పఠనీయం

భావకవిరాజు మూర్తిరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయాగరా నాట్య జలపాతం
నా అమెరికా సందర్శనా కావ్యం
ధర: అమూల్యం
ప్రతులకు పి.వి. మూర్తి రాజు 9949125796
========================================================
మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’ అని తిమ్మరుసు భువనవిజయం కొలువులో తెనాలి రామకృష్ణుణ్ణి ప్రశంసించినట్టు, ఈ మూర్తిరాజుగారు చూడడానికి సామాన్యుడిలా గోచరిస్తున్నా, నిస్సంశయంగా అసామాన్యుడే! ఎపుడో 1976 దశకాలలోని ‘తొలికాన్పు’ అనే చక్కని ఖండకావ్య కృతిని సాహిత్య లోకానికి అందించిన ఈ మూర్తిరాజు, అందరికీ సుపరిచితుడే! అనేక వేదికలమీద తన గళం వినిపించినవాడే! ఉత్తమ భావుకుడూ, సృజనశీలి అయిన మూర్తిరాజు పూర్తిగా కవితా రంగంలోనే గనుక కాలం గడిపి ఉండి వుంటే నిస్సంశయంగా అగ్రశ్రేణి కవులలో ఒకడై యుండేవాడు. బాధ్యతాయుతమైన ఉద్యోగ నిర్వహణవల్ల అలా జరిగి ఉండలేదని నా అభిప్రాయం.
‘‘రాతిలో దేవునికై - నేతి దీపం పెట్టకు
అన్నార్తుల కసరి- వారి మూతిమీద కొట్టకు
ఆకలితో అలమటించువాడె - అసలు దేవుడు
ఎదుటివాని అన్నంలో ఎపుడు మట్టిగొట్టకు’’
ఈ మాటలు సామాన్యుడైన కవి అనలేడు, వెంటనే అంతో ఇంతో సాహిత్య పద్య పరీజ్ఞానం ఉన్నవాడికి-
‘‘రాతిబొమ్మకేల రంగైన వలువలు - కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?’’-
అనే ప్రజాకవి వేమన్న ఆటవెలదుల పంక్తులు గుర్తుకువచ్చి తీరుతాయి. సమాజం, సమాజ శ్రేయస్సు కోరే వాడెప్పుడూ ఊహాల్లోకాల్లో విహరించడు. లోకపు లోతుల్ని చూడడానికే ప్రయత్నిస్తాడు. ‘దేశమంటే మట్టే’అని చెప్పడం మూర్తిరాజుకే చెల్లింది. తన కావ్యం ‘తొలి కాన్పు’, ‘మొదటి ప్రసవమే అయినా, సుఖ ప్రసవమే’ అని చెప్పుకున్న గుండెధైర్యం ఎంతమందికుంటుంది? అభిప్రాయాలు వెలిబుచ్చినవాళ్ళంతా కూడా సాహితీ రంగంలో లబ్దప్రతిష్ఠులే! ఆ కావ్యమును 1976లో పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు ‘తెలుగు వెలుగు’ బిహెచ్‌ఈఎల్‌వారి సాహితీ మహాసభలో ఆవిష్కరించి ఉండిరి. అటు సినిమా రంగ ప్రముఖులూ, రాజకీయ దురంధరులూ, సమాజ సేవాపరాయణులూ ముక్తకంఠంతో ‘ప్రతికంఠం’ వారిని ప్రశంసించినవారే! ఈ మూర్తిరాజును ‘వామనమూర్తి’ అనడం చాలా దోషం. ఈతడు నిజంగా చెప్పాలంటే ‘త్రివిక్రమమూర్తి’ రాజు ‘అన్యాయపు కౌగిలిలో నీతి కరిగిపోయె..’ అన్న ఈ కవి ఎంతటి సామాజిక స్పృహ కలవాడో అర్థమవుతున్నది.
1979లో మూర్తిరాజుగారు తన రెండవ కావ్యం ‘నవవనె్నల మధ్యధరా’ (నా లిబియా ప్రయాణానుభవాల వ్యాస కావ్యం)ను ప్రచురించి ఉండిరి. దానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమివారు కొంత ఆర్థిక సహాయము చేసి ఉండిరి. అట్టి కావ్యమును మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీ జె.బాపిరెడ్డిగారు బ్రహ్మాండమైన సాహితీ సభావేదికన (బిహెచ్‌ఇఎల్)లో ఆవిష్కరించి ఉండిరి. ఆ కావ్యం మిక్కిలి ప్రశంసలు పొంది ఉండెను. సరే ఇదంతా గత కావ్యం సంగతి. వర్తమానానికి వద్దాం!
ఈ తరంలో సాహితీలోకంలో అంతో యింతో పేరున్న ప్రతివారూ ‘అమెరికా’ సందర్శించి వస్తున్నవాళ్ళే! కారణం మన సంతానం అక్కడ ఉండడమే! ప్రస్తుతానికి వస్తే, ‘ఈ మూర్తిరాజు’గారు తాను ఇటీవల దర్శించి వచ్చిన అమెరికా దేశాన్ని కొంత మరియు నయగరా జలపాతం మా కండ్ల ఎదుట నిలబెట్టాడు. సామాన్యుడైతే చూచి ఆనందిస్తాడు. కవియైతే కలం పట్టుకుంటాడు. ఈయన అదేపని చేశాడు. అమెరికా వెళ్లి వచ్చిన ఛోటామోటా కవులు ప్రతివాళ్ళూ, వచ్చిన పక్షం రోజులలోనే తన అమెరికా సందర్శన విశేషాలు పుస్తక రూపంలో తెస్తున్నారు.
ఇటువంటివి నా ఎరుకలోనే 10, 15 పుస్తకాలు చూచాను. కానీ ఈ మూర్తిరాజుగారి ధోరణి వేరేగా ఉంది. చూచిన ప్రతి దృశ్యాన్ని కవితాత్మకరూపంలో మన కళ్ళముందు చిత్రించాడు. ఆయన హృదయంలో పాఠకులను బంధించాడు. చిత్రం, విచిత్రమేమిటంటే తాను ఎక్కడెక్కడ సంచరించాడో, ఆ ప్రదేశాలనన్నిటినీ చిత్రాలు తీసి మనకు సాక్షాత్కరింపజేశాడు. ఈ ‘నయాగరా నాట్యజలపాతం’ అనే చక్కని వచన, పద్య గేయ కావ్యంలో పరిణతభావుకుడైన మూర్తిరాజు, ప్రతి శీర్షికలో గోచరిస్తాడు.
- ఇంకాఉంది

అక్కిరాజు సుందర రామకృష్ణ , 9885020205