పఠనీయం

దేవీ ఉపాసన..ఆత్మ తత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకరణి
(ఆధ్యాత్మిక వ్యాసాలు)
-డా.పుట్టపర్తి నాగపద్మిని
పేజీలు: 76
వెల: రూ.75
*
‘శ్రీకరణి’ అనగానే శ్రీలలిత సహస్ర నామాలలో ఉండే ‘శ్రీకరీ’ నామం గుర్తుకు వస్తుంది. అయితే రచయిత్రి పెట్టిన పేరుకు కారణం వారింట్లో అరటిపండు ముక్కలు, కుంకుమ పువ్వు, కొబ్బరికోరు, బెల్లం (చక్కెర), కాచినపాలు కలిపిన మధుర పదార్థానికి పెట్టిన పేరు. ఈ గ్రంథంలో 17 ఆధ్యాత్మిక వ్యాసాలు ఉన్నాయి. వివిధ పత్రికల వారు ప్రకటించిన వ్యాసాలు వారు సంకలించి ప్రచురించారు. మొదటి 5 వ్యాసాలు దేవీ ఉపాసన - ఆత్మ తత్వం గురించి ఉన్నాయి. తరువాత 7,8,9,10,11,13 వ్యాసాలలో శివుని గురించి నారాయణుని గురించి వివరించి రచయిత్రి తమకున్న శివకేశవులు వేరువేరు కాదనే అద్వైత భావాన్ని ప్రదర్శించారు. 16, 17 వ్యాసాలలో తెలంగాణలో ఆరాధ్య దైవాలయిన బతుకమ్మను గురించి, సమ్మక్క సారలమ్మల గురించి వారి కథల గురించి మనోహరంగా వివరించారు. ఆధ్యాత్మికతను అభిమానించే వారందరూ ఈ వ్యాసాలు చదివితే బాగుంటుంది.

--నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ 9849793649