పఠనీయం

సందర్భోచిత వ్యాఖ్యలతో రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్రామాయణము
రచన: చావలి ఆంజనేయ మూర్తి పుటలు:250, వెల:రూ.200/-
ప్రతులకు: చావలి ఆంజనేయ మూర్తి, 2వ అంతస్తు, సూర్య ఎన్‌క్లేవ్, రామాలయం ఎదుట, విశాలాక్షినగర్,
విశాఖపట్నం-530040, సెల్:9441170455.
======================================================
వాల్మీకి రచించిన రామాయణము ననుసరించి 9 భాగములుగా రచయిత ఆంజనేయమూర్తి ఈ గ్రంథాన్ని రచించాడు. రామాయణ ప్రవచనం కాని, పారాయణ కాని 9 రోజులలో పూర్తిచేయాలని లోకంలో సంప్రదాయం. దాన్ని ప్రచారం చేయటానికి ఈ గ్రంథం రచించబడినట్లుగా ఉన్నది. ఏ విధంగా చూసినా ఈ గ్రంథం ప్రవచన యోగ్యమూ కాదు. పారాయణ యోగ్యమూ కాదు అని మా బోటి సంప్రదాయపరులకు అభిప్రాయం కలుగుతుంది. రామాయణము ఆరు కాండలే.
అలాగే వ్రాస్తే బాగుండేదేమో. రాముడు లలితా స్వరూపుడు. ఆమె సంఖ్య 9. అందుకే రామునికి ‘నవమికి’ అవినాభావ సంబంధం కలదు (జన్మ తిథిని, కల్యాణమును నవమినాడే చేస్తాము). ఆరు కాండలు షట్చక్రాలకు ప్రతీక.
రచయిత కథ చెపుతూ అక్కడక్కడ వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను ఉదహరించారు. దానికి మొల్ల, భాస్కర రామాయణం, విశ్వనాథ కల్పవృక్షంలోని పద్యాలను ఆయా సందర్భాలలో వారు ఎలా వర్ణించారో పాద సూచికలలో వివరించారు. కొన్ని పద్యాలు కల్పవృక్షంలోనివి చూస్తే జనం మెచ్చుకునే కల్పవృక్షంలో భావాలు ఇలా ఉన్నాయా అనే అల్ప దృష్టి కలుగుతుంది.
అయితే కొన్ని విషయాలను రచయిత విపులీకరించిన పద్ధతి సమన్వయము బాగానే ఉన్నది. ఉపవాసం గురించి (పుట 43), 14 సంవత్సరాల వనవాసాన్ని వాల్మీకి ‘చతుర్దశ’ అనకుండా నవపంచవర్షాణి (పుట 56), భుక్తశేషము (పుట 63), నాస్తికులు పురాణేతిహాసాలను వక్రించి చెప్పటం (పు 78), జాబాలి నాస్తికవాదము (పుట 81), సీతాపహరణ ముహూర్తము ‘విందము’ అంటూ అది రావణుని మరణ ముహూర్తము (పుట 111), వాల్మీకి చెప్పిన సనాతన ధర్మం (పుట 147), హనుమంతుని సందేహం (పుట 158), ఆత్మహత్యలు పనికిరావు‘జీవన్ భద్రాణి పశ్యతి’ (పుట 158), భ్రమ ఆనందాన్నిస్తుంది,
సత్యం యధార్థ స్థితిని వివరిస్తుంది అని చెపుతూనే సీతానే్వషణలో మండోదరిని చూచిన హనుమ ఆమెయే సీత అని గంతులువేస్తాడు. అశోకవనంలో సీతను చూచిన దానికి భేదం చెప్పారు (పుట 159), రామాయణ శ్లోకాలకు సంఖ్య ఇస్తే బాగుండేది.
ఇలా చాలా విషయాలు పాఠకులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. రామ శబ్దం (నామం) మధురమైంది. రాముని గురించి ఏ గ్రంథమైనా పఠనీయమే.
రామ నింద చేసే గ్రంథాలు కూడా అటువంటివే. వాళ్ళు రామ నామ స్మరణ చేస్తున్నారు కాబట్టి అనుకోవాలి. రామనామం భక్తులను రమింపజేస్తుంది. పరవశం కలిగిస్తుంది. అందువలన ఈ గ్రంథం పఠనీయమే.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649