పఠనీయం

ఆత్మ కథానుభూతి వ్యక్తీకరణలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షేక్స్‌స్పియర్ సానెట్స్ (భావగీతాలు)
-డా.కోడూరు ప్రభాకర్‌రెడ్డి
వెల: రూ.200
ప్రతులకు: 7/829, ఎస్.వి.ఎం.రోడ్ వై.ఎం.ఆర్. కాలనీ ప్రొద్దుటూరు -516 360

*** ***** ****

‘ది సానెట్స్’ అనేది ప్రధానంగా నాటక రచయితగా పేరుగాంచిన విలియం షేక్స్పియర్ కవితా గ్రంథం. సానెట్ అనేది పధ్నాలుగు పంక్తుల కవిత నాలుగు పంక్తుల చరణాలు రెండు, మూడు పంక్తుల చరణాలు రెండుగా రూపొందిన ఇటాలియన్ కవితా ప్రక్రియ ఇది. సర్ థామస్ వయట్ 16వ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లీష్‌లో తొలిసారి ఈ ప్రక్రియా రచన చేశాడంటారు. షేక్స్పియర్ 154 సానెట్స్ రాశాడు. తన జీవితంలోని ఒక ముఖ్యమైన మలుపు దశలో ఈ రచన ఆవిర్భావం జరిగింది అంటారు. విలియం హెర్బర్ట్ అనే పదిహేడేళ్ల అబ్బాయి కోసం ఆమె తల్లి మేరీ హెర్బర్ట్ అభ్యర్థనపై ఈ రచనకు తలపెట్టాడంటారు. అప్పటికే అనీ హ్యాతదే అనే తనకన్న ఎనిమిదేళ్లు పెద్దదయిన స్ర్తిని ప్రేమించి పెళ్లాడి హ్యామెనెట్ అనే కుమారుడిని, జోడియత్ సాడ్లర్ అనే అమ్మాయిని కవలలుగా కన్నతండ్రి అయ్యాడట! క్రీ.శ.1596లో హ్యామెన్‌ట్ మరణించాడు.
షేక్స్పియర్ రాసిన సానెట్స్‌లో ప్రణయ భావనలు మాత్రమేకాక, అందం శాశ్వతం కాదనీ, వైవాహిక ప్రేమబంధం, వంశాభివృద్ధి అవశ్యకాలనీ, అలాగే తనకు దూరమైన కుమారుని మరణంతోబాటు జీసస్ మరణాన్ని కూడా సూచించే వియోగ ఆధ్యాత్మిక భావనలు, అలాగే భావోద్రేకపు ఆత్మవిమర్శ రచనలు, భార్య దూరంగా ఉండటంతో ఒక నల్లపిల్ల శారీరక సంపర్కంతో ఆ ప్రియురాలి పట్ల ప్రేమావేశం, భార్యకిచ్చిన ప్రమాణాన్ని వమ్ముచేసి బైబిల్‌కు విరుద్ధంగా ఒక వివాహితతో కామకలాపాలు జరుపుతున్న మానసిక మాధ, తలబిరుసు ప్రియురాలు కలిగించిన ద్వేషం ఇటువంటి భావనలన్నీ షేక్స్పియర్ సానెట్లలో కవితాత్మకంగా గోచరమవుతాయి.
ఏమయినా షేక్స్పియర్ సానెట్లు ఎక్కువ భాగం ఆత్మ కథానుభూతి వ్యక్తీకరణలే! షేక్స్పియర్ సానెట్లలోని కవితా సౌందర్యాన్ని జాన్‌కీట్స్ వంటి కవులు సైతం ఎంతగానో ప్రశంసించారు. భారతదేశపు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథకు పైన షేక్స్పియర్ సానెట్స్‌లోంచే పంక్తులేరుకున్నారు.
జ్దీళశ ఆ్య ఆ్దళ ఒళఒఒజ్యశఒ యచి ఒతీళళఆ ఒజళశఆ ఆ్ద్యఖదఆ
