పఠనీయం

వింత ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటిలో మలి వెలుగు (నవల)
-డా.కనుపూరు
శ్రీనివాసులురెడ్డి
పుటలు: 400+
ప్రతులకు: రచయిత
పొట్టిశ్రీరాములు వీధి
సూళ్లూరుపేట
94418 71791

చీకటి ఉంటుంది. తొలి వెలుగు వస్తుంది. చీకటి చెల్లాచెదరు అవుతుంది. అప్పుడు మలి వెలుగు వస్తుందా? వస్తే తెలుస్తుందా? రచయిత ఈ నవలను మనోవైజ్ఞానిక నవలగా భావించారు. ఆ మాటే ముఖపత్రం మీద అచ్చు వేశారు. (అన్నట్టు ముఖపత్రం మీది బొమ్మలు ఎవరో సినిమా వాళ్లవి అని పుస్తకం చూచిన ఒకరు అన్నారు. ఆ సంగతి తెలియదు గానీ కవర్‌పేజీ అందంగా హుందాగా ఉంది.)
డాక్టర్లకు జెనెటిక్స్ తెలిసి ఉంటుంది. మరీ అంత లోతుగా తెలియదని అనుమానం. ఒక జన్యువు, అనే జీన్ నుంచి మనిషి తిరిగి పుట్టడం గురించి ఈ రచయిత ఆలోచించారు. ఒక మిత్రుని హఠాన్మరణం కారణంగా ఆయనకు చావు గురించి ఆలోచనలు మొదలయినయి. చావు లేకుండా చేయవచ్చా? అన్న ప్రశ్న పుట్టింది. ఈ నవల తయారయింది. అయితే జీన్ అంటే ఆత్మ, ఆత్మ అంటే జీన్ అనే దాకా వెళ్లింది. కథ రాసుకుంటే దాన్ని తప్పు పట్టడం తప్పు. అయినా, శరీరంలో ఒక జన్యువు ఆధారంగా మొత్తం శరీరాన్ని, దానికి ప్రాణాన్ని ఇవ్వడం కొంచెం ‘మరీ దూరం సాగిన ఆలోచన’. కానీ తన ఆలోచనకు ఆధారంగా ఈ రచయిత బోలెడు చర్చ సాగించారు. అవి అందరికీ అర్థంకావని అనుమానం వచ్చింది. పుస్తకం అచ్చువేయాలా అని అనుమానం కూడా వచ్చింది.
‘ఏం ఫరవాలేదు. నవల చాలా బాగుంది. అచ్చు వేయండి’ అంటూ అందరూ రచయితను ముందుకు నడిపించారు. అందులో అంపశయ్య నవీన్ ఒక ముందు మాట కూడా రాసి మరీ కదిలించారు. ఈ నవల సాధారణ పాఠకులకు అర్థం కావడం కష్టమే అంటూ నవీన్, నాకే పూర్తిగా అర్థం అయ్యిందని చెప్పలేను, అంటూ కప్పదాటు కూడా వేశారు! చివరకు ఈ నవలను సైన్స్ ఫిక్షన్ విభాగం కిందకు చేర్చారు.
మోమాటం లేకుండా చెప్పాలంటే నవలలో చదివించే శక్తి లేదు. నాలుగు పేజీలు వరుసబెట్టి చదివితే, కొంతకాలం దాన్ని పక్కన బెట్టాలి అనిపిస్తుంది. ఆ కొంత కాలంలో ఆలోచనలు, అప్పటివరకు చదివిన సంగతుల గురించి సాగితే గొప్పగా ఉంటుంది మరి అట్లా జరుగుతుందా?
పుస్తకం విస్తరించిందని నవీన్ అన్నారు. అందుకే ఇటువంటి రచనలకు ఒక సంపాదకుడు ఉంటే బాగుంటుంది. అచ్చుకు ముందే చదివిన వారు, పుస్తకాన్ని కుదించేందుకు సాయం పడితే బాగుండేది.
కొత్తదనం కొరకు చూచేవారు నవలను చదువుతారేమో? ఇది మామూలుగా చదవదగిన రచన కాదని ఇప్పుడు, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

-గోపాలం కె.బి.