పఠనీయం

మరువరాని మంచి మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్కృతి- మైలవరపు రామమూర్తి
ప్రాప్తిస్థానం: మైలవరపు రామలక్ష్మి,
శ్రీవిరించి వానప్రస్థాశ్రమం, శ్రీరామ్‌నగర్, రాజమహేంద్రవరం-5
==========================================================
‘మరువరాని మంచి మాటలు’ సంకలనం, అనువాదంతో మైలవరపు రామమూర్తి నేటి సమాజంలో నైతిక నిష్ఠ, సామాజిక స్పృహ, సేవాభావం, సర్వధర్మ సమభావన పెంపొందించే చిరు ప్రయత్నం చేశారు. చుట్టూ ఆవరించిన చీకటిని తిట్టుకొంటూ వుండటం కంటే కర్తవ్య జ్ఞాపికయైన చిరుపొత్తంగా, కరదీపికను వెలిగించటం రామమూర్తి వంటివారికే సాధ్యం. మంచి మాటలకు, విశ్వజనీన హితోక్తులకు ప్రాచుర్యం కల్పించటం రచయితకు ప్రీతికరమైన అనుభవం. ఈ పుస్తకంలో తెలుగు సూక్తులకు ఆంగ్లానువాదం, ఆంగ్ల సూక్తులకు తెలుగు అనువాదం కూడా అందించారు. కందుకూరి, చిలకమర్తి, టంగుటూరి వంటి మహనీయుల దివ్య స్మృతికి బహూకృతిగా వెలువరించిన ఈ చిరుకృతి, ఆంగ్లంతో ఏమాత్రం పరిచయం వున్నవారికైనా అర్థమయ్యే సరళత, అర్థస్పష్టత కలిగివుంది. సుమతీ, వేమన శతకాలలోని ఆణిముత్యాలైన 42 పద్యాలను ఎంపిక చేసి సులభగ్రాహ్యంగా ఆంగ్లీకరించారు. ఈ సంకలనంలో రమణమహర్షి, వివేకానంద, సాయి, తిరువళ్ళుర్, పెరియార్, క్రీస్తుప్రభువు, గాంధీజీ, సత్యసాయి, బుద్ధ, అంబేద్కర్, నార్ల, శ్రీశ్రీ, సినారె వంటి ప్రమఖుల ఉవాచలు, సందర్భానుసార సందేశాలు రెండు భాషలలో ఉన్నాయి. సుమారు 3వేలకుపైగా మానవతావాదిగా సమాజ సంక్షేమం, హితాన్ని అభిలషిస్తూ మైలవరపు రాసిన ఉత్తరాలు లేఖాస్త్ర వినూత్న ప్రక్రియగా, నేటికీ విశిష్టమైన గుర్తింపు పొందుతున్నాయి! ‘డియర్ ఎడిటర్’ (ఆంగ్లం, తెలుగు), ‘మై ప్రేయర్’ (ఆంగ్లం), ‘మంచియన్నది పెంచుమన్నా’, ‘శ్రీ సాయి ఉవాచ’, ‘శ్రీ సుభాషిత త్రివేణి’ వంటి రచనలతోపాటు మరువరాని మంచి మాటలు, మంచి సూక్తుల సత్కృతి సమాహారాన్ని అందించిన మైలవరపు రామమూర్తి అభినందనీయులు.
ఈ ప్రతిని అందుకొన్నవారు చదివినట్లు ఒక పోస్టు కార్డు ద్వారా తెల్పితే మూల్యం చెల్లించినట్లే అని పేర్కొనటం కొసమెరుపు.

-జయసూర్య సెల్- 9440664610