ని ఒఖ్యౄౄశ ఖఔ ళౄళౄఇళూళశషళ యఛి ఆ్దజశఒ ఔ్ఘఒఆ.
1587 ఫ్రాంతంలో లండన్‌లో స్థిరపడిన షేక్స్పియర్ నాటకశాలల్లో పనిచేసి నటుడిగా, రచయితగా ఖ్యాతి గడించి తన నాటకాలతో ప్రముఖుడిగా ఎదిగి 1597 ప్రాంతంలో తన స్వగ్రామం ఏవన్‌లో ఇల్లు, పొలం ఏర్పాటు చేసుకుని భార్యాబిడ్డలతో శేష జీవితం గడపాలనే కోరికతో 1611లో లండన్ నగరాన్ని శాశ్వతంగా వదిలేశాడు. కానీ 1616లో పుట్టినరోజు నాడే అంటే ఏప్రిల్ 23నే యాభై రెండేళ్ల ప్రాయంలో తనువు చాలించాడు. షేక్స్పియర్ సానెట్లను డాక్టర్ కోడూరు ప్రభాకర్‌రెడ్డిగారు అన్నగారయిన పుల్లారెడ్డిగారి ప్రోత్సాహంతో తెలుగులోకి అనువదించారు. సానెట్స్ పధ్నాలుగు పంక్తుల కవితాభివ్యక్తులు కనుక అందుకు అనువాదంలో దోహదకారిగా ఉంటుందనే భావనతో కాబోలు సీస పద్య ఛందస్సును ఈ అనువాద రచనకు ఎన్నుకున్నారు. ఎనిమిది పాదాలు తేటగీతి నాలుగు పాదాలు కలిసి మొత్తం పనె్నండు పంక్తుల్లో పధ్నాలుగు పంక్తుల సానెట్స్‌ను భావ బంధురంగా అనువదించే కృషి చేశారు. ప్రతి పద్యానికీ సముచితమైన వ్యాఖ్యానాన్ని సంతరించడం ఒక విశేషం! అందువల్ల పాఠకులకు తెలుగు సీసపద్యం రూపెత్తిన షేక్స్పియర్ సానెట్ మూలభావన అందించే పూనిక నెరవేరింది. కవి కలల్లో ఓ యువకుడు కనిపిస్తూండటం, ఆతని గూర్చి కవి ప్రేమైక భావనలు చేయడం వీటిల్లోని ఒక విశేషం కూడాను. బహుశా దూరమైన తన కుమారుడో, మేరీ హెర్బర్ట్ కుమారుడో ఆ సానెట్స్‌కు ప్రేరణ అయి ఉండవచ్చు.
దూర తీరాల నీవుండ చేరలేక
ఇచటనే యుండి నీ కోసమెదురుచూతు
పరుగులిడబోని మేనితో ఫలితమేమి
శోకభరమున విడుచు అశ్రువులు తప్ప
అన్న రీతిగా ప్రభాకర్‌రెడ్డిగారి అనువాదం సరళసుందరంగా సాగింది.
‘వారి కామన తోడ పనియేమి నీకిప్డు - నీకు గల్గినదేదొ నీకునుండ - నీదు కాంక్షకు మించి నిన్నలరించెద - నది యెంత ఘనతయో నాకు తెలుసు’ వంటి సానెట్లలో నల్లదొరసాని పట్ల కవి కాంక్ష, ఆమె తననే కాక ఎందరినో ఆకర్షించి వశపరుచుకుంటున్నా వదులుకోలేని తన తమకం వంటి భావాలను అనువదించడంలో కవి ప్రాజ్ఞత కనబడుతుంది.
రస్కిన్ వంటి విమర్శకులతో ఒక బ్రహ్మ పదార్థంగా పాషాణపాకంగా భావింపబడిన షేక్స్పియర్ సానెట్స్‌ను కోడూరు ప్రభాకర్‌రెడ్డిగారు పఠనీయ భావగీతాలుగా అనువదించడం శేముషీ విశేషమే! వారికి అభినందనలు.

-సుధామ