పఠనీయం

ఇదొక కలగూర గంపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ రసాయనం
(కలగూరగంప రచనలు)
-డా.కోడూరు ప్రభాకరరెడ్డి
వెల: రూ.230
ప్రతులకు: రచయిత
7/829, ఎస్.వి.ఎం.రోడ్
వైఎంఆర్ కాలనీ
ప్రొద్దుటూరు -516360
*
ప్రాచీన సాహిత్యం చదవనవసరం లేదనే భావన ప్రబలంగా ఏర్పడుతున్న నేటి కాలాన - సంప్రదాయ సాహితీ సంపద వైభవ ప్రాభవాలను విశదపరుస్తూ, వృత్తిరీత్యా శిశువైద్య నిపుణులైన డా.కోడూరు ప్రభాకర్‌రెడ్డి ఆంధ్రాంగ్లాలు రెండింటి ప్రావీణ్యులు కావడం మాత్రమే కాక, మన పురాణ కావ్యేతిహాసాలను అవలోఢనం చేసినవారై సాహితీ గగనాన మెరిసే నక్షత్రచ్ఛటల వంటి ఇరవై ఏడు రచనలు ‘సాహితీ రసాయనం’ గ్రంథంగా అందించారు. హృద్యమైన వద్యవిద్యాభిమాని, కవి కావడం వలన ప్రభాకరరెడ్డిగారు చాటు కవితా రసరేఖా తోరణం మొదలు గంజాయి వనంలో తులసి మొక్క - వరకూ ఈ సప్తవింశతి రచనల్లో ప్రధానంగా పద్యకావ్యాల విమర్శను పఠనీయంగా అందించారు.
ఇది ఒక కలగూర గంపయే! కవి జీవిత చిత్రణలు చారిత్రక గాథాంశాలు, వివిధాంశాల వ్యాసాలు మాత్రమే కాక ఒక నాటికను కూడా తన సాహిత్య సృజనగా ఇందులో గ్రంథస్థం చేశారు. ఇందులోని కొన్ని రచనలు మిసిమి, రసమయి, భావవీణ వంటి పత్రికలలో మునుపు వెలుగు చూసినవే! కుంతీసుత మధ్యముడు అన్న ప్రయోగంలో మధ్యముడు అంటే మూడవవాడని అర్థం తీసుకోవాలి అనీ, అది అర్జునుడే అనీ ఒక వ్యాసంలో వివరించారు. పుట్టపర్తి వారి ‘చాటు’ప్రియత్వం, అపర పోతన కాసుల పురుషోత్తమ కవి వంటి రచనలు జయదేవుడు, ఉమర్‌ఖయ్యామ్, సినారె వంటి వారిపై రాసిన వ్యాసాలు వైవిధ్య సంభరితంగా ఉన్నాయి. అమ్మ, తిరుపతి ప్రాశస్త్యం, శిఖిపింఛవౌళి వంటి స్వీయ పద్య రచనా ఖండికలూ ఈ సాహితీ రసాయనంలో వున్నాయి. ఎత్తిపోతల రచనలు కాక రసానుభూతి ఎడదనెత్తి చేసిన రచనలు ఇవన్నీను. అందువల్ల ఈ రసాయనం సహృదయ పాఠక సేవనీయం. ప్రశంసనీయం.

-సుధామ