పఠనీయం

సరళ సుందర భావార్థ దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘువంశము తృతీయ సర్గము;భావార్థ వివరణ:చింతగుంట సుబ్బారావు, పుటలు:52, వెల:రూ.30/-, ప్రతులకు సి.సుబ్బారావు, కేరాఫ్ సి.శేషుప్రసాద్, 208, శ్రీగ్థ ఎన్.వి.ఆర్. ఆర్కేడ్, స్ట్రీట్ నెం.12, తార్నాక, సికింద్రాబాద్-500017.
=================================================
‘కవిత్వం అంటే కప్పి చెప్పిటం; విమర్శ అంటే విప్పి చెప్పటం’. కద్రు కవిత్వానికి కాళిదాసు ‘రఘువంశం’ చిరునామా. విలక్షణ విమర్శకు మల్లినాథుని వ్యాఖ్యానం తిరుగులేని, చెక్కుచెదరని ‘విలాసం’.
‘ఉపమస్య కాళిదాసః’- సముచిత ఉపమానాలు ఇవ్వటంలో కాళిదాసు కడుంగ సమర్థుడు. అతని ‘కవి హృదయాన్ని’ పట్టుకొని కమనీయ వ్యాఖ్యానం చేసిన మల్లినాథుని రచన సంస్కృత కృతి కావటం చేతను, అందరికీ అది తేటతెల్లం చేయటం కోసమూను దానిని తెలుగు చేసినవారు చాలామంది ఉన్నారు. అలాంటి మేలును కూర్చినవాళ్ళలో చింతగుంట సుబ్బారావుగారు ఒకరు. కొన్ని ఏండ్ల క్రిందట విద్వాన్ చక్కిరాల మున్నగువారు కూడా రఘువంశంలోని కొన్ని విశేషాలు, అలంకారాలు వివరిస్తూ పుస్తకాలు రాశారు. అయితే మళ్లీ ఇపుడు (కొన్ని నెలల క్రితం) సుబ్బారావుగారు ‘రఘువంశ’ భావార్థ వివరణను టీకా తాత్పర్య సహితంగా తనదైన శైలలో పాఠకులకు అందించారు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథవారు ‘తనదైన అనుభూతి తనదిగానే’ అన్నట్టు.
మల్లినాథుని అడుగుజాడల్లోనే ఈ తెలుగు కృతి కూడా అందంగా రూపుదిద్దుకుంది.
37వ శ్లోకమైన ‘విభావసుః సారథినేవవాయునా / ఘనవ్యపాయేన గభస్తిమానివ / బభూ వతే నాతి తరాం సు దుఃఖసహః / కటప్రభే దేన కరీవ పార్థివః’- (యువరాజుగా పట్ట్భాషిక్తుడైన ఆ రఘు కుమారుని చేత దిలీప మహారాజు దుస్సహ సార్వభౌముడైనాడు. అదెట్లున్నదనగా వాయువు చేత దీప్మింతుడైన అగ్ని వలె, మేఘ రహితకాశమున సూర్యుడు వెలుగు రీతి, చెంపల వెంట మదము స్రవించుట చేత మహాగజము వలె అతడు పట్టరానివాడై చెలగినాడు) అనే శ్లోక తాత్పర్యాలకు చింతగుంటవారు చేసిన విశదీకరణ బాగుంది.
అగ్ని స్వయముగా జ్వాలలు కలవాడు. దానికి గాలి తోడైతే అగ్నియొక్క దహనశక్తి ద్విగుణీకృతమవుతుంది. మబ్బులున్నపుడు గూడా సూర్యుని అస్తిత్వం తెలుస్తూనే ఉంటుంది. కానీ అవి తొలగిపోతే మార్తాండుడు చండ ప్రచండుడవుతాడు. ఏనుగుకు మద జలస్రావం ప్రారంభం కాకముందు కూడా అది మహాబలిగానే ఉంటుంది. కానీ మద జలస్రావం మొదలైనాక దాని మదాతిశయాన్ని ఎవరూ నియంత్రించలేరు. ఇక్కడ అగ్ని, సూర్యుడు, ఏనుగు దిలీపునికి ఉపమానాలు. వాయువు తోడ్పాటు, మేఘ నిష్క్రమణము, హస్తి మద జలస్రావము దిలీప పుత్రుడైన రఘుకుమారునకు ఉపమానాలు. కొడుకు చేతికి అందివచ్చాక తండ్రి జవసత్త్వ ధైర్యోత్సాహాలు ఇబ్బడిముబ్బడి అవుతాయి. ఇక్కడ దిలీపుడు శత్రువులకు అజేయుడైనాడు.
‘ఆత్మావై పుత్రనామాసి’ అని కదా! దిలీపుని గత వన వదము వాని కుమారుని రూపమాన పునరుద్భవించినది. సూర్యవంశుడైన దిలీపుడు స్వయంగా సూర్య తేజస్వి. కానీ చాలాకాలము సంతానపు లేమి దిలీపుని మనోవీధిని చింతామేఘ పటుల రూపంలో కమ్మేసింది.. ఇలా వివిధ కోణాలలో ఉపమానోపమేయాల సాదృశ్య సమన్వయాల్ని చాలా చక్కగా సంవదించారు రచయిత.
‘పుంసవనాదికాలు’, ‘జాతకర్మ’ ఇత్యాది సాంప్రదాయికాచారాల వివరణను కూడా ఈ పుస్తకంలో చూడగలం.ఆయా వ్యాఖ్యానాల సందర్భాల అవసరాలను బట్టి కొన్ని కొన్ని చోట్ల భగవద్గీత శ్లోకార్థాలతో సహా భావసమన్వయం చేశారు సుబ్బారావుగారు.
14వ పుటలో ‘కుమార భృత్యాకుశలైరనుష్ఠితే..’ అన్న శ్లోకంలో దదర్శ అంటే చూచెను అనే అర్థమే కాకుండా దర్శము అంటే అద్దము. సుదక్షిణ అద్దమై దిలీపుని ప్రతిబింబాన్ని ప్రదర్శించటానికి ఉద్యుక్తురాలైంది- గర్భవతిగా అంటూ విశేర్థాన్ని చెప్పటం చింతగుంటవారి వ్యాఖ్యాన నైపుణ్యానికి తార్కాణం. ఇందులోని సంస్కృత ‘్ధర’, ఆంగ్ల ‘హీరో’ శబ్దాలు కాగ్నేట్స్ (సజాతి సమానార్థక శబ్దాలు); ‘సంస్కృత శబ్దములు ధాతు జన్మములు. కనుక శబ్ద వ్యుత్పత్త్యర్థము చెప్పునపుడు ధాత్వర్థమును గౌరవించుట పరిపాటి’ మొదలైన వాక్యాలు భాషా శాస్త్ర రుచిని, అభిరుచిని, ఆసక్తిని పెంచుతాయి పఠితకు. రచనంతా సరళజాతి సరళ గ్రాంథిక సుందరంగా సాగిపోయింది. ఇది సమర్థవంతమైన భావార్థ వివరణ గ్రంథమనే చెప్పాలి మొత్తంమీద.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290