పఠనీయం

ఓ వైపు ఊహా సౌందర్యం.. మరో వైపు భక్త్భివం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహాసౌదామిని
-శ్రీమతి గుమ్మన్నగారి (వేలేటి) బాలసరస్వతి
వెల: అమూల్యం
పేజీలు: 136
ప్రతులకు: వేలేటిసాంబశివశర్మ
ఇం.నెం.14-194/1,
మారుతీనగర్, సిద్దిపేట

ఊహాసౌదామిని ఒక అద్భుత గేయ చిత్రమాలిక రచయిత్రి తాను రచించిన గేయాలకు స్వయంగా తానే చిత్రాలను గీసుకున్నది. ప్రతి గేయానికి ఒక చిత్రం. ఇలా ఇంతకు ముందు గేయ చిత్రమాలికా రచయిత(త్రు)లు చేసిన వారు బహు కొద్దిమందే.
తెలంగాణలో ప్రసిద్ధులైన కీ.శే.గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అష్టావధాని గారి కుమార్తె బాలసరస్వతి. వీరి అన్నగారే సుప్రసిద్ధులైన బాలశ్రీనివాసమూర్తి. వీరి తండ్రిగారు బాలా. మంత్ర ఉపాసకులయి ఉండవచ్చు. పేరులో బాలా శబ్దము చేర్చినారు. దానికి తగ్గట్లే గ్రంథాన్ని మూడు భాగములు 1.దైవమా.. 2.్భవమా.. 3.జనగీతమా.. (జానపదాలు). ఇది బాలా మంత్రానికి ప్రతీక. బాలా మంత్రం మూడక్షరాలకు (ఐం.క్లీం.సౌ) రచయిత్రి ఇలా మూడు గీత భాగాలుగా చెప్పారేమో అని నాబోటి శ్రీవిద్యోపాసకులకు అనిపిస్తుంది.
‘బాల’ వికాసం అని ముందు మాటలో ప్రసిద్ధ పండితులు దోర్బల విశ్వనాథశర్మ గారు ఇలా అన్నారు. రచయిత్రి గేయములలో సరళ, బాల, మరియు ప్రౌఢ భావములు హృదయమున గ్రహింపదగినవై యున్నవి. భక్తి, ప్రకృతి, జానపద సాంఘికాంశములుగా భిన్న భిన్న గేయములతో సరళత మరియు గాంభీర్యము కానవచ్చును.
నీరజ నేత్రికి ‘నీరాజనము’ (1-3), ఆ దేవీ కరుణా కిరణమ్ముల చేత తన హృదయ కమల వికాసమును చెప్పుకున్నారు. వీణాపాణి (1-2) గేయములో ఆమె వీణా నిస్వనములు తన మదిని తాకవలెనని కోరారు.
శ్రీశైల, కోటిలింగాల ఆలయంలో పరమేశ్వరుని సేవించు గేయాలు, ఇంకా ‘యామిని’ - ఇలా కొన్ని గేయాలలో ప్రకృతి వర్ణనము చేసిన తీరు అద్భుతం.
యామిని - ఊహాసౌదామిని (2-3) గేయంలోని ‘ఊహా సౌదామిని’ అని ఈ గ్రంథానికి నామకరణం చేయటంలోని ఔచిత్యం తెలుస్తున్నది.
రచయిత్రి కొన్ని గేయాలకు వివరణ తానే తన ముందు మాటలో వివరించారు. ఉదాహరణకు నాలో కలిగే భావమా, పెండ్లిపీటలు, ఉగాదీ నేనూ వంటివి.
మొత్తం మీద ఈ గ్రంథంలో దైవమా-లో 16, 2 భావమాలో 40, 3.జనగీతమా -10, 66 గీతాలున్నాయి. జనగీతమా-లో ‘చినికిన నేత’లో నేతన్న వ్యధను వర్ణించారు. ఊహా సౌందర్యాలలోను వర్ణించటంలోనే కాక, భక్త్భివనలు వెదజల్లడంలోనే కాక, సామాజిక సమస్యలపై అవగాహనలతో కూడా ఈ 66 గీతాలు ఒప్పారుతున్నాయి అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు.

-నోరి నరసింహశాస్ర్తీ