగాలున్నాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 193 సూత్రాలున్నాయి.
ఏ సూత్రానికా సూత్రం (సూక్తి) సాధకుడు -లేక యోగాభ్యాసి ఏ మాత్రం ఏకాగ్రత చూపించినా ప్రతిదీ ఆచరణ యోగ్యమే. ఆచరణ సాధ్యమే. ముఖ్యంగా మానసిక సమతౌల్య సాధన, లక్ష్యసిద్దుల పరంగా
ఉదా: ‘‘శౌచ సంతోష తపస్స్వా ధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః’’
రెండవ అధ్యాయంలో 32 వ సూత్రం.
‘‘శౌచం( purity ) సంతోషం ( contentment) తపస్సు ( Penance or Austeriy) స్వాధ్యాయం, (Study ఈశ్వర ప్రణిధానం (Dedication to God) ఈ ఐదింటి సాధనను ఒక దీక్షతో అభ్యాసం చేస్తే అవి శీఘ్రంగా సత్ఫలితాన్నిస్తాయి. (సద్యః అప్పటి కప్పుడే) అయితే వీటి యొక్క ప్రాయోగిక అభ్యాసంలో స్వార్థ ప్రయోజనం ప్రేరణ కాకుండా చూసుకోవాలి. ఇంత సులభగ్రాహ్యంగా యోగం అంటే ఏమిటో (మానసిక కర్మపరంగా)పుస్తకం మొత్తం తనకు తానే జిజ్ఞాసువైన పాఠకుని ఎవరినైనా చదివిస్తూ పోతుంది. ఇది రచయిత సరళ రచనా నిపుణతకు తార్కాణం.
అంతఃకరణం చతుష్టయం అంటే చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారం, అనే నాలుగు అధిభౌతిక సాంకేతిక పదాలకు అర్థాలు మొదలైన విశేషాంశాలు కూడా ఈ పుస్తకంలో ప్రస్తావితాలయినాయి. సుబ్బారావుగారు చేసిన తేలికైన వివరణ ద్వారా అర్థ విపులీకరణ కోసం భర్తృహరి సూక్తుల ఆంధ్రానువాద పద్యాల వంటి వి కూడా ఉన్నాయి అక్కడక్కడ.
ఇది నేడు మార్కెట్లో కనిపిస్తున్న వ్యక్తిత్వ వికాసం personality development మొదలైన పుస్తకాలం కంటే విలువైన మార్గదర్శక గ్రంథం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290