పఠనీయం

మట్టిలో మాణిక్యాలని వెలికి తీసిన ‘‘శ్రీకారం’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్తి గొప్పదా కలం గొప్పదా? అనే ప్రశ్న చిన్నదే కానీ సమాదానమే పెద్దది. చీకటి రాజ్యాలని కత్తి బలం తో లొంగదీసుకోవచ్చు. అది అయినా ఎంత వరకు? ప్రశ్నించడం మొదలు పెట్టనంతవరకే. ఒక్కసారి ప్రశ్నించటం మొదలు పెట్టితే అన్యాయం తలవంచుకోవాల్సిందే. కత్తి రక్తం చిందించి జీవితాల్ని కూల్చేస్తే .. కలం ఆ జీవితాలకు అండగా నిలబడుతుంది.
జీవితాలు బాగుండాలనే చైతన్యాన్ని మోసుకొస్తూ శ్రీకారం చుడుతున్నారు శ్రీ వజ్రనాభ మహర్షి. స్వతహాగా సినిమా దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ అయినప్పటికీ సాహిత్యంపై మక్కువ తో సామాజిక మాధ్యమం లో క్రియేటివ్ ప్లానెట్ అనే వాట్స్ అప్ గ్రూప్‌ని స్థాపించి అందులోని వర్దమాన కవులతో కవిత్వం రాయించి పుస్తకరూపంలో ప్రధమంగా ‘‘శ్రీకారం’’ కవితా సంపుటిని మన ముందుంచారు.ఇందులోని కవితలు మనిషి జీవితంలో సకల భావోద్వేగాలకు ప్రతీకలు. ప్రతీ కవిత జీవితంలోఅన్ని కోణాలని స్పృశిస్తాయి. నిన్నటి తరం గొప్పకవి వైతాళికుడు, కథకుడు, నవలాకారుడు అయిన శ్రీకొనకంచి లక్ష్మీ నరసింహ గారి స్మృతి కవిత్వాని తలుచుకోవడం బాధ్యతనే కాదు కర్తవ్యం కూడా ‘‘సముద్రాలకి అవతల నువ్వు ఇవతల నేను’’ అన్న కవితలో రెక్కలొచ్చిన పిల్ల పక్షులు దేశం వదిలి కన్నవాళ్లని ఒంటరి చేసి పోతే తల్లిదండ్రులు పడే ముసలితనంలో పడే బాధ ఈ కవిత. ‘‘ఆకాశం చేతిలోమొహాన్ని దాచుకొని రోదిస్తున్న మనిషిని ప్రేమిస్తున్న మట్టిని’’ అంటూ ఉద్యమం కోసం అసువులు బాసిన అమరవీరుల వౌన ఘోష వినిపిస్తారు ‘‘మట్టిరోదిస్తుంది’’అన్న కవితలో. ‘కీర్తికండూతి’ లో ఆవగింజంత ప్రయాసతో పర్వతమంత కీర్తిని ఆశించే కండూతి లోలులు లోకంలో కోకొల్లలు. అలాగే ఇతరుల కష్టాన్ని తమవిగా చెప్పే ధూర్తులు కూడా ఉంటారు జాగ్రత్తసుమీ అని హెచ్చరిస్తారు కూడా.. ఇతరుల కష్టాన్ని ఇష్టంగా భుజించే ధూర్తులు రాజ్యమేలుతున్న కాలమిది..దారుణమో కదా అని ఈకవితలో నిజాల్ని బయటపెడ్తారు.
జీవితం ఒక ప్రయాణం .. సాగిపోతూనే ఉండాలి అన్నదమ్ములా కలసి ఉండే తోటివాడు రైలులో బాంబులు ఎలా పెట్టగలిగాడు భాయి భాయి అనుకొనే సహృదయత ఒక్కసారిగా ఎందుకు విద్వేషంగా మారిపోయింది. ప్రశ్నలు అనేకం. సమాధానం మాత్రం శూన్యమే. కల లోనే ఇంత విద్వేషాన్ని చూస్తే నిజంగాజరిగితే వణుకు పుడుతుంది కదా ‘‘ఓక రైలుప్రయాణం’’ లో ఈ కవి చివరకి బాధపడుతాడు.
