పఠనీయం

వేదనామయ జీవితం- స్ర్తికి నిర్వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు- కధలు
రచన: పలమనేరు బాలాజి
వెల:రూ.100/- కాపీలకు: శ్రీమతి గండికోట వారిజ, 6-219, గుడియాత్తం రోడ్, పలమనేరు- 517408. ఆర్.ఆర్.బుక్ సెంటర్, పలమనేరు. మణి బుక్‌స్టాల్, నెల్లూరు. విశాలాంధ్ర, నవతెలంగాణ వంటి ప్రముఖ పుస్తక విక్రేతలు)
======================================================================
ఒక వస్తువు యొక్క కవరు (వ్రాపర్) చూడగానే వినియోగదారుడికి ఆ వస్తువు మీద ఆసక్తి పెరగాలి. క్షణం సేపు ఆగి, మరికొన్ని వివరాలు సేకరించి గాని ముందుకు కదలాలి. దీనే్న కన్స్యూమరిజమ్ అంటారు. ఈ సిద్ధాంతాన్ని పలమనేరు బాలాజీగారు బాగా ఒంటపట్టించుకున్నారల్లే వుంది. ఈ కథా సంకలనం ‘టైటిల్’ చూసాక పాఠకుడికి ఉత్సుకత తప్పక కలుగుతుంది. ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు ఏమయింది?’ అనుకుంటాడు. చేతిలోకి తీసుకుని తిరగేస్తాడు.
తానున్న ఊరిపేరునే, తన ఇంటి పేరు చేసుకున్న పలమనేరు బాలాజీకి ఇలా ప్రథమ వీక్షణంలోనే పాఠకుడిని ఆకట్టుకోవటము తెలుసు. ఆకట్టుకున్నాక, తన వెంట తీసుకుని వెళ్లి తన ఆలోచనా ప్రపంచంలో విహరింపచేసి ఎనె్నన్నో క్రొత్త కోణాల్ని ప్రదర్శించటం తెలుసు. మనిషికి, మనిషికి మధ్య సంబంధాల్ని కొత్త భాషలో నిర్వచించటము కూడా తెలుసు.
ఒకనాటి సాయంత్రం కధకుడు తన భార్య, కూతురు కంటె ముందే ఇంటికి చేరుతాడు. తాళాన్ని తీసి, ఇంకా తెరవబడని తలుపు వేపే తదేకంగా చూస్తూ నిలబడిపోతాడు. ఇంట్లోని నిశ్శబ్దం తనకే వింతగా అనిపిస్తుంది. తన ఇల్లే, సందేహంలేదు. అయినా ఏదో పరాయితనం. కూతురు (చరిత్ర) ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎందుకు రాలేదు? కారణం? ఏమయి ఉండొచ్చు?? నీరీక్షణ ఎంతో కష్టమైన విషయం అన్న తెలివిడి కలుగుతుంది? ఒక్కరోజు నీరీక్షణే ఇంత పెద్ద పరీక్షగా ఉందే- భార్య విశాల నిరీక్షణ ఎప్పటిదో.. ఎనే్నళ్లదాకో..
టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కధకుడి లాంటి వారలకు తప్పని నిరీక్షణ (ఒక నాటి సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు).
గృహిణి కావేరి జబ్బుపడుతుంది. భర్త, తనకు తోడుగా ఉండమని చేతన, దర్శినిలను (పిల్లలు) పిలుస్తాడు. కావేరి ఒంట్లోకైతే బావుంది కానీ మనసుకే కష్టంగా ఉంటుంది. కూతుళ్ళకు కాపరాలుంటాయి. వాళ్ళ వాళ్ళ అత్తింటివారు ఏమనుకుంటారో..? రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఏవేవో ఆలోచనలు.. కూతుళ్ళిద్దరూ తేలిగ్గా తీసుకుంటారు. కావేరీకి వాళ్ళ తెంపరితనానికి లోపల అబ్బురంగాను, అద్భుతంగానూ ఫీల్ అవుతుంది. కాని పైకి ఏదో కంగారు. (కొన్ని ప్రేమలు.. కాసిన్ని దుఃఖాలు)
స్ర్తి అంతర్యాన్ని, ఆలోచనలను బహుశా బాలాజీ చిత్రించినంతగా మరే రచయితా చిత్రించలేకపోతాడేమో..కవిత్వంలో అనుభూతమయ్యే ఆర్ద్రతనీ, సాంద్రతనీ కధల్లోకి సైతం అలవోకగా వంపాడు రచయిత. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన నేటి జీవితాల్లో- అదీ స్ర్తిల జీవితాల్లో మానవీయమైన అంతశే్చతనను మేల్కొలిపే ప్రయత్నంలో భాగంగా రాయబడ్డ కధలు అనిపిస్తుంది.
ఈ కధలు చదవండి అని స్పృశించిన వేరు వేరు తలాల్లోకి వెళ్లి అధ్యయనం చేయండి. మననం చేసుకోండి. ఇవి గొప్ప కధలని మీరూ ఒప్పకుంటారు.

-కూర చిదంబరం 8639338675