పఠనీయం

జాతికి వైతాళిక గీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇదేమి చరిత్ర’?
-ఆంగ్ల మూలం:
సీతారాం గోయెల్
ఆర్.సి.మజుందార్
ఆంధ్రానువాదం:
వి.వి.సుబ్రహ్మణ్యం
డా.వడ్డి విజయసారథి
పుటలు: 192
వెల: రూ.120
ప్రతులకు: సాహిత్య నికేతన్
3-4-852, కేశవ నిలయం
బర్కత్‌పురా
హైదరాబాద్-27.

‘యత్ యత్ అచరత్ తత్ తత్ త్రాయత ఇడి చరిత్రం - ఏది ఏది జరిగిందో ఆయా దానిని భద్రపఱచటం చరిత్ర. కానీ దీనికి విరుద్ధంగా దురదృష్టవశాత్తు భారతదేశ చరిత్ర రచన పాశ్చాత్య చరిత్రకారుల చేతులలోపడి ఒక పరిశోధనాత్పూర్వ నిర్ధారిత విషయావళి (Committed and Prejudiced matter - series) గా ఒక వికృత, అవాస్తవ, అసంబద్ధ రచనంగా, జాతీయ సమైక్యతా భంజనంగా రూపుదాల్చింది. అదే తప్పుల తడకను నేటి కుహనా లౌకిక వాదులు, వామపక్ష భావజాల ‘ఐంద్రజాలికులు’, కొందరు స్వార్థ, కుటిల రాజకీయ ప్రయోజన కాంక్షా పూర్వకపు (అ)రాచకీయ నాయకులు, భారత జాతీయ భావ వ్యతిరేకులైన రాజనీతి శాస్త్ర, చరిత్ర ఆచార్య మేధావులు, కప్పదాటు పద్ధతి కమిటీ అయిన ‘విద్యా విషయక, పరిశోధన, మరియు శిక్షణల జాతీయ సంస్థ (N.C.E.R.T.) కలిసి సంయుక్తంగా అభిమన్యుడిని అధర్మ యుద్ధంలో జయించిన కౌరవుల బలగంలాగా ఎలా సంపూర్ణ అధర్మ (అసత్య) దుర్గంధ భూయిష్టంగా చేస్తున్నారో, అది ఏ విధమైన పునాదిలేని నిర్మాణమో తెలియజేస్తూ గతంలో ‘పుష్యమిత్ర’ నవల, విశ్వనాథ వారి రచనలు, ‘ఏది చరిత్ర?’ ‘ఇదీ చరిత్ర’ లాంటి పుస్తకాలు చాలా వచ్చాయి. ఇంకా చాలా వస్తున్నాయి- శ్రీహరిబాబు సూరానేని రచన ‘శ్రీ రాఘవం! శ్రీ మాధవం!!’ ఇంద్రకంటి వెంకటేశ్వర్లు రాసిన ‘హిందూ నాగరికత ప్రాచీనత - వైశిష్ట్యము’ మొదలైనవి. అదే సత్య దర్శన రచన కోవలో ఇటీవల వచ్చిన మరో మంచి పుస్తకం ‘ఇదేమి చరిత్ర?’ దీనికి ఆంగ్ల మూలకర్తలు సీతారాం గోయెల్, ఆర్.సి.మజుందార్, తెనిగించిన వారు వి.వి.సుబ్రహ్మణ్యం, డా.వడ్డి విజయసారథి.
హజఒఆ్యక జఒ త్ద్యీ తీళ ఘూళ, త్దీక తీళ ఘూళ ఘశజూ ఆ్దళ త్ఘీక తీళ ఘూళ (మనం ఎవరమో, ఎందుకు ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో చెప్పేది చరిత్ర)’ అన్నాడు ప్రసిద్ధ చారిత్రక రచయిత అమెరికాకు చెంన డేవిడే మెక్కుల్లా.
