పఠనీయం

ఈ తరం కోసం.. గేయ కవిత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు:207, వెల:రూ.120/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ మరియు నవచేతన బుక్‌హౌజ్ అన్ని బ్రాంచీలు, సెల్:9291530714

(నిన్నటి తరువాయ)

1942లో శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటకు ఈ గ్రంథంలో చోటు కల్పించారు.
వట్టికొండ విశాలాక్షి 1943లో ‘సోదరీ’ పేరుతో ఓ పాటను రాసి స్ర్తిల పక్షాన నిలిచారు. కొండేపూడి లక్ష్మీనారాయణ పాడరా ఓ తెలుగువాడా! మన తెలుగు దేశపు భవ్య చరితపు దివ్యగీతమంటూ.. 1945లోరాసిన పాటకు కూడా ఈ గ్రంథంలో చోటు కల్పించారు. ‘ఏవి తల్లీ’ అంటూ శ్రీశ్రీ రాసిన కవితలో పసిడి రెక్కలు విసిరి కాలం / పారిపోయిన జాడలేవీ? అని ప్రశ్నించారు. ‘పలనాడు ... మాగాణిరా!’అంటూ పులుపుల వెంకట శివయ్య అంటే.. ‘మాదీ స్వతంత్ర దేశం’అంటూ బాలాంత్రపు రజనీకాంతరావు తమ గేయాన్ని కొనసాగించారు. ‘్భవకవి’ పేరుతో రాసిన గేయంలో సురవరం ప్రతాపరెడ్డి కవినైతినోరుూ! భావకవి నైతినోరుూ’ అంటూ ప్రారంభించారు.
అవత్స సోమసుందరం ‘శర్వరీగీతం’ ఆలపిస్తే సుంకర సత్యనారాయణ పంటచేను రొదను తమ గేయం ద్వారా వినిపించారు.
అక్షర జ్ఞానంబులేక.. లక్షలున్న ఫలము లేదంటూ కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రబోధ గీతానికి రూపం కల్పిస్తే.. అనిసెట్టి ప్రభాకర్ బిచ్చగాడి పాటను అక్షరాల్లో బంధించారు. చేయెత్తి జైకొట్టు తెలుగోడా! అంటూ వేములపల్లి శ్రీకృష్ణ పిలుపునిస్తే.. నాజీలను మంచిన నైజం సర్కరోడా అంటూ నైజాం ప్రభుత్వంపై బండి యాదగిరి తమ కలాన్ని ఎక్కుపెట్టారు. ఆలూరి బైరాగి ‘మాతృగీతిక’కు జీవం పోస్తే.. దాశరథి స్నేహగీతాన్ని రాసి.. నిజమైన మనిషిగా నిలిపేది స్నేహమేనని తమ ‘స్నేహగీతి’ గేయాన్ని చక్కగా ముగించారు.
కదలిరావే కృష్ణవేణీ.. కదలిరా! లోక కళ్యాణీ! అంటూ కరుణశ్రీ పిలుపునిస్తే.. పల్లెటూరి పిల్లగాడిని పనులు గాచే మొనగాడిగా.. సుద్దాల హనుమంతు తమ పాట ద్వారా మన ముందు నిలిపారు.
‘చెల్లీ!’ శీర్షికతో తుమ్మల వెంకట్రామయ్య 1953లో రాసిన పాట సందేశాత్మకంగా ఉంది. నవలోకం ప్రభవించు నువే / నవజీవం కుసుమించునులే / వగపేటికి చెల్లీ! పగబూనుము అని హితవు పలికారు.
అభ్యుదయ భావాలతో పుట్టపర్తి నారాయణాచార్యులు తమ ‘ఓ భ్రమరీ!’ గీతానికి అక్షరాకృతినిచ్చారు.‘కలము పోటున కదపజాలని / కావ్యగానమింకెన్నాళ్ళు?’ అని కాళోజీ ప్రశ్నిస్తే... మతి సుతి లేని ఊహాశూన్యుల మాటల గారడీ రోతా అంటూ తాపీ ధర్మారావు తమ కవితను కొనసాగించారు.1955లో ‘రోజులు మారాయి’ చిత్రం కోసం కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన ‘ఏరువాకా సాగారోరన్నా చిన్నన్న’ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే 1960లో కొనకళ్ల వెంకటరత్నం రాసిన ‘మొక్కజొన్న తోటలో..’ పాట అందరికీ చెక్కిలిగింతలు పెట్టేలా ఉంది.
నార్ల చిరంజీవి రాసిన పాటలో యువతరం శివమెత్తితే / నవయుగం అవతరించు / నవతరం గళమెత్తితే / నవశకం అవతరించు అంటూ యువత ప్రాశస్త్యాన్ని నొక్కి చెప్పారు.
పద పదరా భారత వీరా / పథమంతా నీ వశమేరా! అంటూ ఆచార్య ఎస్వీ జోగారావు ‘ప్రస్థానం’ పాటను రాస్తే... జయం మనది జయం మనది అంటూ పి.ఎస్.గోపాల్ తమ పాటకు రూపం కల్పించారు. 1978లో చెరబండరాజు రాసిన ‘కొండలు పగలేసినం’ పాటలో శ్రమ జీవన సౌందర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. గద్దర్ రాసిన ‘సిరిమల్లెచెట్టు కింద’, గూడ అంజయ్య రాసిన ‘ఊరు మనదిరా’,అల్లం నారాయణ రాసిన ‘ఎర్రజెండెన్నియలో’, గోరటి వెంకటన్నరాసిన ‘పల్లె కన్నీరు’, మరియు నందిని సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాల్లల్ల’ పాటలు గ్రంథానికి నిండు శోభను కూర్చాయి.
కలేకూరి ప్రసాద్ రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!, యాదగిరి రాసిన ‘నా చిట్టిచేతులు’, జయరాజ్ రాసిన ‘గోదావరి’పాటలు చైతన్యదీపికలుగా ఈ గ్రంథంలో కొలువుదీరాయి! ఆయా సందర్భాలలో జనచైతన్యం కోసం రాసిన ఇందులోని పాటలన్నీ ఈ తరంకు ఉపయుక్తంగా ఉన్నాయి!

పేజీలు:207, వెల:రూ.120/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ మరియు నవచేతన బుక్‌హౌజ్ అన్ని బ్రాంచీలు, సెల్:9291530714

-దాస్యం సేనాధిపతి 9440525544