పఠనీయం

దేనికదే విభిన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
వ్యాస సంకలనం
సంపాదకులు: ఆచార్య కె.సర్వోత్తమరావు
పుటలు: 76
వెల: అమూల్యం
పారిజాత ప్రచురణ, తిరుపతి
9700414000
*
ఒక పాట తొలి పాదం శీర్షికగా వచ్చిన వ్యాస సంకలనంలో ఏ విషయాలుంటాయి? అట్ట మీద తెలుగుతల్లి బొమ్మ కనబడుతుండగా, వెనుక అట్ట మీద 17 లైన్ల పాట ప్రత్యక్షం. ఉపోద్ఘాతంగా తొలి పుటలు కనబడే మూడు పద్యాలలో చివరిది ఇలా ఉంది:
అమ్మ మెచ్చెడి పాట ఆట పాట
మంగళారతులెత్తిన మంచి పాట
శంకరంబాడి సుందరాచారి పాట
మా తెలుగు తల్లి పాటను మరువనగునె?
అవును ‘దీనబంధు’ చిత్రం కోసం 1946లో శంకరంబాడి సుందరాచారి రాసిన గీతం తిరస్కరించబడింది. టంగుటూరి సూర్యకుమారి చొరవతో పాట పాడటంతో ఆ పాట ఎంతోమందికి తెలిసింది. 1975 తొలి తెలుగు ప్రపంచ మహాసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది.
సినీ కథానాయకుడు 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన సమయం నుంచి ఈ పాట విరివిగా మారుమ్రోగింది. ఈ గీతం నాలుగు విభాగాలుగా కనబడుతుంది. తొలుత తెలుగు తల్లి స్వభావాన్ని వివరించి, పిమ్మట రెండు నదులు గోదారి, కృష్ణలనూ ప్రస్తావించి పంటలు గురించి పేర్కొంటారు సుందరాచారి. తర్వాత శిల్పం, సంగీతం, సాహిత్యం గురించి సంబంధిత ప్రతీకలనూ, నలుగురు చారిత్రిక వ్యక్తులను గుర్తు చేస్తారు. దీనితో ఈ పాట ముగుస్తుంది. అయితే ఇందులో ప్రస్తావించబడే ప్రతీకలు ఏడింటిని వివరించడానికి ఏడు వ్యాసాలు రాయించాలని సర్వోత్తమరావు తలంచారు. తనతోపాటు తన ఆరుగురు మిత్రులతో సప్తవ్యాసాలు రాయించారు. అవి డెబ్బై పేజీలలోపు అర్థవంతంగా అమరిపోయాయి.
* అమరావతి అపురూప శిల్పాలు - డా.గల్లా చలపతి
* త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు - డా.జె.మునిరత్నం
* తిక్కయ్య కలములో తియ్యందనాలు - డా.కె.సర్వోత్తమరావు
* రుద్రమ్మ భుజశక్తి - కె.దామోదరనాయుడు
* మల్లమ్మ పతిభక్తి - బి.శ్రీరాములు
* తిమ్మరసు ధీయుక్తి - జి.లక్ష్మీనారాయణ
* కృష్ణరాయల కీర్తి - జి.దామోదరనాయుడు
ఈ ఏడు వ్యాసాలలో వస్తువు దేనికదే విభిన్నం. ఏడుగురు మంచి పరిశోదన చేసి చక్కని వ్యాసాలు రాశారు. అమరావతి శిల్పం, త్యాగయ్య సంగీతం గురించి చాలా విలువయిన సమాచారాన్ని ఇక్కడ గుదిగుచ్చడం ముదావహం. తిక్కన రచనా పాటవం గురించి, శైలి గురించి బాగానే చర్చించారు ఇంతకు ముందు చాలా సందర్భాలలో. ఇక్కడ సోదాహరణంగా వివరించి ‘అట్టి సుకవిని తిక్కయ్య యంటివేల’ అని సుందరాచారిని ప్రశ్నిస్తారు సర్వోత్తమరావు చమత్కారంగా. ఇక రుద్రమ్మ, మల్లమ్మ, తిమ్మరుసు, కృష్ణరాయలు గురించిన విశే్లషణలు పూర్తిగా చారిత్రాత్మకం.
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పుస్తకం చిరు పుస్తకమైనా వెలలోనే అమూల్యం కాదు; వస్తుపరంగా కూడా అమూల్యమైనది! ఈ సప్త వ్యాస రచయితలకు అభినందనలు. సంపాదకులకూ అభినందనలు.
*

-డా.నాగసూరి వేణుగోపాల్ 9940732392