పఠనీయం

ఆధ్యాత్మిక ఔన్నత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి
ఈగ బుచ్చిదాసు
(సంకీర్తనలు- శతకము- బతుకమ్మ పాట)
పరిష్కర్త: డా.పి.్భస్కరయోగి
పేజీలు: 156, వెల: రు.70/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకడమీ,
రవీంద్రభారతి కాంపౌండు, హైదరాబాదు

ప్రపంచ తెలుగుమహాసభలు-2017 జరిగిన సందర్భంలో తెలంగాణ సాహిత్య అకాడమీవారు ప్రచురించిన గ్రంథమిది. దీనికి పరిష్కర్త డా.పి.్భస్కరయోగి. తెలంగాణ పద సంకీర్తనా సాహిత్యం విశిష్టమైంది. తెలంగాణ ప్రాంతంలో తత్త్వబోధనలకు, సంకీర్తనలకు, శతక సంపదలకు కొదువ లేదు అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి తమ ముందుమాట ‘తెలంగాణ సాహితీ వైభవం’లో చెప్పారు.
తెలంగాణకే గర్వకారణమైన పవిత్ర యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గురించి మరింగంటి కవుల నుంచి ఈగ బుచ్చిదాసువరకు ఎందరో మహాకవులు ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, శ్రీ స్వామివారి మహాత్మ్యాన్ని కీర్తించారు. ఈగ బుచ్చిదాసు ఆ కోవలోని పద సంకీర్తనాకవి.
ఈయన గుమాస్తాగా పనిచేస్తూ ఆరోగ్యం బాగాలేక యాదగిరి గుట్టకు వచ్చి శ్రీ స్వామి ఆదేశంతో శ్రీ నరసింహస్వామి వారిపై కీర్తనలు రచించారు. ఆయన ఉపదేశ గురువు చెన్నయ్య (చెన్నదాసు). ప్రముఖ శిష్యురాలు బుచ్చమ్మ (సాధు బుచ్చమాంబ).
దాసుగారు తన రచనలకు రాగ, తాళ నిర్దేశం చేశారు. అది ఆయనకు గల సంగీత పరిజ్ఞానానికి ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ పలుకుబడులు, జాతీయాలు, భక్తివేదాంత విషయాలకు చెందిన ఎన్నో పారిభాషిక పదాలు ఉపయోగించారు. వారు యాదగిరిగుట్టలోనున్న శివుని కీర్తించి తన అద్వైతం ప్రదర్శించారు. ‘పావనమైనా శివుని మంత్రము- పరమార్థమండీ’(కీర్తన-56) అలాగే ‘చూడా చక్కని దేవుడండీ- హరిని, చూచినంతనేకనులకానందమండీ’ (2వ కీర్తన). అలాగే ఆయన మంగళ హారతులు, ‘‘యాదగిరి వాస నరహరీ సాధు పోష’ అనే మకుటంతో, శ్రీ యాదగిరి నరహరి శతకం వ్రాశారు. దాంట్లో ‘‘యే కులంబని నన్ను యెవరన్నడిగితే యేకులంబో నాకు యెరుక లేదు’’. తొలి యొనర్చిన కర్మవలన నాకిల పద్మశాలియంచును బిల్వసాగినారు’’. వేదాంత సారము. ‘‘జన్మ మరణాలలో జారకుండినయదే శ్రేష్ఠ కులంబంచు జెప్పనగును.’’ దీంట్లో శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బతుకమ్మ పాట కూడా కలదు. ఈ గ్రంథం ఈగ బుచ్చిదాసు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, తెలంగాణ మాండలికాల మీద ఆయనకు గల పట్టు, ఆయన సంగీత జ్ఞానం అన్నీ తెలుపుచున్నది. వీటిని వెలుగులోకి తెచ్చి పరిష్కరించిన డా.పి.్భస్కరయోగి అభినందనీయుడు.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649