పఠనీయం

బంగారంలాంటి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నమ్మ చెప్పిన జాతకకథలు
వెల: రూ.150
ప్రతులకు: ధర్మదీపం
ఫౌండేషన్
కేరాఫ్ హైదరాబాద్ స్టడీ సర్కిల్
ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్స్
దోమల్‌గూడా, హైదరాబాద్- 500 029.
040-27635654
చాలా మంచిమంచి కథలు. ప్రతీ పాపాబాబూ చదివి తీరాల్సిందే. అసలు నానమ్మ కథలు చెప్తూ వుంటే, ఇష్టపడని పిల్లలుంటారా? ఈ నానమ్మ చెప్పిన జాతక కథలూ అంత గొప్పగా వున్నాయి. పిల్లలు ఇష్టంతో చదవడమే కాదు, చదివి అందులోని అర్థాన్ని గ్రహించాలి, ఆచరించాలి. ఉదాహరణకు, ‘చందమామలో కుందేలు’. చందమామను చూస్తూంటే అందులో ఒక ముసలమ్మ కూర్చున్నట్టో, కొండలు వాటి నీడలు, ఇలా రకరకాలుగా మనకి ఊహలొస్తాయి. పిల్లలందరూ తలో మాటా చెబుతారు. అలాగే ఇక్కడ అక్కా, తమ్ముడూ, నానమ్మా ముగ్గురి సంభాషణలూ ఉంటాయి. అక్కాతమ్ముళ్ల గిల్లికజ్జాలు, నానమ్మ సర్ది చెప్పడం, దాని గురించి చక్కటి కథ చెప్పడం, బాలబాలికలను ఆలోచింపజేస్తాయి. మంచి మార్గంలో నడవడానికి మార్గదర్శకమవుతాయి. ‘బుద్ధుడి జాతక కథలు’ జ్ఞాపకం రాక మానదు, ఈ పుస్తకం పేరు చూడగానే. బుద్ధుడు సామాన్య ప్రజానీకాన్ని మార్చడానికి అలా జాతక కథలు చెబితే, ఈనాడు సమాజంలో జరుగుతూన్న విషయాల కనుగుణంగా ఎలా తెలివిగా మసలుకోవాలో, అమ్ములు, తేజ ద్వారా సమయపాలన కథ చెబుతుంది. కథలు చదివి వినిపించాలనుకునే పెద్దలకి కూడా ఆసక్తి కలిగేలా వున్నాయి. ఇందులో ఇరవై కథలున్నాయి. దేనికదే గొప్ప కథ.

సువర్ణరేఖ
-జానకీబాల ఇంద్రగంటి
వెల: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
అసలు జుట్టంటూ వుంటే, జడ వేసుకోవచ్చు. ముడి వేసుకోవచ్చు, విరబోసుకోవచ్చు. జుట్టే లేకపోతే, విగ్గుపెట్టుకుంటే, సహజంగా వుండే జుట్టులా వుండదు కదా! జానకీబాల ఇంద్రగంటి గత అయిదు దశాబ్దాల నుంచి పాఠకులకు చిరపరిచితమే. నాటి నుంచీ కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూనే ఉన్నారు. ఆమె రచనలలో నిజాయితీ కనిపిస్తుంది. కథావస్తువు సహజంగా సమాజంలో జరుగుతూన్న విషయాల మీద కనబడుతుంది, ఆమె స్పందన.
‘పెళ్లికి బంగారం ఎందుకు?’ ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటే, పెళ్లికి వెండీ, బంగారాలు, ఈ మధ్య డైమెండ్లూ (వజ్రాలు), ప్లాటినంలూ, లక్షలూ, కోట్లు కరెన్సీ. ఇవన్నీ అవసరమా? పెళ్లికి కావలసింది ఏమిటి? పెళ్లయ్యాక ఉండవలసినది ఎలా? ఈ ప్రశ్నలకి సమాధానం, కావలసింది ఒకరిపై ఒకరికి ప్రేమ. గౌరవం. వీటిని పక్కనపెట్టి, నగలు, బట్టలు వగైరా వగైరాలకు ప్రాముఖ్యాన్నిచ్చి విలువలను మట్టుపెడుతున్నారు. కనుకనే, నేటి పెళ్లిళ్లు చాలామట్టుకు పెటాకులై పోతున్నాయి. పెళ్లీ, వెంటనే విడాకులు. ఈ విషయం జానకీబాల ‘సువర్ణరేఖ’ కథలో వివరించారు. చివరికి ఆడవాళ్లకి బంగారం మీద మమకారం వయసొచ్చినా పోదు అని నిరూపిస్తుంది ఈ కథ. కొడుకు వలసలకు పోయి సంపాదించి పంపే డబ్బుని బంగారంలోకి మార్చడం. ఇలా వాస్తవికమైన, విషయాలను చక్కని కథలుగా రాయడం, జానకీబాల ప్రత్యేకం. అంతేకాదు. ఎంత వున్నా ఎక్కడో ఒక మూల స్ర్తిలలో, సంసారాల్లో ఒక చిన్న ఒత్తిడి, అసంతృప్తి రేఖ ఉంటూ ఉంటుంది. ఆ వొత్తిడి స్ర్తిలకి పోవాలి అని సందేశాన్నిస్తారీమె. ఇలా కథల గురించి చెప్పుకుపోవడంకన్నా, ప్రతీవారూ ఈ కథలను చదివి తెలుసుకుంటే సంతోషం.

-శారదా అశోకవర్థన్