పఠనీయం

మంత్ర, మాయాజాలపు, కొవ్వలి నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయ కొవ్వలి లక్ష్మీనరసింహారావు
(కొవ్వలి), వెయ్యవ నవల,
వెల:రూ.220/-,
ప్రతులకు:విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌస్ వారి వివిధ బ్రాంచీలు, మరియు
ఇ.బుక్:డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఆనంద్‌బుక్స్. కామ్
================================================================
అది 1930 ప్రాంతం. ఒక యువకుడు దారెంట నడుస్తున్నాడు. ఒకావిడ ఉద్గ్రంధంలోని పేజీని చించి, బిడ్డ మలాన్ని ఎత్తిపారెయ్యటం కన్పించింది. ఆక్షేపించిన ఆ యువకుడికి జవాబుగా ‘తాను ఆ గ్రంథం చదవలేదనీ అందులోని భాషను అర్థం చేసుకునే శక్తి తనకు లేద’ని చెప్పింది.
అప్పట్లో వెలువడుతోన్న సాహిత్యం అంతా శుద్ధ గ్రాంథిక భాషలో ఉంటూ, సామాన్య పాఠకుడికి అర్థం కాకపోయ్యేది.
ఆవిడ జవాబు ఆ యువకుడిలో ఆలోచనలను రేకెత్తించింది. కొందరికి మాత్రమే అర్థమయ్యే భాషతో, జన సామాన్యానికి అందుబాటులో లేని ధరతో ఉండటంవల్ల సాహిత్యం సామాన్య ప్రజలకు చేరలేకపోతోందని గ్రహించాడు. అక్షర జ్ఞానం కలిగిన ప్రతిఒక్కరూ, సాహిత్యానికి చేరువ కావాలని ఆశించాడు. ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యల్ని తన కథా వస్తువులుగా చేసుకుని, వాడుక భాషలో రాయటం ఆరంభించాడు. వంద పుస్తకాలకు పనె్నండున్నర రూపాయలకు అమ్మాలని తన ప్రకాశకులకు గట్టిగా నిర్దేశించాడు.
ఇక ఆయన వెనుదిరిగి చూడలేదు. 25 ఏళ్ళ ప్రాయానికే 400 నవలలు రాసాడు. పౌరాణికం, సాంఘికము శివ సాహిత్యం, అదీ ఇదీఆనకుండా, తనజీవితకాలంలో వెయ్యినొక్క నవలలు రాశాడు.
ఆయనే శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు (1912-1975). ఆనాటి జనానికి ‘కొవ్వలి’గా సుపరిచితుడయ్యాడు. భయంకర్, రాణి, జయశ్రీ కలం పేర్లతో కూడా రాశాడు. జీవితకాలంలో 1001 రచనలు చేసిన ఖ్యాతితెలుగు నాట మాత్రమే కాదు ప్రపంచ సాహిత్యంలోకూడా కొవ్వలికే దక్కుతుంది. తెలుగు నేలన పుట్టిన దురదృష్టానికి ఆయనకు దక్కవలసిన ఖ్యాతి దక్కలేదు.
తెలుగు సాహిత్యంలో సాంఘిక విప్లవాన్ని తెచ్చిన శ్రీ కొవ్వలి వెయ్యవనవల ఇది. మాతృ హృదయంగల ఏ తల్లికైనా అంకితం చేయాలన్న సదాశయంతో ఆనాటి మేటి నటి సూర్యకాంతంను ఎన్నుకున్నారు. ఆ తల్లి వేవేల కృతజ్ఞతలతో స్వీకరించింది.
రాజులు, రాజ్యాలు, మంత్రాలు, తంత్రాలు, భక్తి విశ్వాసాల సమాహారమే ‘మంత్రాలయ’ నవల.
మహేంద్రగిరి దేశపు రాజదంపతులకు లేకలేక మగ సంతానం కలుగుతుంది. వేడుకల్లో తేలియాడుతోన్న రాజదంపతులకు, ఆ పిల్లవాడి భవిష్యత్తును రాజగురువు నోటివెంట విని నిశే్చష్టులవుతారు. ఆ పిల్లవాడు లోక కంటకుడై సాధు సజ్జనుల హింసిస్తూ, మాతాపితరులను సైతం హత్యచేసి మహాపాపి అవుతాడని రాజగురువు చెబుతాడు.
చంపటానికి చేతులు రాక హిమత్పర్వత ప్రాంతంలో విడిచిపెట్టబడతాడు. ఆ బిడ్డ ‘దుందుభి’ అనే రాక్షసుని చేత బడుతుంది. ఆ బిడ్డ వివరాలు విన్న దుందుభి ఆ బిడ్డను 18 ఏళ్ళ ప్రాజ్ఞుడిగా చేసి యువరాజు శరీరంలో తాను ప్రవేశించి, తన శరీరంలో యువరాజు ప్రవేశించేట్లు చేస్తాడు. యువరాజు శరీరంలో వున్న దుందుభి దురాగతాలు, దుందుభి శరీరంలో వున్నయువరాజు ఎదుర్కొన్నాక చివరన యువరాజు మహారాజుల కలయికతో కధ సుఖాంతం అవుతుంది.
వాయు, జల స్తంభ విద్యలు, తుమ్మెదలతో యుద్ధం, కాల సర్పం, అంతరిక్ష ప్రయాణం, గంధర్వ కన్యలు, కైలాసంలోని శివపార్వతులు పాఠకులను అద్భుత ఊహాలోకంలోకి తీసుకెళతాడు రచయిత.

- కూర చిదంబరం 8639338675