చివరకు మిగేలిది అన్న కవితలో పంచభూతాత్మకం అయినా ప్రకృతికి మనిషి చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు ..బొగ్గు గనుల పేరుతో తవ్వుకుంటూ పోతే చివరకు మిగిలేది ఏమిటి ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి వాడు అయినా మట్టి కరవాల్సిందే కదా. గౌరీ వందన తన ప్రకృతి ప్రకోపం లో ఇదే విషయాన్ని చక్కగా వివరించారు. భూమాతకి వాతపెట్టి బొగ్గుల్ని సానపట్టి ఎర్రటి కుంపట్లో ఎన్నాళ్లు ఉంటానో అని బాధపడుతూ ఒక హెచ్చరిక ని కూడా జారీ చేస్తుంది. కరువయ్యే కర్ర నీ పాడే కట్టడానికి జనం ఎవరు ఉండరు .. నిజమే సైనికుడు / రైతు ఇద్దరూ దేశానికి కావాల్సిన వాళ్లే. మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక సుఖం వెనుక వాళ్ల త్యాగాలు ఉన్నాయి. కష్టాలున్నాయి. వాటిని తేల్చుకోవడం మన బాధ్యత అందుకే ‘నిన్ను తల్చుకున్నప్పుడల్లా నా దేహం అవమాన భారంతో అల్లాడుతోంది’’ నువ్వు చేసిన త్యాగఫలాన్ని మేము సంతోషంగా సుఖంగా అనుభవించుతూ నిన్ను మర్చిపోతున్నాము. అని బాధప డుతారు కవి సుబ్బారావు తన ‘‘మంచు దుప్పటికప్పుకొని’’ అన్న కవితలో.
కవి, రవి ఒక్కరే . రవి లోకాల్ని వెలుగుతోనింపాలని బయలుదేరితే కవి మాత్రం లోంలో జనాలకి చైతన్య దీపాలని వెలిగించడానికిబయలుదేరుతాడు. అందుకే కవిత్వం అంత సులువైనది ఏమీ కాదు. ‘‘ఓ గుప్పెడు అక్షరాలకై’’ తానూ అనే్వషణ మొదలు పెట్టానని మామూలు వ్యక్తుల్లో సమాజంలో కవిత్వాన్ని వెతుక్కునే జోగారావు శ్రమ ఎప్పటికైనా ఫలించాలి. ‘‘దృశ్యం చలింపచేసిన క్షణం కవిత రాయాలనిపిస్తుంది’’ కానీ అంతలోనే జారిపడిపోయిన భావాలు...
దుఃఖపు వేదనని భరించడం ఎవరికైనా కష్టమైన పనే. అయినా జీవితపు దుఃఖ నౌక వదిలించుకోలేని వస్తువే. అదేవిషయాన్న తగుళ్ల గోపాల్ తన దుఃఖ గీతంలో వినిపిస్తాడు. జీవితమన్నాక దుఃఖం ఉంటుంది. దుఃఖాన్ని మోస్తూ తిరగడమే జీవితం. ఎంత గొప్ప తాత్వికతనో కదా ఇదే కవిత చివర్లో మంచి ముగింపు ఇచ్చాడు. కనపడని దుఃఖాన్ని కడుపులో దాచుకొని నీ గుండె భాషని వినే వాళ్ల ముందు దుఃఖ గంపను దించుకోవాలి. ’’ నిజమే దుఃఖపు బరువుని చెప్పుకుంటేనే కాస్త ఉపశమనం కదా అనిపిస్తుంది దుఃఖ గీతం చదివినపుడు.
బడుగువర్గాల ఆశాజీవి మహ్మాత్మా పూలే ఈ రోజు బహుజనులు నోటికి అన్నం అందడానికి కారణం వారే అలాంటి గొప్ప పోరాటయోధుడిని తల్చుకుంటూ రాసిన మహాత్ములు పూలే లో గొప్ప స్ఫూర్తిదాయక అక్షరాల్ని అందించారు నర్సయ్యగారు. వర్ణ్ధర్మాన్ని వ్యతిరేకించిన సమసమాజస్థాపకులు బడుగు సాధికారత రథ సారథి సర్వస్వతీ పుత్రులు మహాత్ములు అంటూ గుర్తుచేస్తారు. స్వప్నాలు అందరూ కంటారు. కాని కొందరు మాత్రమే నిజం చేసుకొంటారు చిగురించే ఓ స్వప్నం కోసం లో రాంబాబు గారు తపిస్తారు.
ఇట్లాటి ‘‘శ్రీ కారం’’ లోని కొత్త గళాల గొంతు పాట కొత్త కవులే కాకుండా చేయి తిరిగిన రచయితులు తమ కవితల ని శ్రీకారానికి జోడించడం ముదావహం. సామాజిక మాధ్యమంలో కవిత్వం పరిణితి చెందినది అని హేళనలకు గురి అవుతున్న సందర్భంలోక్రియేటివ్ ప్లానెట్ పేరుతో వాట్స్ అప్ గ్రూప్ కవిత్వం సంపుటిగా ముందుకు తీసుకుని రావడం సంతోషం. ఇది మరింత మందికి చేరాలని ఆశిద్దాం.

-పుష్యమీ సాగర్ 9010350317