పఠనీయం

చదివి నేర్చుకోవాల్సిన నీతులెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర మహాభారతోపాఖ్యానము
రచన: శ్రీమతి డాక్టర్ ముదిగొండ ఉమాదేవి, ఎం.పిహెచ్‌డి
వెల: రూ.400/- ప్రతులకు
2-2-647-132, బి.సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ హైదఠాబాద్- 500013 ఫోన్: 040-27425668
లేదా నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్-
======================================================
సంస్కృతములో వేదవ్యాసుడు రచించిన పంచమ వేదము వివిధ భారతీయ ప్రపంచ భాషలలోనికి అనువదింపబడింది. తెలుగులో కవిత్రయము వారు గద్య పద్యాత్మకముగా రసవంతంగా తీర్చిదిద్దారు. మహాభారతములో కురుపాండవుల కథ ప్రధానమైనది. ఐతే సందర్భోచితంగా ఉదాహరణ ప్రాయంగా ఈ పద్ధెనిమిది పర్వాలలోను శతాధిక ఉపాఖ్యానములువస్తూ ఉంటాయి. ఇవి తెలుగులో ఇటీవల సరళ వచనంలో శ్రీమతి డాక్టర్ ముదిగొండ ఉమాదేవి రచించారు. దాదాపు ఆరు నెలలపాటు ఇవి ఆంధ్రభూమి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడి లక్షలాది పాఠకులు ఆనందింపజేశాయి. ఇప్పుడు ఈ కథలన్నీ ఒకే సంపుటంగా రావటం ముదావహం.
ఇది శ్రీమతి ఉమాదేవిగారి చిట్ట చివరి రచన లోగడ వారు ఉపనిషత్తులపైన శివ సహస్ర నామ లలితా సహస్ర నామములపై ఆంగ్ల ఆంధ్రములలో పెక్కు గ్రంథములు వెలువరించారు. శైవ సాహిత్యముపైన పాల్కురికి సోమనాథుని మీద విశేష కృషిచేశారు. శ్రీమతి ఉమాదేవిగారు చారిత్రక నవలా చక్రవర్తిగారి ధర్మపత్ని. హైదరాబాదులో సంస్కృత భాషలో లెక్చరర్‌గా పనిచేశారు. 72 సంవత్సరాలు సార్థక జీవనం సాగించి 2017 డిసెంబరులో పరమ పదించారు. ఈ మహాభారతోపాఖ్యానములలో నలదమయంతుల కథ సావిత్రి ఉపాఖ్యానము, షట్‌చక్రవర్తుల కథలు, కౌశికోపాఖ్యానము వంటి ఎన్నోసుప్రసిద్ధ కథలున్నాయి. అంతేకాక పంచతంత్ర కథలకు మూలమని చెప్పదగిన కొన్ని కథాంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇవి నీతి ప్రబోధకములు.
సౌపర్ణోపాఖ్యానములో వినుత- కద్రువలు పందెం వేసుకోవటం, సుపర్ణుని జననం మాతృదాస్య విముక్తికై గరుత్మంతుడు అమృత భాండం తీసుకొని రావటం వంటి అంశాలన్నీ సరళాతి సరళంగా వివరించారు. కథాకథన శిల్పంలో రచయిత్రి పండితులనే కాక హైస్కూలు కళాశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కథలు రచించినట్లు కన్పడుతున్నది. కథను చాలా విపులంగా నిదానంగా వర్ణనాత్మకంగా మూలాతి రిక్తం కాకుండా చెప్పటం ఇందలి విశేషం. శకుంతలోపాఖ్యానము అత్యంత రమణీయమైనది. దీనివలన మహాకవి కాళిదాసు ఆకర్షితుడై అభిజ్ఞాన శాకుంతలాన్ని నాటకంగా రచించటం మనకు తెలిసినదే. భరత వంశమునకు మూల పురుషుడైన శకుంతలా పుత్రుడు భరతుడు ఈ కథలో వర్ణింపబడ్డాడు. కౌశికోపాఖ్యానములో రజోగుణముగల భోన్మణుని కంటె ఆత్మజ్ఞానము కల ధర్మవ్యాధుడు గొప్పవాడనే నీతి ప్రతిపాదింపబడింది. ఏ కారణం చేతనో ఉదంకోపాఖ్యానము ఈ గ్రంథంలో చేర్చబడలేదు. ఆది పర్వమునుండి దాదాపు అనుశాసనిక పర్వమువరకు కథాప్రవాహం కన్పడుతూ ఉంది. అనారోగ్య కారణం వలన కావచ్చు.కొద్ది కథలు తప్ప తక్కినవన్నీ శ్రీమతి ఉమాదేవి రచించి కన్నుమూశారు. మహాభారతమును ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్తమ్రని వేదాంత విదులు వేదాంతమని నీతి విచక్షణులు నీతి శాస్తమ్రని కవి వృషభులు మహాకావ్యమని లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని కొనియాడారు. అందుకు కారణమేమిటో మూలకథతోబాటు ఈ ఉపాఖ్యానములు కూడా చదివితే అర్థమవుతుంది.ఎంతో శ్రమకోర్చి శ్రీమతి ఉమాదేవి ఈ గ్రంథాన్ని రచించి ధన్యజీవి మూర్థన్యజీవి అయినారు. దీనిని ధారావాహికంగా లోగడ ప్రచురించిన ఆంధ్రభూమి సంపాదకులు అభినందనీయులు. ఇప్పుడిది గ్రంథ రూపంలో వచ్చింది కాబట్టి తెలుగువారంతా పదిలపరచుకుంటారని ఆశిద్దాము.

- జొన్నభట్ల నరసింహప్రసాద్