పఠనీయం

‘విజయనగర సామ్రాజ్య వైభవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్మయి కల (నవల)
(A Complation of Drama)
-ఉప్పు రాఘవేంద్రరావు
పేజీలు: 103
వెల: రూ.110
ప్రతులకు: రచయిత,
ఎల్‌ఐసి కాలనీ, సైదాబాద్
హైదరాబాద్

చరిత్ర, దేశద్రోహం, విధ్వంసం, అపరాధ పరిశోధన, ప్రేమ - ఇవన్నీ కలబోసి కల్పించిన నవల ఉప్పు రాఘవేంద్రరావు రచించిన ‘కిరణ్మయి కల’. హంపీ గురించిన కలతో ఈ నవల ప్రారంభమవుతుంది.
కిరణ్మయి అనే ఓ అందమైన అమ్మాయి కాలేజీలో చదువుతూ హాస్టల్‌లో వుంటుంది. కొద్దిరోజుల క్రితం రాబర్ట్ సీవెల్ రాసిన ‘ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్’ అన్న పుస్తకం చదువుతుంది. ఈ పుస్తకంలో, విజయనగర సామ్రాజ్య వైభవం, హంపీ నగర శోభ కళ్లకు కట్టినట్లుగా వర్ణించబడి ఉందట! ఒక పుస్తకంలో చదివిన సంఘటనలు, పాత్రలు జాగ్రదావస్తలో కూడా సజీవంగా కనిపించటం ‘పారానీషియా’ అంటారట! పారానీషియాకు లోనైన కిరణ్మయి వార్డెన్ మలయవాసిని సలహా మేరకు విజయనగర సామ్రాజ్యాన్ని తన ‘్థసిస్’ విషయంగా తీసుకుని హంపీకి వెళ్తుంది. ఇంతలో, హంపీలోని భువనేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారి కిరీటం - ‘కరండ మకుటం’ చోరీకి గురవుతుంది. ఆనాటి కృష్ణదేవరాయలు భువనేశ్వరీ దేవికి స్వయంగా అలంకరించిన కిరీటం అది. దేశ ప్రతిష్ఠ, దైవద్రోహమైన విషయం కనుక, సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్) వారు ‘ప్రత్యగాత్మ’ అనే చాకులాంటి యువకుడిని, పరిశోధనకై పంపుతారు. ఆయన ఆత్మారాంగా పేరు/ వేషం మార్చుకుని, హంపీలో గైడ్‌గా కూపీ లాగుతూంటాడు.
ఈ క్రమంలో ప్రత్యగాత్మ కిరణ్మయి ఇద్దరూ దగ్గరవుతారు. కరండ మకుట కిరీటపు చోరీ ‘సి.మి.’ అనే ఉగ్రవాద సంస్థ పనే అని తేల్చి, కిరీటాన్ని దేశసరిహద్దులు దాటకుండా కట్టడి చేస్తాడు ప్రత్యగాత్మ. భువనేశ్వరీ దేవికి ప్రత్యగాత్మ స్వహస్తాలతో కిరీటం అలంకరించటంతో నవల ముగుస్తుంది.
అడుగడుగునా సస్పెన్సు, నాటకీయత, గొప్ప పఠనీయత పెంచిన ఈ నవలలో పాఠకులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పుట్టుమచ్చని ఇంగ్లీషులో ‘సైకోఫోర్’ (పే.37) అంటారట. మనిషికి పి.ఎల్.ఆర్. (పాస్ట్ లైఫ్ రిగ్రెషన్) -గతంలోకి ప్రయాణించటం అనే శక్తి ఉంటుందట (పే.6) డేవిడ్ లాసన్ అనే మహావైజ్ఞాన శాస్తవ్రేత్త పి.ఎల్.ఆర్.తో ఎందరికో వారి జీవితాల్లో నిరాశా నిస్పృహలను దూరం చేశాడట. ఈ జన్మలో అనారోగ్యాలకు మూలం కనిపెట్టి ఆరోగ్యవంతుల్ని చేశాడట (పే.6) చరిత్రను నవలీకరించటం అన్నది ఒక అసిధారావ్రతం. నిజాలను కప్పిపుచ్చకుండా, ప్రముఖ వ్యక్తుల ‘కేరెక్టర్’కు విఘాతం కలిగించకుండా నవలను నడపగలగాలి. బహుభాషా ప్రవీణులు, ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో ఉద్యోగరీత్యా విస్తృతంగా పర్యటించిన రాఘవరావుగారు ఈ చారిత్రాత్మక వివరాలు కలిగిన నవలకు గొప్ప న్యాయం చేకూర్చుతూ, పాఠకులకు ఎన్నో ఆసక్తికరమైన, విజ్ఞానదాయకమైన వివరాలు తెలియజేశారు.

-కూర చిదంబరం 8639338675