భారతీయుల విషయంలో - ముఖ్యంగా హిందువుల విషయంలో - పై మూడు ప్రశ్నలకూ తిరుగులేని ఆధారాల పూర్వకంగా జవాబులు దొరుకుతాయి. ఇందులోని పనె్నండు అధ్యాయాలూ సంపూర్ణంగా చదివితే, ఆ చూపిన, క్రోడీకరించిన ఆధారాలు కూడా ‘హిందూ మతోన్మాదులు, హైందవ ఛాందసవాదులు’ అని అనుక్షణం కుహనా లౌకికవాదులు తిట్టిపోసే హైందవ రచయితల గ్రంథాలు కాదు. ఎప్పుడో కొన్ని శతాబ్దాలనాడే (కొన్నైతే సహస్రాబ్ది క్రిందటే) మహమ్మద్ బిన్ కాశిం రాసిన ‘చచ్‌నామా’ గ్రంథం, ఫిరోజిషా తుగ్లక్ రాసిన ‘సిరాత్ ఇ ఫిరోజ్’ కుంటి తైమూర్ రాసిన ‘తుజ్క్ - ఇ- తైమూరి’, విల్‌డ్యూరాంట్ రాసిన ‘స్టోరీ ఆఫ్ సివిలైజేషన్’, అల్ బిలాదురి రాసిన ‘్ఫతుహుల్ బుల్‌దాన్’ మొదలైన గ్రంథాలు, అవి తెలియజేసే ఘోరాలు, దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు, మతాహంకారాలు, మతవ్ఢ్యౌలు, రాక్షసత్వాలు, రక్తపిపాసతలు చదివితే ప్రతి భారతీయుడి - ముఖ్యంగా జాతీయ భావ హిందువు - యొక్క రక్తం ఉడికిపోతుంది.
ద్యఒళ త్ద్యీ జ్యూశ’ఆ రీశ్యతీ హజఒఆ్యక ఘూళ జూళఒఆజశళజూ ఆ్య ళఔళ్ఘఆ జఆ (గత చరిత్ర తెలియకుంటే అదే పునరావృతం చేసుకున్నవాళ్లం అయిపోతాం)’ అని హెచ్చరిస్తాడు ఐరిష్ రాజనీతి శాస్తవ్రేత్త, తత్త్వవేత్త అయిన ఎడ్మండ్ బర్క్. ఇదే సత్యాన్ని మనస్సులో పెట్టుకొని ఆర్.సి.మజుందార్ ‘్భయంగాని, ఈర్ష్య, అసూయలు గానీ, రాగద్వేషాలు గానీ, స్వలాభాపేక్ష మొదలైన రాజకీయ - తదితర కారణాల వల్ల గాని, జాలి, కరుణ మొదలైన మానవీయ బలహీనతల వల్ల గానీ ప్రభావితం కాకుండా సత్యాన్ని ప్రకటించాలి. నిర్దుష్టమైన మార్గాలుగా చరిత్రకారులచే అంగీకరింపబడిన సూత్రాల ననుసరించి వాస్తవాన్ని వెల్లడి చేయటమే చరిత్ర రచనలోని ఏకైక లక్ష్యం’ అంటాడు ఒక దిశా నిర్దేశం చేస్తూ 179వ పుటలో.
‘్భరత వర్ష సమైక్యతకు ఇస్లాం ఏమీ దోహదం చేయలేదు సరికదా మన జాతీయ సమైక్యత యొక్క అంతస్సూత్రాన్ని అది తీవ్రంగా దెబ్బతీసింది. తత్ఫలితంగా చివరికి మన దేశాన్ని ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అనబడే ముక్కలుగా చీలిపోయేలా చేసింది’ అంటాడు 163వ పుటలో సీతారాం గోయెల్.
ఈ చారిత్రక వాస్తవాన్ని తెలుసుకొని జాతి జాగృతిని పొంది జాగర్త పడాలి ఇప్పటికైనా, ఎప్పటికైనా అనేది ఈ పుస్తక సారాంశం, సజావైన సందేశం. ఈ సందర్భంగా ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు థియొడార్ రూజ్వెల్ట్ History is who we are, why we are and the way we are
(గతాన్ని గురించి నీవు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే భవిష్యత్తును అంత బాగా తీర్చిదిద్దుకుంటావు)’ అన్న మాటలు గుర్తొస్తాయి.
ఈ గ్రంథంలో అనువాద వాక్యాలు ఎక్కడో కొద్దిచోట్ల కించిత్తు కృతకాలుగా ఉన్నా, మొత్తం మీద సరళతా సుందరంగా సాగిపోయింది ఆంధ్రీకరణం.
ఆత్మ విస్మృతి చెందిన నేటి భారత జనతకు ‘అభారతీయత’ వైపు జోగుతున్న మన కొంతమంది ఆధునిక యువతకు ఒక వైతాళిక గీతం ఈ పుస్తకం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం