పఠనీయం

అంతరంగమే ఈ పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసమర్థురాలి అంతరంగం
120 పుటలు.
రచయిత:రజనీ సుబ్రహ్మణ్యం,
బెంగుళూరు, ఫోన్:7760933547
*
‘‘బ్రాహ్మణ రచయితల్లో శ్రీ విశ్వనాధ సత్యనారాయణకి ఉన్నంత ఇంటలెక్చ్యువల్ ఏరోగెన్స్ బ్రాహ్మణేతర రచయితల్లో నాన్నగారికి ఉండేది..’
‘‘ ‘లక్ష్మమ్మ’లో ఆఖరి సీన్ చూస్తుంటే ఆ రోజుల్లో అంత టెంపో, సస్పెన్స్ పెట్టి ఎంతటి దర్శక ప్రతిభ చూపించారా అని అనిపిస్తుంది. అందుకే ‘శ్రీలక్ష్మమ్మ కథ’ కంటే ‘లక్ష్మమ్మ’హిట్ అయింది’’.
‘‘తన జీవితానికి ఒక పద్ధతి లేదంటాడు గానీ ఆ పద్ధతి లేని జీవితంలోనే చాలా క్రమశిక్షణణో ఉండేవారు’’.
‘‘..ఆయన అకస్మాత్తుగా పోవటంవలనే మా కంటే కూడా ఆయన పాత్రలకే అన్యాయం జరిగింది’’.
ఇలాంటి అద్భుతమైన వాక్యాలూ, వాటిలోని పరిశీలనా, కుండబద్దలు గొట్టే ధైర్యం మనకు వద్దన్నా తారసపడతాయి రజనీ సుబ్రహ్మణ్యం గారి ‘పితృదేవోభవ’ వ్యాసంలో!
కాట్రగడ్డ రజనిగా ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన రజనీ సుబ్రహ్మణ్యం ప్రఖ్యాత రచయిత గోపీచంద్‌గారి కుమార్తె! ఆవిడ ఇటీవల ‘అసమర్థురాలి అంతరంగం’ పేరున 120 పుటల పుస్తకాన్ని వెలువరించింది. ఇందులో 10 కథలూ, మూడు అనువాద రచనలు, ఏడు వ్యాసాలూ ఉన్నాయి. కూ ఛుక్ ఛుక్, ఓటమి, అబ్బా నానమ్మా..!, రాజకీయం, తిరుగని మలుపు, ఆవూరు, ఆరుష్, కందేలు, మీరు కథలు వ్రాయడం మానేయరూ! గెలుపు అనేవి కథలు. మూడు అనువాద వ్యాసాలు, ఏడు వ్యాసాలలో వారి నాన్న గోపీచంద్ గురించి రాసిన రెండు వ్యాసాలు చాలా విలువైనవి. ఈ వ్యాసాలను ఇదివరకు నేను చదవలేదు కనుక చాలా ఆనందం కల్గింది. కేవలం ఆ రెండు వ్యాసాలు ప్రస్తావించాలనే ఈ వ్యాసం రాస్తున్నాను.
‘‘మా అమ్మ గురించి చెప్పాలంటే వారిద్దరికీ అందంలో తారతమ్యం వున్నా, మేథస్సులో కాదు. ఆ రోజుల్లోనే ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు దగ్గర చదువుకున్న విద్యావేత్త ఆమె. హిందీ, తెలుగు పండితురాలు. అయినా సామాన్య గృహిణిగా ఒదిగిపోయింది. అది నాన్నగారికి క్లేశం కలిగించిందనుకుంటాను. ‘యమపాశం’ నవల చదువుతూంటే అనిపిస్తుంది. ఇద్దరూ ఆదిదంపతుల్లా వుండేవారు. ఆయన ఆకస్మిక నిష్క్రమణ అమ్మ తట్టుకోలేకపోయింది.’’
ఇలా సాగే రజనీగారి వ్యక్తీకరణ గమనిస్తే ‘రాయని భాస్కరి’గా మిగిలిపోయిందేమో అనిపిస్తుంది. ఈమె వాణిజ్యంలో రాణించారు, షార్ట్ఫిల్మ్స్‌లో నటించారు, గోపీ తోకచుక్క సినిమా మాటలకు సహరచయిత్రి. ఇపుడు ఈ పుస్తక రచయిత్రి. ఇలా ఇరవై రచనలను నూట ఇరవై పుటల పుస్తకం వెలువరించిన రజని ఇకముందైనా కలం కదిపినా, కంప్యూటర్ వౌస్ కదిపినా మంచిది. ఆమె కథల గురించి వేరొకరు మరోచోట రాస్తారు- రజనీకిగారికి అభినందనలు.

-డా.నాగసూరి వేణుగోపాల్