పఠనీయం

వెలుగునింపే ‘దీపం’ స్ర్తివాద కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం
కథల సంపుటి
సోల్ డిస్ట్రిబ్యూటర్స్,
అమరావతి పబ్లికేషన్స్,
గుంటూరు - 522 007.
వెల: వంద రూపాయలు

కొడవటిగంటి కుటుంబరావుగారి కథతో ‘దీపం’ కథలు ప్రారంభమవుతాయి. స్ర్తికి వాక్‌స్వాతంత్య్రం, ఆర్థిక స్వాతంత్య్రం, గౌరవం ఈ మూడు తప్పక కావాలని చెప్పే కథ, కుటుంబరావుగారి పిన్ని. పిన్ని ప్రవర్తన కామాక్షిని ఎలా ఆలోచింపజేస్తుంది, చక్కగా చెప్పారీ కథలో. రెండో కథ అబ్బూరి ఛాయాదేవిగారి ‘బోన్‌సాయి బ్రతుకు’ - చదువుకోని, స్వతంత్రంగా సంపాదనా ఆర్థిక స్తోమత లేని మధ్యతరగతి స్ర్తి జీవితం, పెరట్లో హాయిగా, స్వేచ్ఛగా పెరిగే వృక్షంలా కాకుండా పదిమందికి నీడ కల్పించగల వృక్షంలా కాకుండా, అదే ఎవరి సంరక్షణ మీదో ఆధారపడి ఉంటే, ప్రతీదానికీ ఏ మాత్రం స్వేచ్ఛలేని స్ర్తిలాగా పోలుస్తుంది అమ్మలూ వాళ్ల అక్కయ్య. ప్రతీ స్ర్తికి మహావృక్షంలా పెరిగే స్వాతంత్య్రం కావాలని చెప్పే చక్కని కథ ఇది. మాఘసూర్యకాంతి పి.సత్యవతి కథ. అత్తింట్లో ఆరళ్లు పడుతూ మొగుడిచేత చావుదెబ్బలు తింటూ కాపురం చేస్తున్న కన్నబిడ్డ బాధని తల్లి అర్థం చేసుకుంటుంది కానీ, తండ్రి పరువు ప్రతిష్ఠ అంటూ కమల అక్కడే పడుండాలని ఆజ్ఞాపిస్తాడు. ఎన్నడూ ఎదురుచెప్పని తల్లి, భర్తకి ఎదురుతిరిగి కమలని కాపురానికి పంపనుగాక పంపనని భీష్మిస్తుంది. అయి పుట్టింటి ఆదరణ లేక, ఆర్థిక స్వాతంత్య్రమూ లేకనే ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆమె నిర్ధారించుకుని బిడ్డని పంపదు. భర్తని మారుస్తుంది నచ్చచెప్పి. అలా ఆ ఇంట్లో మాఘ సూర్యకాంతి వెలిగింది. ఇక ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా ‘గోడలు’ కథలో అత్తాకోడళ్ల మధ్య అడ్డుగోడల్ని, ప్రేమ, ఆప్యాయత అనే దినుసులతో ఎలా కూలగొట్టెయ్యొచ్చునో, అవి కూలిపోతే, జీవితం ఎంత సంతోషంగా గడపవచ్చునో, ఈ విషయంలో మగవాళ్లకి ఆ చాకచక్యం ఉండకపోగా, ప్రతీ చిన్న విషయంలోనూ అమ్మనో ఆలినో తప్పుపట్టి మాటల తూటాలు పేల్చడం తప్ప, చతురత ఉండదని వివరిస్తారు. ఇంకా కుప్పిలి పద్మ, జానకీబాల, నల్లూరి రుక్మిణి, పాపినేని శివశంకర్ వంటి రచయితల కథలున్నాయి. అన్ని కథలూ చెప్పేస్తే ఎలా? మీరు ఈ పుస్తకాన్ని కొని చదవాలి. చక్కని కథల సంపుటి, నన్నపనేని అయ్యన్‌రావుగారు ప్రచురించారు. ‘పట్టువిడుపు స్వభావం, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఏ జంటకైనా అవసరం. జీవిత భాగస్వామిలో పరిపూర్ణతను ఆశించకూడదు. ప్రతి వ్యక్తిలో చిన్నవో పెద్దవో లోపాలుంటాయి. ఆ వ్యక్తిని ప్రేమించడం అంటే ఆ లోపాలతోసహా ప్రేమించడం, ఆ పరిమితులతో సహా జీవితంలోకి ఆహ్వానించడం’ అంటారు డా.డి.నారాయణరెడ్డిగారు.

--శారదా అశోకవర్థన్