పఠనీయం

యువతకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడింపల్లి జీవిత సంగ్రహం
-రావినూతల శ్రీరాములు
వెల: రూ.50
ప్రతులకు: గుంటూరు కేసరి సేవాసమితి
11,25,46.. శ్రీ సదనం కొత్తపేట, గుంటూరు-1 0863-22258

** ** *** ** * ****************

గుంటూరు నరస భూపతి స్వాతంత్య్ర సమర యోధుడు, గుంటూరు నరసభూపతిగా ప్రసిద్ధి చెందిన నడింపల్లి నరసింహారావు జీవిత సంగ్రహం ఇది. రావినూతల శ్రీరాములు కలం నుండి జాలువారిన ఈ రచన ఆద్యంతం చక్కని శైలి నిగారింపుతో కొనసాగింది. ఆధునిక వచన శైలితో ఈ సంవిధానం కొంచెం భిన్నంగా కనిపించినా చదువరిని తనతో తీసుకు వెళ్లడంతో కృతకృత్యమయింది.
నడింపల్లి నరసింహారావు యన్.వి.ఎల్. జనవరి 1, 1890లో జన్మించి 16 జనవరి 1978లో మరణించారు. ఆయన సుదీర్ఘ జీవిత ప్రస్థానంలో ఎన్నో మేలురాళ్లు, మైలురాళ్లు ఉన్నాయి.
ఆ కాలంలో పెదనందిపాడులో జరిగే పన్నుల నిరాకరణ ఉద్యమ సరళిని పరిశీలించడానికి మోతీలాల్ 1822 ఆగస్టు 1న గుంటూరు వచ్చారు.
గుంటూరు కలెక్టర్ రూథర్ ఫర్డ్ 144వ సెక్షన్ విధించాడు. మున్సిపల్ చైర్మన్ రజాక్ మొదలు సన్మాన పత్రం చదవడానికి ఎవరూ భయపడి ముందుకు రాలేదు. ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి నాయకులు అరెస్టు అయ్యారు. తనను చైర్మన్‌గా ఎన్నుకుంటేనే తాన సన్మాన పత్రం చదువుతానని షరతు పెట్టారు నడింపల్లివారు. మోతీలాల్ ప్రజల హర్షధ్వానాల మధ్య కలెక్టర్ ఉత్తర్వును రద్దు చేసి నడింపల్లి వారిని చైర్మన్‌గా నియమించారు.
విశాలాంధ్ర ఏర్పడుతున్నప్పుడు అదొక దుస్పరిణామమని గుర్తించిన వ్యక్తి నడింపల్లి. తెలంగాణ నాయకులు చెన్నారెడ్డి రంగారెడ్డిలతో ఆంధ్ర, తెలంగాణ కలయిక ఒక ధృతరాష్ట్ర కౌగిలి వంటిది అన్నారు నడింపల్లి.
1965 జులైలో విజయవాడలో జరిగిన పౌర హక్కుల రక్షణ సభకు శ్రీశ్రీ అధ్యక్షుడు, నడింపల్లి వారు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు.
ఈ విధంగా ఈ పుస్తకంలో నడింపల్లి వారి విలక్షణ వ్యక్తిత్వం ప్రతి కోణం నుండి వివరించబడింది. ఆయన న్యాయవాదిగా సాధించిన విజయాలు, ‘గుంటూరు కేసరి’ అని ప్రజలు ఆయనను పిలిచిన తీరు, ఆయనకు దుగ్గిరాలతో అనుబంధం, ఆయన హాస్య చతురత చక్కగా పొందుపరిచారు రచయిత రావినూతల శ్రీరాములు.
ఎంతసేపూ అమెరికా డాలర్లు, అడ్వాన్స్‌డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోజులో మునిగిపోతున్న ఈ తరానికి ఇలాంటి రచనలు ఎంతో అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవలసిన జీవిత సంగ్రహం ఇది.

-డా.కాంచనపల్లి 9676096614